ETV Bharat / science-and-technology

Phone Battery Health Check : ఫోన్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయాలా?.. ఈ సింపుల్​ టిప్స్​​ పాటించండి! - మొబైల్​ బ్యాటరీ హెల్త్​ను ఎలా చేక్​ చాయాలి

Phone Battery Health Check In Telugu : మొబైల్​ ఫోన్స్​ లైఫ్​టైమ్ అనేది బ్యాటరీ లైఫ్​పై అధారపడి ఉంటుంది. కానీ చాలా మంది ఫోన్ బ్యాటరీ విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఇది సరికాదు. మీ ఫోన్ బ్యాటరీ పనితీరును ఎప్పటికప్పుడు చెక్​ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే దానిని సరిచేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఫోన్​ బ్యాటరీని ఎలా చెక్​ చేసుకోవాలి? దానిని ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం.

How To Check Phone Battery Health
Phone Battery Health Check
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 3:22 PM IST

Phone Battery Health Check :​ ఫోన్​లన్నింటికీ బ్యాటరీయే ప్రధానం. దీనిపైనే ఫోన్​ లైఫ్​టైమ్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కీలకమైన బ్యాటరీ పట్ల నిర్లక్ష్యం వహించవద్దంటున్నారు టెక్​ నిపుణులు. ఎందుకంటే ఫోన్​ బ్యాటరీపై పడే పనిభారం అంతాఇంతా కాదు. అలాంటి వస్తువు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని సూచిస్తున్నారు ఎక్స్​పర్ట్స్​. అందుకే మొబైల్ బ్యాటరీ లైఫ్​ లేదా దాని స్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ బ్యాటరీలో ఏమైనా లోపాలు లేదా సమస్యలు తలెత్తితే వెంటనే వాటిని సవరించుకునే ప్రయత్నం చేయాలి. దీనితో మీ ఫోన్​ బ్యాటరీ లైఫ్​ పెరగడమే కాకుండా మీ డివైజ్​ ఎక్కువ కాలం పాటు మంచి కండీషన్​లో ఉండేందుకు అవకాశం ఉంటుంది.

ముందే జాగ్రత్తపడడం మంచిది!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్నీ మొబైల్​ డివైజుల్లో బ్యాటరీ లైఫ్​ను చెక్​ చేసుకునే సౌకర్యం ఉంటోంది. అయితే చాలా మంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఫోన్​ బ్యాటరీ పూర్తిగా డెడ్ అయ్యాక​ లేదా పాడైపోయాక మార్చుకోవడం కంటే.. ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ బ్యాటరీ తద్వారా ఫోన్ రెండూ దీర్ఘకాలం పాటు పనిచేస్తాయి. ఇందుకోసం తరచుగా బ్యాటరీ హెల్త్​ కండిషన్​ను తెలుసుకుంటూ ఉండాలి. వీక్​ కండిషన్​లో ఉంటే గనుక అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. అందుకే ఇప్పుడు బ్యాటరీని కాపాడుకునేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్​ ఫోన్​లో బ్యాటరీ లైఫ్​ను ఎలా చెక్​ చేయాలి?
మీ ఫోన్​ నుంచి *#*#4636#*#*కు డయల్​ చేస్తే, ఓ హిడెన్​ మెనూను ఓపెన్​ అవుతుంది. ఇది మీ డివైజ్​కి సంబంధించి బ్యాటరీ స్టేటస్​, యూసేజ్​ స్టాటిస్టిక్స్​, వై-ఫై కనెక్టివిటీ లాంటి అన్ని వివరాలను తెలియజేస్తుంది. అయితే ఈ ట్రిక్​ అన్ని ఆండ్రాయిడ్​ ఫోన్​లలో పనిచేయకపోవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్​ ప్లేస్టోర్​లో లభించే థర్డ్​-పార్టీ యాప్​లపై ఆధారపడాల్సి ఉంటుంది.

