ETV Bharat / science-and-technology

అంతరిక్షం నుంచి నట్టింటి దాకా.. ఈ ఆవిష్కరణలెంతో ప్రత్యేకం! - స్టీల్​ టీత్ బ్రేసెస్​​ని ఎవరు కనిపెట్టారు?

ఈ రోజుల్లో కెమెరాలేని మొబైల్‌ ఫోన్‌ను ఊహించుకోవటమే కష్టం. కానీ.. ఆ కెమెరా ఆవిష్కరణ జరిగిన తీరు ఎంతో ఆసక్తికరం. అలాగే.. టెలివిజన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. మరి అది మొదట ప్రసారం అయిన విధానం ఎంతో ప్రత్యేకం. మానవుడు అంతరిక్షయానం చేపట్టే క్రమంలో ఈ ఆవిష్కరణలు పురుడుపోసుకన్నాయని మనలో ఎంతమందికి తెలుసు?.. మన దైనందిన జీవితంలో భాగమైన కొన్ని వస్తువులు.. అవి రూపాంతరం చెందిన క్రమాన్ని మీరూ చదివేయండి మరి..

TECH NEWS
అంతరిక్షం
author img

By

Published : Nov 17, 2021, 8:24 AM IST

అంతరిక్షమంటే మనిషికి మొదట్నుంచీ ఆసక్తే. విశ్వాంతరాళాన్ని శోధించాలని, గ్రహాంతర యానం చేయాలని ఎప్పుడూ ఉబలాటమే. ఇందుకోసం ఎంతో సాధన సంపత్తిని సమకూర్చుకుంటూ వస్తున్నాడు. అయితే వీటిల్లో కొన్ని మన నిత్య జీవితంలోనూ భాగమైపోయాయి. అవేంటో తెలుసుకుందాం..

మౌస్‌ మ్యాజిక్‌..

మౌస్‌ లేకపోతే డెస్క్‌టాప్‌తో పనిచేయటం చాలా కష్టం. అన్నిసార్లూ అందరికీ కీబోర్డుతోనే పనిచేయటం రాదుగా మరి. మొదట్లో దీన్ని వ్యోమనౌకల నియంత్రణ, సిమ్యులేషన్‌ను సులభం చేయటానికే రూపొందించారు. స్టాన్‌ఫోర్డ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డౌ ఎంజెల్‌బార్ట్‌ దీన్ని తయారుచేసినప్పటికీ.. నిధులు అందించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసానే. చిన్న చెక్కను నున్నటి ఉపరితలం మీద నొక్కినప్పుడు అడుగున ఉండే చక్రాలు కదిలేలా మొదటిసారి మౌస్‌ను తయారుచేశారు. దీంతో కంప్యూటర్‌ తెర మీద కర్సర్‌ కదిలేది. ఎంజెల్‌బార్ట్‌ దీన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలో 1968లో జరిగిన కంప్యూటర్‌ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. అప్పట్నుంచీ రకరకాలుగా మార్పు చెందుతూ.. చివరికి లేజర్‌ ట్రాకింగ్‌తో కూడిన అధునాతన మౌస్‌గా అభివృద్ధి చెందింది.

సెల్ఫీ సైన్స్‌..

ఇప్పుడు కెమెరాలేని మొబైల్‌ ఫోన్‌ను ఊహించుకోవటమే కష్టం. అమెరికా భౌతికశాస్త్రవేత్త ఎరిక్‌ ఫోజమ్‌ సృష్టించిన పిక్సెల్‌ ఇమేజ్‌ గ్రాహకమే నేటి అధునాతన స్మార్ట్‌ఫోన్‌ కెమెరా, వెబ్‌క్యామ్స్‌కు బీజం వేసింది. అంతరిక్షంలో గ్రహ యానానికి సరిపడిన చిన్న కెమెరాను తయారుచేయాలనే ఉద్దేశంతోనే ఫోజమ్‌ దీన్ని రూపొందించారు. అయితే ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుండటంతో అనతికాలంలోనే చాలా పలు పరిశ్రమలు వినియోగించటం ఆరంభించాయి. క్రమంగా ఫోన్‌ కెమెరాగానూ మారిపోయింది. ఫోజమ్‌ సృష్టించిన పిక్సెల్‌ ఇమేజ్‌ గ్రాహకం కలర్‌ ఫిల్టర్లు, కాంతిని విద్యుత్‌శక్తిగా మార్చే ఫొటోడయోడ్‌ సాయంతో పనిచేస్తుంది. గ్రాహకం మీదుగా కాంతి ప్రసరిస్తున్నప్పుడు.. దాన్ని గ్రాహకం స్వీకరించి, విద్యుత్‌ సంకేతంగా మారుస్తుంది. తర్వాత వివిధ ట్రాన్సిస్టర్లు ఈ విద్యుత్‌ సంకేతాలను మెరుగుపరుస్తాయి. అనంతరం అవన్నీ ఫొటోగా రూపాంతరం చెందుతాయి.

వాటర్‌ ఫిల్టర్‌..

