ETV Bharat / science-and-technology

అత్యంత వేడి గ్రహం గుట్టు విప్పేందుకు ఇస్రో సన్నద్ధం! - సౌరమండలం

ISRO Venus: చంద్రుడు, అంగారకుడిపైకి విజయవంతంగా అంతరిక్ష నౌకలను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. ఇప్పుడు శుక్ర గ్రహంపైకి వీనస్ మిషన్ చేపట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. సౌర మండలంలోనే అత్యంత వేడిగా ఉండే శుక్ర గ్రహం ఉపరితలం కింద ఏముంది? సల్ఫ్యూ రిక్‌ యాసిడ్‌ మేఘాల కింద రహస్యాలను అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టనుంది. 2024 డిసెంబర్‌ నాటికి ఈ ప్రయోగం చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.

ISRO Venus
ISRO Venus
author img

By

Published : May 4, 2022, 10:18 PM IST

Updated : Aug 10, 2022, 2:25 PM IST

ISRO Venus: సౌరమండలంలోనే అత్యంత వేడిగ్రహంగా ఉన్న శుక్రుడి రహస్యాల గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సిద్ధమవుతోంది. 2024 డిసెంబర్​లో వీనస్ మిషన్ చేపట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం శుక్ర గ్రహశాస్త్రంపై ఇస్రో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌.. వీనస్‌ మిషన్‌ ప్రాజెక్టు నివేదిక సిద్ధమైనట్లు తెలిపారు.

ప్రయోగానికి అవసరమైన నిధులు కూడా సమకూరినట్లు చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధించేలా దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. భారత్‌ వద్ద తగిన సామర్థ్యం ఉన్నందున.. తక్కువ సమయంలో వీనస్‌ మిషన్‌ను ప్రయోగించగలదని సోమ్‌నాథ్‌ తెలిపారు. 2024 డిసెంబర్‌లో వీనస్‌ మిషన్‌ చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత సంవత్సరం భూమి, శుక్రుడు ఒకే వరుసలోకి రానున్నందున అంతరిక్ష నౌకను కక్ష్యలోకి చేర్చాలని భావిస్తోంది. మళ్లీ 2031లో భూమి, శుక్రుడు ఒకే వరుసలోకి రానున్నారు. శుక్రగ్రహంపైకి ఇదివరకు పంపిన మిషన్ల మాదిరి ఫలితాలు పునరావృతం కాకుండా చంద్రయాన్-1, మార్స్ మిషన్ సందర్భంగా సాధించిన ఫలితాలు రాబట్టాలని ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ శాస్త్రవేత్తలకు సూచించారు.

ఇదీ చదవండి: అంతరిక్షంలో అద్భుతం.. 1000 ఏళ్ల తర్వాత ఒకే వరుసలోకి 4 గ్రహాలు

Last Updated : Aug 10, 2022, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.