ETV Bharat / science-and-technology

సూపర్ ఫీచర్లతో టెలిగ్రామ్‌ కొత్త వెర్షన్​.. కానీ వాడాలంటే మాత్రం... - telegram app

ఉచిత మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్‌.. త్వరలో ప్రీమియం వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. టెలిగ్రామ్‌ ప్రీమియం పేరుతో సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారికే ఈ వెర్షన్‌ను వినియోగించే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం.

Telegram premium plan
టెలిగ్రామ్‌ ప్రీమియం వెర్షన్
author img

By

Published : Jun 10, 2022, 7:16 PM IST

మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్‌ యూజర్ల గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూనే ఎప్పటికప్పుడు ఆసక్తికర ఫీచర్లను తీసుకొస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఉచిత మెసేజింగ్ యాప్‌ ప్రీమియం వెర్షన్‌ను తీసుకురానుందట. టెలిగ్రామ్‌ ప్రీమియం పేరుతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ వెర్షన్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా యాప్‌లో ప్రకటనలు కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమువుతోంది. ఇప్పటికే పబ్లిక్ ఛానల్స్‌లో ప్రకటనల తరహాలో స్పాన్సర్డ్‌ మెసేజ్‌లను పరిచయం చేసింది. 160 పదాలతో కూడిన ఈ మెసేజ్‌లలో ఎలాంటి వెబ్ లింక్‌లూ ఉండవు. అందులోని మెసేజ్‌పై యూజర్‌ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన చానల్‌కు యూజర్‌ను రీ డైరెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

టెలిగ్రామ్‌ ప్రీమియం ప్రారంభ సబ్‌స్క్రిప్షన్‌ ధర 4.99 డాలర్లుగా ఉంటుందని సమాచారం. ఈ ప్రీమియం వెర్షన్‌తో యూజర్లకు కొన్ని అదనపు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఫైల్‌ అప్‌లోడింగ్ సైజ్‌ 4జీబీకి పెంచడం, ఫాస్టర్‌ డౌన్‌లోడ్ స్పీడ్‌, వాయిస్‌-టు-టెక్ట్స్‌ కన్వర్షన్‌, యాడ్‌ ఫ్రీ, యూనిక్యూ రియాక్షన్స్‌, ప్రీమియం స్టిక్కర్స్‌, అడ్వాన్స్‌డ్‌ చాట్ మేనేజ్‌మెంట్, ప్రొఫైల్ బ్యాడ్జ్‌, యానిమేటెడ్ అవతార్‌, అడిషినల్‌ అప్లికేషన్ ఐకాన్స్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయట. అయితే ఇప్పటికే ఈ ప్రీమియం వెర్షన్‌ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే ఎంపిక చేసిన యూజర్లు మాత్రమే ఈ వెర్షన్‌ను విడుదల చేసినట్లు టెక్ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: 'స్లాక్​' మెసేజింగ్​ యాప్​ సేవలు.. ఇక భారత్​లో అధికారికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.