బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్శకుడు అభిషేక్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతడు వజ్రంలాంటివాడని, ఓ కుమారుడ్ని కోల్పోయినట్లు అనిపిస్తోందని చెప్పారు. 'కై.పో.చే' సినిమాతో సుశాంత్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. ఇటీవలే ఓ వెబ్ షోలో మాట్లాడుతూ ఆ నటుడితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"సుశాంత్ నువ్వు ఇప్పటికే ఓ స్టార్‌వి.. ఇతరులు నిన్ను మళ్లీ గుర్తించాలని అవసరం లేదు అని అతడికి చెబుతుండేవాడిని. కానీ ప్రస్తుతం జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం"
అభిషేక్ కపూర్, దర్శకుడు
సుశాంత్‌కు తాను చివరగా పంపిన ఓ సందేశాన్ని చదివి వినిపించారు అభిషేక్. అయితే, దానికి అతడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"బ్రో.. నీకోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు కొంచెం బిజీగా, బాధలో ఉన్నావని.. వీలున్నప్పుడు ఫోన్ చెయి. మనిద్దరం మరో అద్భుతమైన సినిమా చేద్దాం అని అతడికి సందేశం పంపించాను. అప్పుడు సుశాంత్ సరైన స్థితిలో లేడని నాకు అనిపించింది. కొన్నిసార్లు మాట్లాడాలనిపించింది. కానీ అతడు ఒక్కసారి ఫోన్ చేసుంటే ఈ విధంగా జరగకుండా ఆపి ఉండేవాడిని ఏమో"
అభిషేక్ కపూర్, దర్శకుడు
బాలీవుడ్లో ఎదుటి వారిని కించపరచొద్దని కొందరు వ్యక్తులకు అభిషేక్ సూచించారు. "ఇండస్ట్రీలో కళాకారులను ఓ వస్తువులా చూసే సంస్కృతి ఉంది. అటువంటి స్వభావం మనిషిని దూరం చేస్తుంది. అప్పుడు ఆర్టిస్ట్ భావోద్వేగాన్ని తెలుసుకోలేరు. వాళ్లతో కోట్ల రూపాయల సినిమా చేస్తున్నప్పుడు వారిని నిర్మాతలు ప్రత్యేకంగా చూసుకోవాలి. కనీసం మానసికంగా బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి" అని ఈ సందర్భంగా చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: