ETV Bharat / science-and-technology

ఇకపై డబ్బులు కడితేనే 'టెలిగ్రామ్'! అదే దారిలో వాట్సాప్? - telegram premium price

telegram premium account: టెలిగ్రామ్ యాప్​ ప్రీమియం వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫీచర్లను ప్రీమియం పరిధిలోకి తీసుకురానున్నట్లు సమాచారం. టెలిగ్రామ్ ప్రయోగం సక్సెక్ అయితే వాట్సాప్ సైతం అదే బాటలోకి వెళ్లే అవకాశముంది.

telegram whatsapp premium
telegram whatsapp premium
author img

By

Published : May 4, 2022, 11:05 AM IST

telegram premium features: ఆధునిక మెసేజింగ్ ప్రపంచంలో వాట్సాప్, టెలిగ్రామ్ అంటే తెలియని వారు ఉండరు. అంతలా ఆదరణ సంపాదించుకున్నాయి ఈ రెండు యాప్స్. ఉచితంగా సేవలు అందించడం వల్ల ఈ యాప్స్​ను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఆ ఫలితంగానే వీటికి అంత క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు టెలిగ్రామ్ రూటు మారుస్తోంది. ప్రీమియం వెర్షన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్లన్నీ ఉచితంగానే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా మరికొన్ని అధునాతన ఫీచర్లు తీసుకొచ్చి వాటికి సబ్​స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేయనుందని సమాచారం. ఈ పద్ధతి విజయవంతమైతే వాట్సాప్ సైతం ఇదే దారిలో వెళ్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

telegram premium price: ప్రస్తుతం టెలిగ్రామ్ ఐఓఎస్ బీటా వెర్షన్ (8.7.2) విడుదలైంది. ఇందులో కొత్తకొత్త ఎమోజీలు, రియాక్షన్స్, స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ప్రీమియం వెర్షన్​లోనివేనని టాక్ వినిపిస్తోంది. వీటిని ఉపయోగించాలంటే టెలిగ్రామ్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సపరేట్ లాగిన్ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​లో ప్రీమియంకు సంబంధించిన కొత్త ఫీచర్లు రాలేదు. ఎప్పుడు వస్తుందనే విషయంపైనా స్పష్టత లేదు. అయితే, ప్రీమియం వెర్షన్​కు ఛార్జీలు తక్కువగానే ఉంటాయని తెలుస్తోంది.

whatsapp vs telegram: మెసేజింగ్ యాప్​ల విషయంలో వాట్సాప్, టెలిగ్రామ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఫంక్షనాలిటీ, ఫీచర్స్ విషయంలో టెలిగ్రామ్​.. వాట్సాప్​కు అందనంత ఎత్తులో ఉంది. అయితే, సులువుగా ఉపయోగించుకునే వీలున్న వాట్సాప్ మార్కెట్​లో లీడింగ్​ మెసేజింగ్ యాప్​గా కొనసాగుతోంది. అయితే, టెలిగ్రామ్ ప్రీమియం ఫీచర్ విజయవంతమైతే.. వాట్సాప్ సైతం సబ్​స్క్రిప్షన్​ల విషయంపై ఆలోచన చేసే అవకాశం ఉందని సమాచారం.

Whatsapp multi device: ఇక కీలకమైన అప్డేట్స్​ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ వేగంగా పనిచేస్తోంది. మల్టీ డివైజ్ ఫీచర్​ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​లో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, వాట్సాప్ స్టేటస్​లకు ఎమోజీల ద్వారా రిప్లై ఇచ్చేలా కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ డెస్క్​టాప్ బీటా వెర్షన్​లో ఇది కనిపిస్తోంది. ఇవి అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టొచ్చు.

twitter circle friends: మరోవైపు, ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ట్వీట్లు కనిపించేలా చేసేందుకు ట్విట్టర్​లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది. 'ట్విట్టర్ సర్కిల్' పేరుతో ఈ ఫీచర్​పై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తోంది సంస్థ. ఈ ఆప్షన్​తో 150 మంది వరకు ట్విట్టర్ యూజర్లను ఎంపిక చేసుకొని.. వారికి మాత్రమే ట్వీట్లు కనిపించేలా చేయొచ్చు. ఈ ఫీచర్​ను కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ట్విట్టర్ సేఫ్టీ ప్రకటించింది.

ఇదీ చదవండి: పరాగ్​కు ఉద్వాసన తప్పదా? 'ట్విట్టర్​' ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.