ETV Bharat / sitara

Jaibhim movie: సూర్య ఇంటి వద్ద భారీ బందోబస్తు - surya latest news

తమిళ హీరో సూర్యకు భద్రత కల్పిస్తూ ఆయన ఇంటి వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు(jaibhim movie controversy). ఇటీవలే 'జైభీమ్'​ సినిమా విషయంలో ఆయనకు బెదరింపులు రావడమే ఇందుకు కారణం(surya latest news).

surya
సూర్య
author img

By

Published : Nov 17, 2021, 4:41 PM IST

తమిళ స్టార్​ హీరో సూర్య నటించిన 'జై భీమ్​'(jaibhim movie controversy) ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమా ఓ వైపు ప్రశంసలను పొందుతూనే విమర్శలను కూడా అందుకుంటోంది. ఈ క్రమంలోనే సినిమా విషయంలో హీరో సూర్యకు బెదరింపులు వచ్చాయి(surya latest news). దీంతో ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు. చెన్నైలోని ఆయన నివాసం వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటుచేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ జరిగింది

'జైభీమ్​' సినిమాలో తమ వర్గాన్ని కించపరిచారంటూ వన్నియర్​ సంఘం చిత్రబృందానికి లీగల్​ నోటీసులను పంపింది. రూ.5కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా సూర్యను ఎవరైనా కొడితే లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని ప్రకటిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పీఎంకే జిల్లా కార్యదర్శి పళని సామి. ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా సంచలనం రేపింది. దీంతో సూర్యకు పలువురు ప్రముఖులు, అభిమానులు అండగా నిలుస్తున్నారు. ఆయనకు మద్దతుగా సోషల్​మీడియాలో పోస్ట్​లు పెడుతూ 'వి స్టాండ్​ విత్​ సూర్య' అనే హ్యాష్​ట్యాగ్​ను ట్రెండింగ్​ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పళని సామిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: సూపర్​హిట్ 'జై భీమ్​'పై ఇన్ని వివాదాలు ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.