ETV Bharat / sitara

అక్షయ్‌ కుమార్‌తో కన్నీళ్లు పెట్టించిన అజయ్ - అక్షయ్ కుమార్ అజయ్ దేవగణ్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్​ ట్విట్టర్ వేదికగా భారత సైనికులపై 'మేరా నామ్ సిపాయి' అంటూ ఓ పద్యం పంచుకున్నారు. దీనిపై స్పందిస్తూ మరో నటుడు అక్షయ్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Ajay Devgn
అజయ్
author img

By

Published : Jul 28, 2021, 8:58 PM IST

ఎంతటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను నియంత్రించుకోగలిగిన వాళ్లను కూడా కదిలించేంది.. మనసు కరిగించేది.. ఉద్వేగానికి గురి చేసేది దేశభక్తి మాత్రమే. అది రాజకీయ నాయకులైన బాలీవుడ్‌ స్టార్‌ నటులైనా. తాజాగా భారత సైనికులపై 'మేరా నామ్‌ సిపాయి' అంటూ బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ చెప్పిన ఓ పద్యం అక్షయ్‌కుమార్‌తో పాటు సునీల్‌ శెట్టితో కన్నీళ్లు పెట్టించింది. భారత సైనికుల త్యాగాలను, గొప్పతనాన్ని అభివర్ణిస్తూ పద్యం చదువుతూ అజయ్‌ ఓ వీడియో రూపొందించారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ వీడియో చూసిన అక్షయ్‌ కుమార్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

"నా నిజజీవితం విషయానికి వస్తే చాలా భావోద్వేగమైన విషయాలను నేను వ్యక్తీకరించను. కానీ.. ఇది నాకు కన్నీళ్లు తెప్పించింది. అజయ్‌ దేవగణ్‌ మీలో ఇంత అద్భుతమైన కవి ఉన్నారని మాకు తెలియదు. మీరు మా హృదయాలను గెలుచుకున్నారు" అని అక్షయ్‌ రాసుకొచ్చారు.

అయితే.. ఆ పద్యం రాసింది అజయ్‌ కాదు.. మనోజ్‌ ముంతాషీర్ అనే రచయిత అని తెలియడం వల్ల అక్షయ్‌ తన పొరపాటును సరిదిద్దుకున్నారు. మరో ట్వీట్‌ చేస్తూ.. "ఈ అద్భుతమైన పద్యం రాసింది ముంతాషిర్ అని ఇప్పుడే తెలిసిందే. అది అజయ్‌ దేవగణ్‌ చదివి వినిపించారు" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • I’m not very expressive when it comes to emotions in real life. But this got me in tears. @ajaydevgn, I didn’t know you have a brilliant poet in you. Kis Kis baat pe dil jeetoge yaar? pic.twitter.com/KofhbNizV7

    — Akshay Kumar (@akshaykumar) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాగా.. ఈ పద్యంపై మరో బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ కూడా స్పందించారు. "భారతీయ సైనికుల ధైర్యసాహసాలకు అజయ్‌దేవగణ్‌ హృదయపూర్వక నివాళులర్పించారు" అంటూ రాసుకొచ్చారు. సునీల్‌శెట్టి స్పందిస్తూ.. "దేశం, సైనికుడి ఇంత గురించి గొప్పగా మాట్లాడిన నా ప్రియమైన స్నేహితుడికి హృదయపూర్వక అభినందనలు. కన్నీళ్లు వస్తున్నాయి" అంటూ ట్వీట్‌ చేశారు.

అజయ్‌ దేవగణ్‌ ప్రధానపాత్రలో 'భుజ్‌' అనే చిత్రం తెరకెక్కింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్‌ ఓ ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్ లీడర్‌గా కనిపించనున్నారు. 1971 భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెలలో ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. అభిషేక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, నటి సోనాక్షి సిన్హా, ప్రణీత తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఇవీ చూడండి: అందంలో ఆహా.. అంతర్జాలంలో వారెవా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.