ETV Bharat / science-and-technology

ఫోన్ పగిలి డేటా మొత్తం పోయిందా?.. ఇలా చేస్తే ఈజీగా రికవరీ.. - డేటా రికవరీ లేటెస్ట్ న్యూస్

స్మార్ట్​ఫోన్ పగిలితే డిస్​ప్లే అన్​లాక్ చేయలేం. కాంటాక్టులు, ఫొటోలు, మెసేజ్​ల వంటి అన్ని వివరాలు అందులోనే ఉంటాయి. దీంతో ఆ డేటా అంతా తిరిగి ఎలా పొందాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే పోయిన డేటా తిరిగి తెచ్చేందుకు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసా?

phone cracked data gone data recovery
పగిలిన ఫోన్​ నుంచి డేటా రికవరీ
author img

By

Published : Dec 1, 2022, 11:34 AM IST

స్మార్ట్‌ఫోన్‌ పగిలితే గుండె పగిలినంత పనవుతుంది. కాంటాక్టులు, ఫొటోలు, మెసేజ్‌ల వంటి వివరాలన్నీ అందులోనే ఉంటాయి. డిస్‌ప్లే పగిలితే అన్‌లాక్‌ చేయలేం. అప్పుడు ఫోన్‌లోని డేటాను తిరిగి తీసుకోవటం కష్టమవుతుంది. మరమ్మతు చేయటానికి ఎక్కువ ఖర్చు కావొచ్చు. విధిలేక కొత్త ఫోన్‌ కొనాల్సి రావొచ్చు. మరి ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను పొందటమెలా? దీన్ని కొత్త ఫోన్‌లోకి మార్చుకోవటమెలా?

గూగుల్‌ లేదా ఐక్లౌడ్‌ బ్యాకప్‌తో
ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌.. ఏదైనా గానీ చాలా స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యేకమైన బ్యాకప్‌ ఫీచర్‌ ఉంటుంది. సాధారణంగా గూగుల్‌ ఖాతాతో గానీ యాపిల్‌ ఐడీతో గానీ అనుసంధానమై ఉంటాయి. ఎప్పుడైనా ఫోన్‌ డిస్‌ప్లే పగిలిపోతే అదే గూగుల్‌ ఖాతాతో లేదా యాపిల్‌ ఐడీతో మరో పరికరంలో లాగిన్‌ కావొచ్చు. దీంతో ఆటోమేటిక్‌గా బ్యాకప్‌ డేటా అంతా కొత్త పరికరంలో రిస్టోర్‌ అవుతుంది.

గూగుల్‌ టేకవుట్‌, ఐక్లౌడ్‌ వెబ్‌సైట్‌తో
పాత ఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌కు డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి ఇది మరో మార్గం. ఆండ్రాయిడ్‌ ఫోన్లకు గూగుల్‌ టేకవుట్‌, ఐఓఎస్‌ పరికరాలకు ఐక్లౌడ్‌ వెబ్‌సైట్‌ ఉపయోగపడతాయి. ఆండ్రాయిడ్‌ వాడేవారు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి, గూగుల్‌ ఖాతాతో సైన్‌ఇన్‌ కావాలి. దీనిలోంచి కాంటాక్టులు, ఫొటోలు, మెయిల్‌, మెసేజ్‌ల వంటి వాటిల్లో అవసరమైన సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సామ్‌సంగ్‌ పరికరాలు వాడేవారు సామ్‌ ఖాతాతో అనుసంధానమై ఉంటే ఫైండ్‌ మై మొబైల్‌ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని సాయంతో సామ్‌సంగ్‌ క్లౌడ్‌ ద్వారా మొత్తం డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐఓఎస్‌ పరికరాల వినియోగదారులైతే ఐక్లౌడ్‌ ఖాతాలో సైన్‌ ఇన్‌ అయ్యి కాంటాక్ట్స్‌, నోట్స్‌, ఫొటోలు, ఐక్లౌడ్‌ డ్రైవ్‌ వంటివన్నీ తిరిగి పొందొచ్చు.

మౌజ్‌, డేటా కేబుల్‌తో
అధునాతన స్మార్ట్‌ఫోన్లు మొబైల్‌ హై-డెఫినిషన్‌ లింక్‌), మౌజ్‌లను సపోర్టు చేస్తున్నాయి. వీటి ద్వారా టీవీ లేదా సిస్టమ్‌ మానిటర్‌ మీద ఫోన్‌ డిస్‌ప్లేను చూసుకోవచ్చు. ఇందుకు డాంగిల్‌ కూడా అవసరం. టీవీ లేదా మానిటర్‌కు ఫోన్‌ డిస్‌ప్లే అనుసంధానం అయిన తర్వాత మౌజ్‌ను మెనూ మీద క్లిక్‌ చేసి మొత్తం డేటాను తిరిగి పొందొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.