శాంసంగ్​ ఫోన్స్​లో బ్యాటరీ హెల్త్​ను చెక్​ చేసుకోండిలా!
How To Check Battery Health In Android Mobile : 'శాంసంగ్ మెంబర్స్'​​ అనేది ప్రీ-ఇన్​స్టాల్డ్​ కమ్యూనిటీ యాప్​. ఇది ఇతర శాంసంగ్​ యూజర్స్​తోనూ కనెక్ట్​ అయి ఉంటుంది. తాజా వార్తలు సహా సపోర్ట్​ కంటెంట్​ను ఇది అందిస్తుంది. అంతేకాకుండా మీ డివైజ్​కి సంబంధించిన హార్డ్​వేర్​ స్టేటస్​ను కూడా ఇది తెలియజేస్తుంది. అయితే బ్యాటరీకి సంబంధించిన సమగ్ర విశ్లేషణను ఈ అప్లికేషన్​ ఇవ్వకపోయినప్పటికీ.. అది మంచి కండిషన్​లో ఉందా? లేదా? అనేది మాత్రం మీకు చూపిస్తుంది. ఒకవేళ మీ శాంసంగ్ ఫోన్​లలో శాంసంగ్ మెంబర్స్ యాప్​ లేకపోతే గెలాక్సీ స్టోర్​ యాప్​ లేదా గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోండి. ఆపై ఈ స్టెప్స్​ను ఫాలో అవుతూ మీ బ్యాటరీ లైఫ్​ను ఈజీగా తెలుసుకోండి.

శాంసంగ్ మెంబర్స్ ​> డయాగ్నోస్టిక్స్ ​> ఫోన్​ డయాగ్నోస్టిక్స్ > బ్యాటరీ స్టేటస్​

ఐఫోన్​లో బ్యాటరీ కండిషన్​ లేదా హెల్త్​​ను ఎలా చెక్ చేయాలి?
ఐఫోన్​లో బ్యాటరీ కండిషన్​ను చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఇందు కోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్​ను వాడనవసరం లేదు. కేవలం ఐఫోన్ సెట్టింగ్స్​లో చూస్తూ సరిపోతుంది. అది ఎలా అంటే?

ఐఫోన్ సెట్టింగ్స్​లోకి వెళ్లి మీ ఫోన్​ బ్యాటరీ యూసేజ్​ సహా దాన్ని పనితీరు వివరాలను తెలుసుకోవచ్చు. ఏ అప్లికేషన్​ ఎంత శాతం బ్యాటరీని వినియోగించింది? ఏది ఎక్కువ బ్యాటరీ పవర్​ను వాడుకుంది? అనే సమాచారాన్ని ఇక్కడ గ్రాఫ్​ రూపంలో మనం చూడవచ్చు. ఇందు కోసం మీరు ఈ కింద చెప్పిన స్టెప్స్​ ఫాలో అవ్వండి.

సెట్టింగ్స్​ > బ్యాటరీ > బ్యాటరీ హెల్త్​ అండ్​ ఛార్జింగ్​

Phone Battery Health Check Apps : ప్లేస్టోర్​లో అందుబాటులో ఉన్న కొన్ని అప్లికేషన్​ల ద్వారా కూడా మీ ఫోన్​ బ్యాటరీ కండిషన్​ను సులువుగా తెలుసుకోవచ్చు.

AccuBattery : ఆక్యూబ్యాటరీ.. ఈ యాప్​ సాయంతో మీ డివైజ్​ బ్యాటరీ కండిషన్​ను ఇట్టే తెలుసుకోవచ్చు. ఇది మీ ఫోన్​ మొత్తాన్ని సెకన్లలో స్కాన్​ చేస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ పని సమయం పనిచేస్తుందో తెలియజేస్తుంది. అంతేకాకుండా మీరు ఉండే స్థలంలోని ఉష్ణోగ్రత వివరాలను కూడా ఇది చూపిస్తుంది. ఈ ఆక్యూబ్యాటరీ యాప్​ విశేషమేంటంటే.. ఇందులో మీరు మొబైల్​ కొన్న కొత్తలో దాని బ్యాటరీ కెపాసిటీ ఏమిటి? ప్రస్తుతం ఉన్న కెపాసిటీ ఏమిటి? అనే వివరాలను కూడా తెలియజేస్తుంది. అలాగే ప్రతిరోజూ బ్యాటరీకి కావాల్సిన దానికంటే ఎక్కువసేపు ఛార్జింగ్​ పెట్టడం ద్వారా కలిగే నష్టాన్ని కూడా ఇది అంచనా వేస్తుంది.

