ETV Bharat / science-and-technology

భారీ కెమెరాతో మోటోరోలా నయా స్మార్ట్​​ఫోన్లు - Motorola Edge 20 108MP camera

మోటోరోలాలో 108 మెగాపిక్సెల్స్​తో కొత్త ఫోన్​ రానుందా? అంటే అవును అనే అంటున్నాయి టెక్​ వర్గాలు. ఆకట్టుకునే ఫీచర్లతో మందు చైనాలో..ఆ తర్వాత భారత విపణీలో ఈ నయా మోడల్​ను సంస్థ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.

Motorola Edge 20 series launch date and 108MP camera confirmed
భారీ కెమెరాతో మోటోరోలా నయా స్మార్ట్​​ఫోన్లు
author img

By

Published : Jul 26, 2021, 5:24 PM IST

Updated : Jul 26, 2021, 6:51 PM IST

మార్కెట్​లోకి కొత్త స్మార్ట్​ఫోన్​ వస్తే చాలు.. కెమెరా క్వాలిటీ గురించి చాలా మంది చెక్​ చేసేస్తారు! రేర్​ కెమెరా, సెల్ఫీ కెమెరా ఎన్ని మెగాపిక్సెల్స్​ ఉన్నాయి​? అని చూసుకున్న తర్వాతే ఆ ఫోన్​ ర్యామ్​ వంటి వివరాల్లోకి వెళతారు. ప్రస్తుతం ఫోన్​ కెమెరాకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మొబైల్​ కంపెనీలు ప్రతి మోడల్​కు కెమెరా క్వాలిటీని పెంచుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే శామ్​సంగ్​, షియోమీ వంటి సంస్థలు అత్యధికంగా 108 మెగాపిక్సెల్స్​ కలిగిన స్మార్ట్​ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు ఇదే బాటను ప్రముఖ మొబైల్​ దిగ్గజ సంస్థ మోటోరోలా అనుసరిస్తున్నట్టు కనపడుతోంది.

మోటోరోలా ఎడ్జ్​ 20, ఎడ్జ్​ 20 ప్రో వేరియంట్లు.. చైనా విపణిలోకి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 5వ తేదీన ఎడ్జ్​ 20 సిరీస్​ను చైనాలో రిలీజ్​ చేయనున్నట్టు మోటోరోలా సంస్థ ప్రకటన చేసింది. 108 పిక్సెల్స్​ కెమెరాతో ఈ స్మార్ట్​ఫోన్లు విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

Motorola Edge 20 series launch date and 108MP camera confirmed
మోటోరోలా ఎడ్జ్​ 20 రిలీజ్​ ప్రకటన

ఈ రెండు స్మార్ట్​ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు కొన్ని లీక్​ అయ్యాయి. అవేంటో చూసేద్దాం..

ఫీచర్లు..

మోటోరోలా ఎడ్జ్​ 20

మోటోరోలా ఎడ్జ్​ 20:

  • 108 మెగాపిక్సెల్​ + 16 మెగాపిక్సెల్​ (ఆల్ట్రావైడ్​) + 8 మెగాపిక్సెల్ (5x ఆప్టికల్​ జూమ్​)​ రేర్​ కెమెరా;
  • సెల్ఫీ కెమెరా - ఎడ్జ్​ 20 (32 మెగాపిక్సెల్​ ఫ్రంట్​ కెమెరా + 16 మెగా పిక్సెల్​ సెల్ఫీ స్నాపర్​)
  • 6.67 ఇన్చెస్​ ఎఫ్​హెచ్​డీ + ఓఎల్​ఈడీ డిస్​ప్లే(120 హెట్జ్​ రిఫ్రెష్​ రేట్​)
  • స్నాప్​డ్రాగన్​ 778జీ ప్రాసెసర్​
  • 12 జీబీ ర్యామ్​ + 512 జీబీ స్టోరేజ్​
  • ఆండ్రాయిడ్​ 11 ఓస్​
  • 4000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ
  • ఫాస్ట్​ ఛార్జింగ్​
  • ఫింగర్​ ప్రింట్​ లాక్​
  • గూగుల్​ అసిస్టెంట్​ బటన్​

    మోటోరోలా ఎడ్జ్​ 20 ప్రో

మోటోరోలో ఎడ్జ్​ 20 ప్రో:

  • 108 మెగాపిక్సెల్​ + 16 మెగాపిక్సెల్​ (ఆల్ట్రావైడ్​) + 8 మెగాపిక్సెల్ (3x ఆప్టికల్​ జూమ్​ ఫర్​ ఎడ్జ్​ 20 ప్రో)​ రేర్​ కెమెరా;
  • 32 మెగాపిక్సెల్​ ఫ్రంట్​ కెమెరా + 16 మెగా పిక్సెల్​ సెల్ఫీ స్నాపర్​

  • స్నాప్​డ్రాగన్​ 870 చిప్​ ప్రాసెసర్​
  • 12 జీబీ ర్యామ్​ + 512 జీబీ స్టోరేజ్​
  • ఆండ్రాయిడ్​ 11 ఓస్​
  • 4000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ
  • ఫాస్ట్​ ఛార్జింగ్​
  • ఫింగర్​ ప్రింట్​ లాక్​
  • గూగుల్​ అసిస్టెంట్​ బటన్​

ఈ స్మార్ట్​ ఫోన్ల వేరియంట్ల ధరలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. దీనిపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.

అయితే.. చైనా తర్వాత త్వరలోనే ఈ ఫోన్​ను భారత విపణిలోకి సంస్థ ప్రవేశపెట్టనుందని టెక్​ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి.. శాంసంగ్​ గెలాక్సీ ఏ22 5జీ.. ఫీచర్స్​ లీక్​!

Last Updated : Jul 26, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.