ETV Bharat / science-and-technology

స్పామ్ మెయిళ్లతో ఇన్​బాక్స్ నిండిపోయిందా?.. ఈ చిట్కాలు మీకోసమే! - ఈమెయిల్ స్పామ్​ మెసేజ్​

ఈమెయిల్​లో మనకు వచ్చే మెయిల్స్​ కంటే స్పామ్​ మెయిల్సే ఎక్కువ.. వాటిని అన్​సబ్‌స్క్రయిబ్‌ చేసేందుకు నానాతంటాలు పడుతుంటాం.. వీటి వల్ల ముఖ్యమైన మెయిళ్లు సైతం కనిపించకుండా కిందకి వెళ్లే అవకాశం ఉంది. అలాంటి వాటిని తొలగించేందుకు చిట్కాలు మీకోసం..

How To Remove Spam Messages In Mail
How To Remove Spam Messages In Mail
author img

By

Published : Sep 17, 2022, 1:04 PM IST

Spam Messages In Mail : ఈ-మెయిల్‌తో ప్రయోజనాలు ఎన్నో. కాకపోతే స్పామ్‌ మెయిళ్లతోనే చిక్కు. సబ్‌స్క్రయిబ్‌ చేసుకోకపోయినా వివిధ వ్యాపార సంస్థల నుంచి టపాలు వచ్చి పడుతుంటాయి. ఇవి చికాకు కలిగించటమే కాదు, ముఖ్యమైన మెయిళ్లు కిందికి పోయేలా చేస్తాయి. ఇలాంటి అవాంఛిత మెయిళ్లను ఒకోటీ తొలగించుకోవటం పెద్ద ప్రహసనం. జీమెయిల్‌లో వీటిని తేలికగా ఎలా వదిలించుకోవాలో చూద్దాం.

  • జీమెయిల్‌లోకి లాగిన్‌ కావాలి. స్పామ్‌ మెయిల్‌ విభాగంలోకి వెళ్లి అన్‌సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవాలనుకునే వాటిని ఎంచుకోవాలి.
  • పైన కనిపించే 'ఐ' బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు 'రిపోర్ట్‌ స్పామ్‌ లేదా రిపోర్ట్‌ స్పామ్‌ అండ్‌ అన్‌సబ్‌స్క్రయిబ్‌' ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఐడీల జాబితాలను పరిశీలించి, ముఖ్యమైనవేవీ లేవని భావిస్తే ‘రిపోర్ట్‌ స్పామ్‌ అండ్‌ అన్‌స్క్రయిబ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే ఆయా ఖాతాల నుంచి మెయిళ్లు రావటం ఆగిపోతుంది.

ఫిల్టర్ల సృష్టి

  • జీమెయిల్‌ను ఓపెన్‌ చేసి, పైన సెర్చ్‌ బాక్స్‌ మీద క్లిక్‌ చేయాలి. అన్‌సబ్‌స్క్రయిబ్‌ అని టైప్‌ చేయాలి. దీంతో అన్ని ప్రమోషనల్‌ మెయిళ్ల జాబితా కనిపిస్తుంది.
  • అన్ని స్పామ్‌ మెయిళ్లను ఎంచుకోవాలి. వీటి జాబితాలో ఉపయోగపడే న్యూస్‌లెటర్లు లేదా వాడుకునే మెయిళ్ల వంటివేవీ లేకుండా చూసుకోవాలి.
  • తర్వాత పైన కనిపించే మూడు చుక్కల మీద నొక్కి, 'ఫిల్టర్‌ మెసేజెస్‌ లైక్‌ దీస్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అనంతరం 'క్రియేట్‌ ఫిల్టర్‌' ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి. అవి వాటంతటవే డిలీట్‌ కావాలనుకుంటే క్రియేట్‌ ఫిల్టర్‌ మీద నొక్కి 'డిలీట్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అప్పుడు ఫిల్టర్‌ క్రియేట్‌ అయినట్టు కింద ఒక పాపప్‌ కనిపిస్తుంది. వీటిని డిలీట్‌ చేసుకోవటమే కాదు, లేబుల్స్‌ అప్లయి చేయటం ద్వారా అవసరమైనట్టుగానూ విభజించుకోవచ్చు.

తాత్కాలిక ఈమెయిల్‌ వాడకం

  • ఆయా వెబ్‌సైట్లకు మన ప్రధాన ఈమెయిల్‌ ఐడీని ఇచ్చినట్టయితే పలు థర్డ్‌పార్టీ యాప్‌లకు చేరుకోవచ్చు. అవి స్పామ్‌ మెయిళ్లను పంపొచ్చు. కొన్నిసార్లు ఇవి విశ్వసనీయమైనవనీ అనిపిస్తుంటాయి. వాటిని నొక్కితే ఫిషింగ్‌ లింకులలోకి వెళ్లిపోవచ్చు. దీంతో వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చిక్కొచ్చు. అందువల్ల ప్రధాన ఈమెయిల్‌ ఐడీకి బదులు తాత్కాలిక ఐడీని వాడుకోవటం మేలు.
  • తాత్కాలిక మెయిల్‌ ఐడీలకు వీలు కల్పించే tempmail.org వంటి వెబ్‌సైట్లలోకి వెళ్లాలి.
  • అందుబాటులో ఉన్న తాత్కాలిక ఈమెయిల్‌ ఐడీని కాపీ చేసుకోవాలి. అవసరమైనచోట ప్రధాన మెయిల్‌ ఐడీకి బదులు దీన్ని వాడుకోవాలి. అప్పుడు జీమెయిల్‌కు కాకుండా ఈ చిరునామాకు మెయిళ్లు వస్తాయి. కావాలంటే ఇలాంటి వెబ్‌సైట్ల కోసం విడిగా జీమెయిల్‌ ఐడీనీ సృష్టించుకోవచ్చు. ఇలా జీమెయిల్‌ ఖాతాను స్పామ్‌ మెయిళ్ల బెడద నుంచి కాపాడుకోవచ్చు.

ఇదీ చదవండి: గూగుల్​ క్రోమ్​లో 5 సూపర్​ ట్రిక్స్​.. ఇవి తెలిస్తే బ్రౌజింగ్ మరింత ఈజీ

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. పాత మెసేజ్‌ల సెర్చ్‌ ఇక మరింత ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.