ETV Bharat / sitara

పవన్‌కల్యాణ్‌కు దిష్టి తగలకూడదు: పృథ్వీరాజ్‌

Bheemla Nayak: 'భీమ్లానాయక్‌' లాంటి అద్భుతమైన చిత్రంలో నటించలేకపోయిందని చాలా బాధపడినట్లు చెప్పారు నటుడు పృథ్వీరాజ్. పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ను ఇలాంటి పాత్రలో చూసి అందరి దిష్టి తగిలి ఉంటుందని, ఆయనకు అది తగలకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.

bheemlanayak
pawan kalyan
author img

By

Published : Feb 27, 2022, 2:41 PM IST

Bheemla Nayak: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం 'భీమ్లానాయక్‌'పై నటుడు పృథ్వీరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాను వీక్షించిన ఆయన ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడారు. సినిమా తనకు ఎంతో బాగా నచ్చిందని.. పవన్‌కల్యాణ్‌కు దిష్టి తగలకూడదని అన్నారు.

bheemlanayak
'భీమ్లానాయక్‌'లో పవన్

"రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, పవన్‌కల్యాణ్‌ అభిమానులకు నా అభినందనలు. ఇటీవలే నేను 'భీమ్లానాయక్‌' చిత్రాన్ని చూశాను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా 'అడవి రాముడు'. ఆ సినిమా విడుదలైనప్పుడు మా తాడేపల్లిగూడెంలోని విజయాటాకీస్‌కు వెళ్తే.. భారీగా తరలివచ్చిన అభిమానుల్ని కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఎన్టీఆర్‌ తర్వాత ఆ క్రేజ్‌ పవర్‌స్టార్‌కే చూశా. క్లైమాక్స్‌, పవర్‌స్టార్‌, రానా కాంబోలో వచ్చిన సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. ఒక ప్రేక్షకుడిలా ఈ చిత్రాన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా చూస్తున్నంతసేపు, ఒక రకమైన బాధలో ఉండిపోయాను. ఇంత అద్భుతమైన చిత్రంలో నేను నటించలేకపోయానే అని విచారంగా ఉంది. చాలా రోజుల తర్వాత పవన్‌కల్యాణ్‌ని ఇలాంటి పాత్రలో చూసి అందరి దిష్టి తగిలి ఉంటుంది. ఆయనకు అది తగలకూడదని కోరుకుంటున్నా" అని పృథ్వీరాజ్‌ అన్నారు.

ఇవీ చూడండి:

Bheemlanayak: 'పవన్​ ఫైర్​ను ఆపడం చాలా కష్టం'

పవర్​.. వాట్ ఓ పెర్ఫార్మెన్స్.. 'భీమ్లా నాయక్'పై మహేశ్​ ట్వీట్

'భీమ్లా' గ్రాండ్​ పార్టీ​.. విజయ్​ కొత్త సినిమా అప్డేట్​.. శ్రుతికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.