ETV Bharat / science-and-technology

ISRO Aditya L1 Mission : 'మిషన్​ సూర్య' లాంఛ్​ రిహార్సల్​ సక్సెస్.. నింగిలోకి వెళ్లడమే తరువాయి.. - చంద్రయాన్​ 3 లేటెస్ట్​

ISRO Aditya L1 Mission : సూర్యుడిపై పరిశోధనల కోసం చేపడుతున్న ఆదిత్య ఎల్‌-1 ప్రయోగానికి సంబంధించి ఇస్రో అప్డేట్​ ఇచ్చింది. లాంఛ్​​ రిహార్సల్​, రాకెట్​ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ట్వీట్​ చేసింది.

ISRO Aditya L1 Mission
ISRO Aditya L1 Mission
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 1:40 PM IST

Updated : Aug 30, 2023, 1:58 PM IST

ISRO Aditya L1 Mission : చంద్రయాన్​-3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో).. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన లాంఛ్​ రిహార్సల్​, రాకెట్​ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని బుధవారం ఇస్రో ట్వీట్​ చేసింది.

Aditya L1 Mission Launch Date And Time : శనివారం ఉదయం 11.50 నిమిషాలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. కొరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఆదిత్య ఎల్​-1 ప్రాజెక్టు ఉద్దేశం. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్‌ పాయింట్‌ ఎల్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ వ్యోమనౌకను ప్రవేశపెట్టనున్నారు. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది. ఆదిత్య ఎల్‌-1ను వివిధ జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేసినట్లు ఇస్రోకు చెందిన ఓ అధికారి ఇటీవలే తెలిపారు.

కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు..
Sun Mission Isro : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే. 1500 కిలోల బరువున్న శాటిలైట్‌ ఇది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఆదిత్య-ఎల్‌ 1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌తో పాటు సోలార్‌ అవైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌-లో-ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లను అమర్చనున్నారు. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు.

ల్యాండర్​ ఫొటో తీసిన రోవర్​!
Rover Pragyan Update : మరోవైపు, చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌.. విజయవంతంగా పయనిస్తూ అక్కడి ఉపరితలంపై పరిశోధనలో కీలక అంశాలను గుర్తిస్తోంది. తాజాగా ప్రజ్ఞాన్​ రోవర్​.. విక్రమ్​ ల్యాండర్​ చిత్రాన్ని క్లిక్​ చేసింది. ఆ ఫొటోలను ఇస్రో షేర్​ చేసింది. రోవర్​లోని నావిగేషన్​ కెమెరా ఈ చిత్రాలు తీసినట్లు పేర్కొంది.

  • Chandrayaan-3 Mission:

    Smile, please📸!

    Pragyan Rover clicked an image of Vikram Lander this morning.

    The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam).

    NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE

    — ISRO (@isro) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 : చంద్రుడిపై ఆక్సిజన్​, సల్ఫర్​లతో పాటు మరిన్ని మూలకాలు.. వెల్లడించిన ఇస్రో

Chandrayaan 3 Rover Accident : ప్రజ్ఞాన్‌ రోవర్‌కు తప్పిన పెను ముప్పు.. AI సాయంతో సేఫ్​ రూట్​లోకి టర్న్

Last Updated : Aug 30, 2023, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.