ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో ఇకపై 'వాయిస్ స్టేటస్​'లు... 100 ఫైళ్లు ఒకేసారి పంపే ఛాన్స్!

వాట్సాప్​లో మరిన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. వాయిస్ రికార్డింగ్​లను స్టేటస్​లుగా పెట్టుకునేలా కొత్త అప్​డేట్ తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. 100కు పైగా ఫైళ్లను ఒకేసారి పంపించుకునేలా వీలు కల్పించనున్నట్లు సమాచారం.

whatsapp brings new features soon
కొత్త ఫీచర్లను తీసుకురాబోతున్న వాట్సాప్
author img

By

Published : Feb 8, 2023, 2:13 PM IST

యాప్​లో కొత్త అప్​డేట్​లు తీసుకురావడంలో వాట్సాప్​ది ప్రత్యేక స్థానం. ప్రతిసారి కొత్త ఫీచర్లతో నూతన వెర్షన్​ను వాట్సాప్ అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ మధ్యకాలంలోనే వాట్సాప్ ఎన్నో షార్ట్​కట్​ ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం టెక్ట్స్, ఫొటోలు, వీడియోలను స్టేటస్​లుగా పెట్టుకునే వెసలుబాటు ఉంది. వీటితో పాటు వాయిస్​ స్టేటస్​లు కూడా పెట్టుకునేలా కొత్త ఫీచర్​ను తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. కొత్త అప్​డేట్​లో స్టేటస్ రియాక్షన్స్, 100 మంది వరకు ఫొటోలు పంపించే వెసులుబాటును సైతం కల్పించనుంది.

వాయిస్​ స్టేటస్
ప్రస్తుతం మనం ఫొటోలనో, వీడియోలనో, టెక్ట్స్​ను స్టేటస్​లుగా పెట్టుకుంటున్నాం. కానీ వాట్సాప్ ఇప్పుడు ట్రెండ్ మార్చుతోంది. వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్​లు పెట్టుకునేలా ఫీచర్ తీసుకురాబోతోంది. 30 సెకన్లపాటు వాయిస్ రికార్డు చేసి స్టేటస్​గా పెట్టుకోవచ్చని చెప్పింది. ఈ అప్​డేట్​ను త్వరలోనే యూజర్లకు అందుబాటులో రానుందని వాట్సాప్ ప్రకటించింది. మనం చెప్పాలనుకున్న ప్రతిదీ రాయాలంటే కొంత మందికి ఇబ్బందిగా ఉండొచ్చు. అలాంటి వారికి ఈ ఫీచర్ మంచి ఆప్షన్.

whatsapp brings new features soon
వాయిస్ స్టేటస్

స్టేటస్ రియాక్షన్స్
ప్రస్తుతం వాట్సాప్​లో పెట్టిన స్టేటస్​లకు టెక్ట్స్, వాయిస్ మెసేజ్ ద్వారా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. అయితే, స్టేటస్​కు త్వరగా రియాక్ట్ అయ్యే విధంగా మరో ఫీచర్ జోడించనున్నట్లు వాట్సాప్ తెలిపింది. స్టేటస్​ను పైకి స్వైప్​ చేస్తే కనిపించిన 8 ఎమోజీలు కనిపిస్తాయని.. వాటిని క్లిక్ చేస్తే వెంటనే మెసేజ్ వెళ్లిపోతుందని తెలిపింది. ఈ ఆప్షన్ ఇప్పటికే బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. దీనిని మరింతగా అప్​డేట్​ చేయనున్నట్లు తెలిపింది వాట్సాప్.

వంద ఫైళ్లను ఒకేసారి
ప్రస్తుతం వాట్సాప్​లో 30 మీడియా ఫైళ్లను ఒకేసారి పంపించుకునే వీలు ఉంది. అంతకంటే ఎక్కువ పంపాలనుకుంటే.. సాధ్యం కాదు. పెద్ద సంఖ్యలో ఫొటోలు, డాకుమెంట్లు పంపే సమయంలో ఇది చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దీనికి చెక్​ పెట్టడానికి వాట్సాప్ కొత్త ఫీచర్​ను తేబోతుంది. ఇకపై 100 ఫైళ్లను ఒకేసారి పంపించేలా వాట్సాప్ కొత్త అప్​డేట్ తీసుకురాబోతోందని సమాచారం. తొలుత బీటా యూజర్లకు ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.