ETV Bharat / science-and-technology

ల్యాప్​​టాప్​ కొనాలా? ఈ 5 ఫీచర్లు మస్ట్! - latest laptop price

ప్రస్తుతం ల్యాప్​టాప్​లకు బాగా గిరాకీ పెరిగింది. అయితే ఏ ల్యాప్​టాప్​ మంచిది? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పడం చాలా కష్టం. వినియోగదారుల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. దీని ఆధారంగానే వివిధ ధరల్లో ల్యాప్​టాప్​లు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. కొత్త ల్యాప్​టాప్​ కొనాలనుకునేవారు... బడ్జెట్​, స్టోరేజ్​, బ్యాటరీ లైఫ్, ప్రాసెసర్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

If you buy a new laptop keep these things in your mind
ల్యాప్​​టాప్​ కొనే ముందు ఈ ఐదు ఫీచర్లు చూసుకోవాలి!
author img

By

Published : Jun 7, 2020, 5:21 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

కరోనా కారణంగా ఇంటి వద్ద పని చేయించడానికే ఎక్కువ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యా సంస్థలు ఆన్​లైన్​​లో పాఠాలు బోధించడానికే మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ల్యాప్​టాప్​ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటివారు ల్యాప్​టాప్​ కొనే ముందు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.

బడ్జెట్​

ల్యాప్​టాప్​ కొనేముందు బడ్జెట్​ను నిర్ణయించుకోవడం ముఖ్యమైంది. ఒకవేళ మీరు అనుకున్న బడ్జెట్​ కంటే ల్యాప్​టాప్​ ధర ఎక్కువ అయితే కొనడం మానేయడం సమస్యకు పరిష్కారం కాదు. వివిధ ధరల్లో పలు రకాల బ్రాండ్లు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ బడ్జెట్...​ మీ ఎంపికను నిలువరించలేదు.

ప్రాసెసర్​, ర్యామ్

ఒక ల్యాప్​టాప్​ ప్రాసెసర్​ దాని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా 'ఇంటెల్​, ఏఎండీ సీపీయూ' ప్రాసెసర్​తో ల్యాప్​టాప్​లు విపణిలో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్​ కోర్​ ఐ3 ప్రాసెసర్​ నుంచి ప్రారంభమవుతుంది. అత్యధికంగా కోర్​ ఐ5ను వినియోగించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

ఎక్కువ ర్యామ్​ ఉంటే అనేక పనుల్ని ఎటువంటి ఆటంకం లేకుండా చేయగలదు. మీ అవసరాలు తక్కువగా ఉంటే కోర్​ ఐ3 ప్రాసెసర్​లో 4 లేదా 8 జీబీ ర్యామ్​ ఉన్న ల్యాప్​టాప్​ లేదా ఐ5 ప్రాసెసర్​తో 4 జీబీ ర్యామ్​ ఉన్నది కొనుక్కోవడం మంచిది. మధ్య తరహా ఉపయోగాలకు ఇంటెల్​ కోర్​ ఐ5లో 8జీబీ ర్యామ్​, మరీ అధికంగా పని ఉండి, మీ బడ్జెట్​ సరిపోతుందని అనుకుంటే కోర్​ ఐ7లో 16 బీజీ ర్యామ్ ఉన్న ల్యాప్​టాప్​ కొనుక్కోడం ఉత్తమం.

లాప్​టాప్​ సైజ్​

ప్రస్తుతం అధికంగా 15.6 అంగుళాల డిసిప్లేతో ల్యాప్​టాప్​లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ 14 అంగుళాల చిన్న సైజ్​లో కూడా ఉన్నాయి. రోజూ ల్యాప్​టాప్​ పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఉంటే చిన్న పరిమాణంలో ఉన్నదానిని​ కొనుగోలు చేయడం ఉత్తమం. వినోద కార్యక్రమాలకు ఉపయోగించే వారైతే పెద్ద పరిమాణం​ డిసిప్లే ఉన్న ల్యాప్​టాప్​ కొనుగోలు చేసుకోవచ్చు.

స్టోరేజ్

మీ ల్యాప్​టాప్​ స్టోరేజ్ ఎక్కువగా ఉంటేనే మంచిది. ఈ రోజుల్లో ల్యాప్​టాప్​లో 500జీబీ నుంచి 1 టెరాబైట్​ వరకు హార్డ్​ డిస్క్​ డ్రైవ్ ఉండటం సాధారణమే. తక్కువ బరువు ఉన్న ల్యాప్​టాప్​లలో సాలిడ్​ స్టేట్​ డ్రైవ్(ఎస్​డీడీ)లు ప్రసిద్ధి చెందాయి. ఇవి వేగంగా పని చేస్తాయి కానీ తక్కువ స్టోరేజ్​ కలిగి ఉంటాయి. కాబట్టి మీ అవసరాలకు తగిన స్టోరెజ్​ ఉన్న ల్యాప్​టాప్​లు కొనుగోలు చేసుకోవాలి.

బ్యాటరీ సామర్థ్యం

బ్యాటరీ సామర్థ్యం బాగాలేకపోతే మంచి డెస్క్​​టాప్​లానే మిగిలిపోతుంది మీ ల్యాప్​టాప్. కాబట్టి కనీసం 4 నుంచి 6 గంటలు బ్యాటరీ బ్యాకప్​ ఉండేట్లు చూసుకోవాలి. 8 గంటలు బ్యాటరీ బ్యాకప్​ వచ్చే ల్యాప్​టాప్​ కొనుగోలు చేస్తే ఇంకా మంచిది.

ఇదీ చూడండి: 2019-20లో తగ్గిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.