ETV Bharat / science-and-technology

మీ వాట్సాప్ రద్దయిందా?.. ఇలా చేయండి! - వాట్సప్ అకౌంట్ రద్దైతే ఏం చేయాలి?

మీ వాట్సాప్ అకౌంట్ రద్దయిందా?. అయితే మీరు తెలిసో, తెలియకో (WhatsApp account banned reason) ఏదో తప్పు చేసుంటారు. ఇకపై మీ అకౌంట్ బ్యాన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?. ఒకవేళ రద్దయిన అకౌంట్​ను మళ్లీ యాక్టివ్ చేసుకునే మార్గాలున్నాయా? తెలుసుకుందాం!.

WhatsApp account banned reason
వాట్సప్​ అకౌంట్ రద్దుకు కారణాలు
author img

By

Published : Oct 11, 2021, 1:37 PM IST

వాట్సాప్ అనేది సమాచార మార్పిడికి మంచి (WhatsApp account banned reason) సామాజిక మాధ్యమం. అయితే.. కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి వారి అకౌంట్లను (WhatsApp account banned) రద్దు చేస్తుంటుంది ఆ సంస్థ. తెలియక చేసినా మీ అకౌంట్​ను కూడా రద్దు చేస్తుంది. అయితే.. అకౌంట్​ రద్దు కాకుండా ఉండాలంటే ఆ సంస్థ నియమాలను ఉల్లంఘించకూడదు.

తమ వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా వాట్సప్ కఠిన చర్యలు చేపడుతోంది. సంస్థ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారి అకౌంట్లను నిర్ధాక్షిణ్యంగా రద్దు చేస్తుంది. ఇటీవల భారీ మొత్తంలో అకౌంట్లను రద్దు చేసింది. ఒక్క ఆగష్టు నెలలోనే 20 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. జూన్​, జులైలో 30 లక్షల అకౌంట్లను రద్దు చేసింది.

థర్డ్​ పార్టీ యాప్స్​ వాడకం..

జీబీ వాట్సాప్​ యాప్​, వాట్సాప్​ ప్లస్​, వాట్సాప్ మోడ్.. ఇంకా అనేక వెర్షన్​లు (WhatsApp account banned) ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్​ కూడా అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. కానీ వీటి వాటకం వాట్సాప్​ నియమాలకు విరుద్ధం. తెలియక మీరు వీటిని వాడినా మీ అకౌంట్ రద్దయినట్లే.

స్పామ్​ మెసేజ్​లతో..

గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చే అనవసర మెసేజ్​లను యూజర్ స్పామ్​ మెసేజ్​గా పరిగణించి బ్లాక్​ చేస్తాడు. యూజర్ అనుమతి లేకుండా మీరు ఇలాంటి మెసేజ్​లను పంపినట్లయితే.. మీ అకౌంట్​ను వాట్సప్ రద్దు చేస్తుంది. యూజర్ అనుమతి లేకుండా గ్రూప్​లలో యాడ్ చేసినా ఇలాంటి చర్యలే ఉంటాయి.

మీ అకౌంట్ బ్యాన్ అయిందా?

మొదటిసారి మీ వాట్సాప్​ అకౌంట్​ రద్దయితే కొంత సమయం తర్వాత మళ్లీ (how to recover WhatsApp account banned) యాక్టివ్ అవుతుంది. కానీ మళ్లీ ఉల్లంఘనకు గురైతే శాశ్వతంగా మీ అకౌంట్ రద్దవుతుంది. అకౌంట్ రద్దయితే అప్పీల్ చేసుకునే ఫీచర్​ కూడా ఉంటుంది. అకౌంట్ బ్యాన్​ అన్యాయమని మీరు భావిస్తే వాట్సాప్ సపోర్ట్​కు మెసేజ్​ కూడా చేయొచ్చు. మీ మెసేజ్​ని సమీక్షించి సరైనదేనని భావిస్తే అకౌంట్​ని పునరుద్ధరిస్తారు.

ఇదీ చదవండి:వాయిస్​ మెసేజ్​ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.