ETV Bharat / sitara

చిరు కొత్త సినిమాలో తమన్నా.. ఆసక్తిగా 'అర్జుణ ఫల్గుణ' టీజర్​ - భోళాశంకర్​ తమన్నా

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్​'లో హీరోయిన్​గా తమన్నా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక రాజ్​తరుణ్​ 'అనుభవించు రాజా' సినిమాలోని ఓ సాంగ్​ విడుదలైంది.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Nov 9, 2021, 1:43 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్' సినిమాలో(bhola shankar movie 2021) హీరోయిన్​గా తమన్నా ఖరారైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం(chiranjeevi tamanna movie). అంతకుముందు చిరు నటించిన 'సైరా నరసింహరెడ్డి' సినిమాలోనూ తమన్నా నటించింది. ఇక సినిమా షూటింగ్​ను నవంబరు 11న ఉదయం 7.45గంటలకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. తమిళ హిట్​ 'వేదాళం'(vedhalam telugu movie) రీమేక్​గా 'భోళాశంకర్​' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చిరుతో(chiranjeevi movies) పాటు ఆయన సోదరిగా కీర్తి సురేశ్​(keerthy suresh movies) నటిస్తోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. మెహర్​ రమేశ్(meher ramesh chiranjeevi) దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

cinema updates
తమన్నా

టీజర్​

'రాజ రాజ చోర'తో ఇటీవల బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న యువ కథానాయకుడు శ్రీవిష్ణు(arjuna phalguna teaser) నటించిన మరో చిత్రం 'అర్జున ఫల్గుణ'. మ్యాట్నీ ఎంటర్ టైమ్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా టీజర్​ను చిత్ర బృందం విడుదల చేసింది. 'నాది కానీ కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయానంటూ' శ్రీవిష్ణు చెప్పే సంభాషణలు అర్జున ఫాల్గుణపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించగా.. సీనియర్ నరేష్, శివాజీరాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సాంగ్​తో

యువ కథానాయకుడు రాజ్​తరుణ్ నటించిన 'అనుభవించు రాజా' సినిమాలోని 'నీ వల్లే రా' సాంగ్​ విడుదలై ఆకట్టుకుంటోంది. నవంబరు 26న (anubhavinchu raja movie release date) థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించగా, గోపీసుందర్ సంగీతమందించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చూడండి: RRR movie: 'నాటు నాటు' సాంగ్​ ప్రోమో వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.