హాలీవుడ్ నటుడు 'ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' ఫేమ్ అన్సల్ ఎల్గార్ట్పై ఓ అమ్మాయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 17 ఏళ్లు నిండని తనపై ఎల్గార్ట్ లైంగిక దాడి చేశాడని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది.
" అభిమానంతో ఎల్గార్ట్ను కలవడానికి వెళ్లాను. కానీ అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు కూడా నిండలేదు. అతడు మాత్రం 20ల్లో ఉన్నాడు. నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు. నేనేమి ఫేమస్ అవ్వాలని ఇదంతా చెప్పట్లేదు. అతడి వల్ల మానసికంగా క్షోభ అనుభవించా. ఆ తర్వాత కొన్ని నెలల పాటు చికిత్స పొంది కోలుకున్నాను. నాలోని బాధ చెప్పుకోడానికే ఈ విషయం బహిర్గతం చేస్తున్నా. నాలాగే చాలా మంది అమ్మాయిలు అతడి బాధితులుగా ఉన్నారు"
-- ఓ యువతి
17 ఏళ్లు నిండని తనతో లైంగికంగా కలిసేందుకు ఒత్తిడి చేశాడని చెప్పిన ఆ అమ్మాయి.. బాధతో విలవిల్లాడినా ఇబ్బందిపెట్టినట్లు చెప్పింది. తన అశ్లీల చిత్రాలను తీసి బయటకు చెప్పొద్దని బెదిరించినట్లు వెల్లడించింది. ఆరోపణలు చేసిన ఆ అమ్మాయి.. ఎల్గార్ట్తో కలిసి ఉన్న ఫొటోలను, సందేశాలను షేర్ చేసింది.
-
I used to stan Ansel Elgort but man you are disgrace! pic.twitter.com/5wGVhfPLkO
— Rohann (@urbannaxal) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I used to stan Ansel Elgort but man you are disgrace! pic.twitter.com/5wGVhfPLkO
— Rohann (@urbannaxal) June 20, 2020I used to stan Ansel Elgort but man you are disgrace! pic.twitter.com/5wGVhfPLkO
— Rohann (@urbannaxal) June 20, 2020
ఇటీవలె...
మీటూ ఆరోపణల్లో భాగంగా ఈ ఏడాది మార్చి 11న బాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌కు 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇతడు దాదాపు 90 మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2013లో ఓ హోటల్లో ఓ నటిపై అత్యాచారం, 2006లో మిమి హలేయీపై లైంగిక దాడుల కేసుల్లో ఇతడిని దోషిగా తేల్చింది న్యూయర్క్ కోర్టు.
ఇదీ చూడండి: లైంగిక వేధింపుల వల్ల ఇండస్ట్రీకి హీరోయిన్ గుడ్‌బై