ETV Bharat / sitara

పూర్తిగా కోలుకున్న కమల్​​.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - కమల్​హాసన్​ కరోనా వైరస్​

kamal haasan corona virus: కరోనా బారిన పడిన దిగ్గజ నటుడు కమల్​హాసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు.​ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్​గా మారింది.

ఆస్పత్రి నుంచి కమల్​హాసన్​ డిశార్చ్​, Actor Kamalhassan discharge from Hospital
ఆస్పత్రి నుంచి కమల్​హాసన్​ డిశార్చ్​
author img

By

Published : Dec 4, 2021, 11:36 AM IST

Updated : Dec 4, 2021, 1:52 PM IST

kamal hassan discharge: ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న దిగ్గజ నటుడు కమల్​హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయన.. ​ఐసోలేషన్​ నుంచి బయటకొచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి సిబ్బందితో కలిసి ఆయన దిగిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్​గా మారింది.

నవంబరు 22న కమల్​ హాసన్​కు కరోనా సోకింది. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న తర్వాత​ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని కమల్​ ట్విట్టర్​లో తెలిపారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే డిసెంబరు 1న కరోనా నుంచి ఆయన కోలుకున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. కానీ డిసెంబరు 3వరకు ఆయన ఐసోలేషన్​లోనే ఉంటారని స్పష్టం చేసింది.

త్వరలోనే కమల్​.. 'విక్రమ్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లోకేశ్​ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్​ సేతుపతి, ఫహాద్​ ఫాజిల్​ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీతో పాటు శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'ఇండియన్​ 2'లోనూ కమల్​ నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్​ ప్రారంభిమైన ఈ సినిమా తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఇదీ చూడండి: Kamal Haasan covid: కరోనా నుంచి కోలుకున్న కమల్​ హాసన్​

Last Updated : Dec 4, 2021, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.