ETV Bharat / science-and-technology

నెలాఖరుకల్లా వాట్సాప్​లో ఆ కొత్త ఫీచర్! - వాట్సాప్ స్టోరేజ్​ మేనేజ్​మెంట్ ఫీచర్ వివరాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్​పై వాట్సాప్ అధికారిక ప్రకటన చేసింది. ఈ నెలాఖరుకు అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించింది. 'డిసప్పియరింగ్ మెసేజెస్'​పై వాట్సాప్ వెల్లడించిన మరిన్ని విశేషాలు ఇలా ఉన్నాయి..

What is WhatsApp 'disappearing messages'
వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ అంటే ఏమిటి
author img

By

Published : Nov 5, 2020, 7:24 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్​పై కీలక ప్రకటన చేసింది. ఈ నెల చివరి నాటికి సాధారణ యూజర్లందరికీ ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.

ఏమిటీ ఫీచర్​..

వాట్సాప్​లో ఒక యూజర్​ మరో యూజర్​కు పంపిన సందేశం ఏడు రోజుల తర్వాత దానంతటదే డిలీట్ అయిపోయేలా చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత. సంభాషణలను సులభతరం చేయడం సహా గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ ఈ ఫీచర్ తీసుకువస్తున్నట్లు వెల్లడించింది వాట్సాప్.

వ్యక్తిగత చాటింగ్​లలో పంపే వ్యక్తి ఈ ఫీచర్​ను ఆన్​ లేదా ఆఫ్ చేసుకునే వీలుంది. గ్రూప్​లలో ఈ అధికారాలు అడ్మిన్​లకు మాత్రమే ఉంటాయి.

దీనితో పాటు ఈ వారం మొదట్లో ప్రకటించిన స్టోరేజ్ మేనేజ్​మెంట్​ టూల్.. అతిత్వరలో అందుబాటులోకి వస్తుందని వివరించింది వాట్సాప్. ఈ సదుపాయం సెట్టింగ్స్​లో ఉంటుందని తెలిపింది.

వాట్సాప్ స్టోరేజ్​ను సమీక్షించడం, ఒకేసారి భారీ మొత్తంలో అన్నిరకాల సందేశాలను డిలీట్​ చేయడం వంటి వాటికోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి:రిలయన్స్ రిటైల్​లో సౌదీ సంస్థ భారీ పెట్టుబడి

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.