నిజానికి ప్రాథమిక స్థాయి వాటర్‌ ఫిల్టర్లు 50ల నుంచే వాడకంలో ఉన్నాయి. అయితే అపోలో ఉపగ్రహ కార్యక్రమం పరిశోధనతోనే ఆధునిక వాటర్‌ ఫిల్టర్‌ అందుబాటులోకి వచ్చింది. విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ పెద్దమొత్తంలో నీరు ఎక్కువకాలం శుభ్రంగా ఉంచేందుకే శాస్త్రవేత్తలు దీన్ని నిర్మించారు. బొగ్గుకు కాలుష్యాలను, నుసిని స్వీకరించే గుణముంది. దీని ఆధారంగానే ప్రత్యేక నీటి వడపోత వ్యవస్థను రూపొందించారు. ఇదో ఆక్సీకరణ ప్రక్రియ. ఇది కర్బన అణువుల మధ్య లక్షలాది రంధ్రాలు తెరచుకునేలా చేస్తుంది. దీంతో బొగ్గు మరింత ఎక్కువగా కలుషితాలను స్వీకరిస్తుంది. ఇదే క్రమంగా మారుతూ నేటి వాటర్‌ ఫిల్టర్ల ఆవిష్కరణకు దారితీసింది.

శాటిలైట్‌ టెలివిజన్‌..

టీవీ సంకేతాలను ప్రసారం చేసిన మొట్టమొదటి ఉపగ్రహం టెల్‌స్టార్‌-1. దీన్ని నాసా 1962లో ప్రయోగించింది. అట్లాంటిక్‌ మహా సముద్రం మీదుగా ప్రయోగాత్మకంగా ఉపగ్రహ సమాచారాలను ప్రసారం చేయటం దీని ఉద్దేశం. ఇది ట్రాన్స్‌పాండర్‌ సాయంతో సమాచారాన్ని ప్రసారం చేసేది. చిన్న చిన్న యాంటెనాల ద్వారా అందే మైక్రోవేవ్‌ తరంగాలను గ్రహించి.. వాటిని ఒక గొట్టం ద్వారా పంపిస్తూ మెరుగుపరచేది. తర్వాత భూమి మీది స్టేషన్లకు ప్రసారం చేసేది. ఈ పరిజ్ఞానానికి నాసా నిరంతరం సానపడుతూ.. ప్రసారమయ్యే సంకేతాల్లో గరగరలు, ఎర్రర్స్‌ను తగ్గించేలా అధునాతనంగా తీర్చిదిద్దింది. ఇదే క్రమంగా హెచ్‌డీ వీడియో, ఆడియో ప్రసారాలకు దారితీసింది.

ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌..

వాయు కాలుష్యం ఆరుబయటి సమస్యే అనుకుంటాం గానీ ఇంట్లోనూ గాలి కాలుష్యం తక్కువేమీ కాదు. బ్యాక్టీరియా, కాలుష్య కారకాల వంటివెన్నో గాలిలో తిరుగాడుతుంటాయి. దీన్ని శుద్ధి చేయటానికి ఎయిర్‌ ప్యూరిఫయర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి దీనికి బీజం వేసింది అంతరిక్ష పరిశోధనే. అంతరిక్షంలో మొక్కలు అక్కడి వాతావరణాన్ని తట్టుకోవటం కోసమే దీన్ని తయారుచేశారు. ఇది అక్కడ అన్నిరకాల విషతుల్యాలను బాగా వడపోయటంతో నిత్య జీవితంలోకీ వాడకంలోకి వచ్చింది.

గీతలు పడని కళ్లద్దాలు..

అంతరిక్షంలో దుమ్ము, ధూళి వ్యోమగాములకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వీటి నుంచి కాపాడుకోవటమెలా? అని నాసా ఇంజినీర్లు ఆలోచిస్తుండగా వజ్రం వంటి కార్బన్‌ (డీఎల్‌సీ) కంటబడింది. దీన్ని ఉపయోగించి ఓ కొత్తరకం రక్షణ పొరను తయారుచేశారు. హెల్మెట్‌ అద్దాల మీద పరచగా ఇది మంచి ఫలితం చూపించింది. దీన్ని గుర్తించిన ఒక కళ్లద్దాల కంపెనీ నాసాతో జట్టుకట్టి వినూత్న ప్లాస్టిక్‌ పొరను రూపొందించింది. దీన్ని అద్దాలకు రక్షణ పొరగా ఏర్పాటు చేయటంతో గీతలు పడటం గణనీయంగా తగ్గిపోయింది. ఇలా గీతలు పడని కళ్లద్దాలు ఆవిష్కృతమయ్యాయి.

పారదర్శక బ్రేసెస్​..

దంతాల అమరికను సరిచేయటానికి బ్రేసెస్‌ అమర్చటం చూస్తూనే ఉంటాం. స్టీలు బ్రేసెస్‌ అయితే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. దీన్ని తప్పించటానికే పారదర్శక బ్రేసెస్‌ అందుబాటులోకి వచ్చాయి. అసలు ఇది క్షిపణి ట్రాకర్ల మీదుండే ఇన్‌ఫ్రారెడ్‌ యాంటెనా రక్షణ కోసమే పుట్టుకొచ్చింది. తేలికగా ఉంటూనే దృఢమైన, మృదువైన, ఉష్ణాన్ని తట్టుకునే పదార్థాన్ని కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు పాలీక్రిస్టలిన్‌ అల్యూమినాను (టీపీఏఐ) సృష్టించారు. దీనికి కాంతిని శోషించుకునే గుణం ఉండటంతో పారదర్శకంగానూ ఉంటుంది. పళ్లను సరిచేయటానికి దంత వైద్యులు సైతం సరిగ్గా ఇలాంటి పదార్థం కోసమే ఎదురుచూస్తున్నారు. టీపీఏఐ గుణాలు సరిగ్గా సరిపోయాయి. ఇంకేముంది? పారదర్శక బ్రేసెస్‌ను రూపొందించారు. స్టీలు కన్నా గట్టిగా ఉండటం, ఆకర్షణీయంగానూ ఉండటంతో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు చాలామంది వీటినే వాడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.