Battery Guru : బ్యాటరీ గురు.. ఇది ఒక లైట్​వెయిట్​ యాప్​. దీని సాయంతో మీ ఫోన్​ బ్యాటరీ వోల్టేజీ, టెంపరేచర్​ సహా బ్యాటరీ స్టేటస్​ను తెలుసుకోవచ్చు. కానీ మీ ఫోన్​లోని ఇతర యాప్​లు బ్యాటరీని ఏ విధంగా వినియోగిస్తున్నాయి? వాటిని ఎలా ఆప్టిమైజ్​ చేయాలి లాంటి లోతైన విశ్లేషణనను ఇవ్వలేదు. పైగా ఈ యాప్​ పూర్తి యాడ్స్​తో నిండి ఉంటుంది. ఇది మీకు కాస్త చికాకు తెప్పించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే బ్యాటరీ గురు కేవలం మీ ఫోన్​ బ్యాటరీ మంచి కండిషన్​లో ఉందా? లేదా? అనే సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది.

CPU-Z : ఇది విస్తృతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్​ఫోన్​ అనలైజర్​. ఇది కొన్ని క్షణాల్లోనే మీ ఫోన్​ బ్యాటరీకి సంబంధించిన పూర్తి హెల్త్​ హిస్టరీని తెలియజేస్తుంది. ఇది మీ డివైజ్​ ప్రాసెసర్​, ఫోన్​ మోడల్​, ఓఎస్​​ సహా సెన్సార్​కి సంబంధించిన అన్ని వివరాలను తెలుపుతుంది. పైగా ఇందులో యాడ్స్​ రాకపోవడం విశేషం. అయితే ఇవన్నీ తెలియజేయడానికి CPU-Z కాస్త ఎక్కువ బ్యాటరీ శక్తిని వినియోగిస్తుంది. దీనిని తగ్గించుకునేందుకు.. సెట్టింగ్స్​ మెనూలోకి వెళ్లి మీకు అవసరం లేని.. CPU, GPU సహా సెన్సార్​ ఫీచర్స్​ను ఆఫ్​ చేయండి.

బ్యాటరీ బ్యాడ్​ కండిషన్​లో ఉంటే ఏం చేయాలి?
మీ ఫోన్​ బ్యాటరీ అద్భుతమైన కండిషన్​లో ఉందని మీరు గుర్తిస్తే మరేం ఫర్వాలేదు. అయితే ఒకవేళ బ్యాటరీ వీక్​గా లేదా బ్యాడ్​ కండిషన్​లో ఉందని మీరు గమనిస్తే గనుక దానిని (బ్యాటరీని) వెంటనే మార్చడం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

శాంసంగ్​ సహా ఇతర డివైజ్​ల బ్యాటరీ లైఫ్​ పెరగాలంటే ఇలా చేయండి!
How To Improve Phone Battery Health :

  • ఫోన్​ను డార్క్​ మోడ్​లో వాాడాలి.
  • పనికిరాని లేదా వాడని యాప్స్​ను అన్​ఇన్​స్టాల్ చేయాలి
  • పవర్​ సేవింగ్​ మోడ్​ను ఎప్పటికీ ఎనేబుల్​ చేసి పెట్టుకోవాలి.
  • 80% - 90% ఛార్జింగ్​ పూర్తయిన తర్వాత ఛార్జర్​ పిన్​ను తొలగించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.