ETV Bharat / science-and-technology

లక్షలాది మంది వాడుతున్న పాస్​వర్డ్​ ఇదే! మీది కూడా అదేనా? సైబర్ ఎటాక్ గ్యారెంటీ!

Most Common Passwords 2023 : నేటి టెక్​ యుగంలో ఇంటికి తాళం వేయకపోయినా పెద్దగా ఫరక్ పడదేమోగానీ ఆన్​లైన్​ ఖాతాలకు గట్టితాళం వేయకపోతే మాత్రం కొంప కొల్లేరైపోవడం ఖాయం. ఎందుకంటే ఇటీవల నార్డ్​పాస్ కంపెనీ చేపట్టిన ఆధ్యయనంలో ప్రపంచంతో పాటు భారత్​లో పెద్ద మొత్తంలో యూజర్లు ఈజీగా కనిపెట్టే పాస్​వర్డ్స్​​ పెటుకున్నారని తేలింది. ఇంతకీ ఆ అధ్యయనంలో వెల్లడైన మోస్ట్ కామన్​ పాస్​వర్డ్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Common Passwords 2023
Most Common Passwords 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 10:00 AM IST

Most Common Passwords 2023 : కంప్యూటర్, మొబైల్, ఇ-మెయిల్, యాప్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్.. ఇలా అన్నిటికీ పాస్​వర్డ్స్​ ఉంటాయి. కానీ, ఈ మధ్య కాలంలో హ్యాకింగ్​ బెడద పెరిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. బలమైన పాస్​వర్డ్​లు పెట్టుకోవాలని టెక్ కంపెనీలు సూచిస్తూనే ఉన్నాయి. అయినా.. యూజర్లలో పెద్దగా మార్పు లేదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది.. ఈజీగా కనిపెట్టగలిగే పాస్​వర్డ్స్(Passwords)​నే పెట్టుకుంటున్నారట! మన ఇండియాలో కూడా అత్యధిక మంది సింపుల్​ కామన్ పాస్​వర్డ్స్​నే యూజ్ చేస్తున్నారట! ఇందులో.. ఎక్కువగా వాడుతున్న కామన్ పాస్వర్డ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Most Common Passwords 2023 in The World : ఇప్పటికీ.. ఎక్కువ మంది వినియోగిస్తున్న మోస్ట్ కామన్ పాస్‌వర్డ్ ​'123456' అని నార్డ్​ పాస్ అనే సాఫ్ట్​వేర్ కంపెనీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైందట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 లక్షల అకౌంట్లకు ‘‘123456’’ అనే పాస్‌వర్డ్‌ (Password) ఉన్నట్లు ఈ రీసెర్చ్ తెలిపింది. ఇలాంటి పాస్ట్‌వర్డ్‌లను క్రాక్‌ చేయడానికి.. సైబర్ నేరస్తులకు సెకన్‌ సమయం కూడా ఎక్కువేనని వెల్లడించింది. ఇక అత్యధిక మంది వాడుతున్న పాస్‌వర్డ్‌ జాబితాలో ‘‘admin’’ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. దాదాపు 40 లక్షల ఖాతాలను దీనితో యాక్సెస్‌ చేయొచ్చని తెలియజేసింది. అలాగే అత్యధిక మంది ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌లలో మూడో స్థానంలో ‘‘12345678’’ అనేది ఉందని వెల్లడించింది. దాదాపు 13.7 లక్షల ఖాతాలకు యూజర్లు దీన్ని పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకున్నారని నార్డ్​పాస్ తెలిపింది.

ఇండియన్స్ వినియోగిస్తున్న మోస్ట్ కామన్ పాస్​వర్డ్.. భారత్‌లో ఎక్కువ మంది వినియోగిస్తున్న పాస్‌వర్డ్‌ ‘‘123456’’ అని నార్డ్‌పాస్ సాఫ్ట్​వేర్ కంపెనీ వెల్లడించింది. దాదాపు 3.6 లక్షల అకౌంట్లకు ఈ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకున్నారని తెలిపింది. ఆ తర్వాత రెండోస్థానంలో 1.2 లక్షల ఖాతాలకు ‘‘admin’’ అనే పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసినట్లు వెల్లడించింది. పరిశోధన బృందాలు 6.6 టెరాబైట్ల డేటాబేస్‌ను స్టీలర్‌ మాల్వేర్ల సాయంతో యాక్సెస్‌ చేసుకొని ఈ సమాచారాన్ని పొందుపర్చినట్లు నార్డ్​పాస్ పేర్కొంది. కేవలం స్టాటిస్టికల్‌ సమాచారం మాత్రమే తమకు అందిందని.. యూజర్ల వ్యక్తిగత వివరాలేవీ పరిశోధకుల బృందం తమకు ఇవ్వలేదని వెల్లడించింది.

Bank Account OTP fraud : బ్యాంకింగ్ అలర్ట్.. ఓటీపీ కూడా కొట్టేస్తున్నారు! ఇలా చేస్తేనే సేఫ్​

అత్యంత వరస్ట్​ పాస్​వర్డ్ అదే​.. ఇతర వెబ్‌సైట్లతో పోలిస్తే.. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్లు బలహీన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని నార్డ్‌పాస్‌ తెలిపింది. ‘‘123456’’ పాస్​వర్డ్​ను.. ‘అత్యంత వరస్ట్‌ పాస్‌వర్డ్‌’గా సదరు కంపెనీ అభివర్ణించింది. గతంలో ‘‘Password’’ అనే పదం అత్యంత వరస్ట్ పాస్​వర్డ్​గా ఉండేదని గుర్తుచేసింది. అదేవిధంగా.. కనీసం 20 అక్షరాలతో పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవాలని నార్డ్​పాస్ సూచించింది. దీంట్లో అప్పర్‌కేస్‌, లోయర్‌కేస్ ఆంగ్ల అక్షరాలు, అంకెలు, స్పెషల్‌ క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పింది. ఒకే పాస్‌వర్డ్‌ను వివిధ అకౌంట్​లకు ఉపయోగించడం కూడా సరికాదని తెలిపింది. తరచూ సమీక్షిస్తూ.. ఎప్పటికప్పుడు మార్చుకుంటే మేలని వివరించింది.

గూగుల్​ సీక్రెట్ సెట్టింగ్స్.. ఓ లుక్కేయండి!

మీ WiFi చోరీకి గురవుతోందా? అయితే లాక్​ వేసుకోండి ఇలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.