ETV Bharat / sitara

సినీనటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం - నటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్​ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని నటుడి సోషల్​మీడియా బృందం ఫేస్​బుక్​లో పోస్ట్​ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఏ సమాచారం ఇవ్వలేదు.

actor pruthviraj road accident
సినీనటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం
author img

By

Published : Oct 20, 2020, 6:10 PM IST

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఈ ఘటన జరిగిందంటూ పృథ్వీరాజ్‌ టీం ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించింది. ‘"బంజారాహిల్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్‌ వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైంది. చుట్టుపక్కల జనాలు గుమిగూడారు’" అంటూ ధ్వంసమైన కారు ఫొటోను షేర్‌ చేసింది. అయితే నటుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గతంలో పృథ్వీరాజ్‌ కరోనా బారినపడ్డారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకున్నట్లు ఆగస్టులో చెప్పారు. "నాకు పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. లక్షణాలు ఉండటం వల్ల ముందు జాగ్రత్తలో భాగంగా క్వారంటైన్‌ సెంటర్‌కి వెళ్లమని, 15రోజులు నిర్బంధంలో ఉండాలంటూ వైద్యులు సూచించారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నా" అని పృథ్వీరాజ్‌ అప్పట్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి 'అందుకే హీరో కావాలని అనుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.