ETV Bharat / science-and-technology

టీవీ స్క్రీన్​ క్లీన్​ చేస్తున్నారా? అయితే ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి! - టీవీని తుడవడానికి ఉపయోగించే క్లాత్స్​

క్లీనింగ్..​ రోజువారీ జీవితంలో ఓ భాగం. ప్రతిరోజు మనం మన శరీరంతో పాటుగా.. ఇంటిని శుభ్రం చేసుకుంటాం. దీంతో పాటుగా ఇంట్లో వస్తువులను క్లీన్​ చేస్తుంటాం. అయితే ఈ క్లీనింగ్​లో భాగంగా టీవీ స్క్రీన్​ను కూడా శుభ్రం చేస్తూ ఉంటాం. ఆ పని జాగ్రత్తగా చేయకపోతే టీవీ తెరపై గీతలు పడే ప్రమాదం ఉంది. అందుకే టీవీ స్క్రీన్ క్లీన్​ చేయడానికి కొన్ని టిప్స్​ ఉన్నాయి.

smart tv screen cleaning tips and instructions

author img

By

Published : Mar 8, 2023, 6:14 PM IST

ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ టీవీ అనేది ఓ వినోద సాధనంగా మారింది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఇంట్లో టీవీ ముందు కూర్చుని సినిమాలు, రకరకాల షోలు చూస్తూ ఎంజాయ్​ చేస్తుంటాం. కొన్ని సార్లు మన టీవీ స్క్రీన్​​పై దుమ్ము, ధూళి పేరుకుపోయి బొమ్మ సరిగా కనిపించదు. అలాంటప్పుడు మన టీవీ స్క్రీన్​ను క్లీన్ చేయవలసి ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది టీవీ తెరను ఎలా క్లీన్​ చేయాలో తెలియక రకరకాల వస్త్రాలను ఉపయోగిస్తూ.. కొన్ని లిక్విడ్​లను స్ప్రే చేస్తుంటారు. అలా చేయడం వల్ల స్క్రీన్​ పాడవుతుంది. టీవీ స్క్రీన్​​ను క్లీన్​ చేయడం కోసం అని కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి.

టవల్స్​ వద్దే వద్దు.. మైక్రోఫైబర్స్​ ముద్దు
ప్రస్తుతం కాలంలో అన్నీ ఎల్​సీడీ, ఎల్​ఈడీ, ఓఎల్​ఈడీ స్క్రీన్​ ఉన్న స్మార్ట్​ టీవీలే మార్కెట్​లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ టీవీల స్క్రీన్​​లు మాత్రం చాలా సెన్సిటివ్​గా ఉంటాయి. వీటిపై కొంచెం ఒత్తిడి కలిగినా సరే పాడయ్యే ప్రమాదం ఎక్కువ. ఈ విషయం తెలియక చాలా మంది టవల్స్​, టిష్యూలతో టీవీ స్క్రీన్​​లను తుడుస్తూ​ ఉంటారు. ఫలితంగా వాటిపై గీతలు పడతాయి. అందుకే స్మార్ట్​ టీవీని శుభ్రం చేసేటప్పుడు తువాళ్లకు బదులుగా మైక్రోఫైబర్ క్లాత్స్​ వినియోగించాలి. స్క్రీన్​పై పడ్డ మరకలను ఈ మైక్రోఫైబర్​ క్లాత్​తో తుడిస్తే.. పూర్తిగా తొలిగిపోవడమే కాకుండా.. స్క్రీన్​​పై ఎలాంటి స్క్రాచెస్​​ పడవు.

స్ప్రే చేయవద్దు
స్మార్ట్​ టీవీ తెరను శుభ్రం చేసే సమయంలో.. డైరెక్ట్​గా స్క్రీన్​​పై ఎటువంటి లిక్విడ్​ స్ప్రేలు చేయకూడదు. అలా స్ప్రే చేయడం వల్ల టీవీలోని అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటుగా తెరపై శాశ్వతంగా కొన్ని మరకలు ఏర్పడే అవకాశం​ ఉంది. అమ్మోనియా, ఆల్కహాల్​, అసిటోన్​ లాంటి స్ప్రేలను వినియోగించికూడదు. ఎందుకంటే ఇవి స్క్రీన్​పై ఉండే యాంటీ గ్లేర్​ పూతను దెబ్బతీస్తాయి. అసలు టీవీని క్లీన్ చేసేటప్పుడు స్ప్రేలను వాడకూడదు. ఒకవేళ వాడవలసి వస్తే.. స్క్రీన్​​పై డైరెక్ట్​గా స్ప్రే చేయకుండా క్లీనింగ్ క్లాత్​పై వేసుకుని శుభ్రం చేయాలి.

ఆ సమయంలో టీవీ ఆఫ్​లోనే..
టీవీని ఆన్​లో ఉంచి ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ చేయకూడదు. ఆఫ్​ చేసిన తర్వాతనే శుభ్రం​ చేయాలి. ఆన్​లో ఉంచి క్లీన్​ చేయడం వల్ల విద్యుత్​ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లిక్విడ్​తో క్లీన్ చేసినప్పుడు ఆ తడి ఉన్నప్పుడు టీవీ ఆన్ చేయకూడదు. అది పూర్తిగా పొడిగా మారిన తర్వాతనే ఆన్ చేయాలి.

అటు ఇటు వద్దే వద్దు..
టీవీ స్క్రీన్​ను శుభ్రం చేసేటప్పడు గజిబిజిగా తుడవకూడదు. మొదటగా ఒక దిశలో అనుకుని ఆదే డైరెక్షన్​లో మొత్తం టీవీ స్క్రీన్​ను మైక్రోఫైబర్​ క్లాత్​తో శుభ్రం చేయాలి. అలా చేయవడం వల్ల స్క్రీన్​​ మధ్యలో ఎక్కడా స్పాట్​ మిగిలిపోవడానికి ఆస్కారం ఉండదు. దీంతో పాటుగా స్క్రీన్​పై గీతలు పడే అవకాశం ఉందడు.

అలాంటప్పుడు వస్త్రం మార్చాల్సిందే..!
స్మార్ట్ టీవీ స్క్రీన్​ను తుడిచే సమయంలో వస్త్రాన్ని తిప్పుతూ ఉండాలి. వస్త్రంలోని ఒకే భాగంతో దానికి అంటిన దుమ్ము, ధూళి మొత్తం స్క్రీన్​కు అంటుకునే ప్రమాదం ఉంటుంది. క్లీన్​ చేసే సమయంలో క్లాత్​కు ఎక్కువ దుమ్ము అంటినట్లు అనిపిస్తే.. వెంటనే క్లాత్​ను తిప్పాలి లేదా మరో క్లాత్​ను వినియోగించాలి.

ఎల్లప్పుడూ స్క్రీన్ పొడిగానే
టీవీ స్క్రీన్‌ను శుభ్రపరిచిన తర్వాత.. ఆ తడి పూర్తిగా పొడిగా అయ్యే వరకు టీవీని ఆన్​ చేయకూడదు. అలా చేస్తే ఆ తడి మచ్చలుగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు విద్యుత్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.