ETV Bharat / science-and-technology

Twitter Subscription Fees : ట్విట్టర్ యూజర్లకు మస్క్ షాక్​.. ఇక అందరూ డబ్బులు కట్టాల్సిందే! - ఎలాన్​ మస్క్ లేటెస్ట్ న్యూస్​

Twitter Subscription Fees : ఎలాన్​ మస్క్ ట్విట్టర్ యూజర్లకు షాక్​ ఇచ్చారు. త్వరలో ట్విట్టర్ (ఎక్స్​)​ ఖాతాదారులు అందరి నుంచి నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ఫీజును వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే కనుక అమలు జరిగితే.. యూజర్లపై ఆర్థికభారం పడుతుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Elon Musk
Twitter Monthly Subscription Fees
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 12:13 PM IST

Twitter Subscription Fees : ఎక్స్​ (ట్విట్టర్) యూజర్లకు ఎలాన్ మస్క్​ షాక్​ ఇచ్చారు. త్వరలోనే ట్విట్టర్​ ఖాతాాదారులు అందరి నుంచి నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే కనుక అమలు జరిగితే యూజర్లపై అదనపు ఆర్థిక భారం పడడం ఖాయం.

ఫీజు ఎంత ఉండవచ్చు!
X Subscription Fee : సబ్​స్క్రిప్షన్ ఫీజు విధిస్తామని స్పష్టం చేసిన ఎలాన్​ మస్క్​.. అది ఎంత మేరకు ఉంటుందనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సబ్​స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి అదనపు ఫీచర్లు కల్పిస్తారా? లేదా? అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు.

నోట్​ : ప్రస్తుతం ఎక్స్​ (ట్విట్టర్​).. ప్రీమియం సబ్​స్క్రిప్షన్ ఫీజు కింద నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేస్తోంది.

భారీ ఆదాయం!
ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్​) వేదికలో 550 మిలియన్లకు పైగా మంత్లీ యూజర్స్​ ఉన్నారని ఎలాన్ మస్క్ తెలిపారు. వీరు ఒక రోజులో కనీసం 100 నుంచి 200 మిలియన్ల పోస్టులు పెడుతున్నారని ఆయన వివరించారు. ఒక వేళ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ అమలులోకి వస్తే.. ట్విట్టర్​ (ఎక్స్) కంపెనీకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది.

బాట్స్​ను నియంత్రించడానికే..
Benjamin Netanyahu And Elon Musk Meeting : ఎలాన్​ మస్క్​తో.. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహూ మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా వేదికల్లో ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం (bots) బాట్స్​. వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎలాన్​ మస్క్.. తాము కూడా ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా త్వరలో ఎక్స్​ ఖాతాదారులకు నెలవారీ సబ్​స్క్రిప్షన్ ఫీజు విధించనున్నామని పేర్కొన్నారు. ఇలా సబ్​స్క్రిప్షన్ ప్లాన్ ప్రవేశపెట్టడం వల్ల బాట్​లు ఉపయోగించి ఖాతాలు సృష్టించడం చాలా కష్టతరమవుతుంది మస్క్ అభిప్రాయపడ్డారు. ఎలా అంటే.. కొత్త ట్విట్టర్​ ఖాతాలను తెరవాలనుకున్న ప్రతిసారీ.. కొత్త క్రెడిట్ కార్డ్​లను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్​తో.. రిస్క్!
AI Risk To Humanity : ఇజ్రాయిల్​ ప్రధాని బెంజిమెన్​ నెతన్యాహూతో.. ఎలాన్​ మస్క్​ 'కృత్రిమ మేధస్సు సాంకేతికత' (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ) వల్ల కలిగే ప్రమాదం గురించి చర్చించారు. భవిష్యత్​లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. ఏఐ సాంకేతికతను రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని మస్క్ అభిప్రాయపడ్డారు.

ఆదాయం భారీగా తగ్గింది.
Twitter Ad Revenue 2023 : అమెరికాలో ట్విట్టర్ ప్రకటనల ఆదాయం గత నెల ఏకంగా 60 శాతం వరకు పడిపోయింది. పౌర హక్కుల నేతలు, వినియోగదారుల సమూహాలు.. తమలాంటి పెద్దపెద్ద బ్రాండ్​లపై దుష్ప్రచారం చేయడం, ఒత్తిడిలు తీసుకురావడం వల్లనే తమ ఆదాయం తగ్గుతోందని మస్క్ విమర్శించారు.

ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహించడం లేదు!
Hate Speech In Twitter : ట్విట్టర్​ వేదికలో ఇటీవల హేట్​ స్పీచ్​ (ద్వేషపూరిత ప్రసంగాలు), వర్గవైషమ్యాలు పెంచే పోస్టులు పెరిగిపోతున్నాయి. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. ఇలాంటి వాటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.