ETV Bharat / science-and-technology

Jio Phone Next: జియో ఫోన్​పై డిస్కౌంట్‌ ఆఫర్‌.. ఎక్స్ఛేంజ్​పై రూ.2 వేల తగ్గింపు - జియో నెక్స్ట్​ ఆఫర్​

Jio Phone Next Exchange Offer: టెలికాం సంచలనం జియో మరో ఆఫర్​తో ముందుకొచ్చింది. జియో ఫోన్‌ నెక్స్ట్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ప్రకటించింది. గత అక్టోబర్‌లో విడుదల చేసిన ఈ మొబైల్‌ ధర ప్రస్తుతం రూ.6,499 ఉండగా.. ప్రస్తుతం ఏదైనా 4G ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి జియో ఫోన్‌ నెక్స్ట్‌ను కొనుగోలు చేస్తే రూ.2 వేలు తగ్గింపు లభిస్తుంది.

Jio Phone Next Exchange Offer
Jio Phone Next Exchange Offer
author img

By

Published : May 19, 2022, 4:47 AM IST

Jio Phone Next Exchange Offer: భారతీయ టెలికాం దిగ్జజం జియో సంస్థ తన జియో ఫోన్‌ నెక్స్ట్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ ప్రకటించింది. గత అక్టోబర్‌లో విడుదల చేసిన ఈ మొబైల్‌ ధర ప్రస్తుతం రూ.6,499 ఉంది. అయితే, ఏదైనా 4G ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి జియో ఫోన్‌ నెక్స్ట్‌ను కొనుగోలు చేస్తే రూ.2 వేలు తగ్గింపు లభిస్తుంది. ఈ మేరకు కంపెనీ వెబ్‌సైట్‌లో జియో ఈ విషయాన్ని వెల్లడించింది.

Jio Phone Next Features: సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని 4జీ సౌలభ్యం, ప్రీమియం ఫీచర్‌లతో జియో ఈ మొబైల్‌ను అభివృద్ధి చేసింది. 5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ స్క్రీన్‌తో వచ్చే ఈ పాకెట్-ఫ్రెండ్లీ ఫోన్‌.. 2జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజీకి మద్దతిస్తుంది. పైగా మెమరీని 512జీబీ వరకు విస్తరించుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్‌ 215 క్యూఎమ్‌ ప్రాసెసర్‌, వెనుకాల 13 ఎంపీ, ముందు 8 ఎంపీ ఆటో ఫోకస్‌ కెమెరాల, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులోని మరిన్ని ప్రత్యేకతలు.

వాయిస్‌ అసిస్టెంట్‌, ఆటోమెటిక్‌ రీడ్‌-అలౌడ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ టెక్ట్స్‌, 12 భాషల్లోకి అనువదించే లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్‌ సిమ్‌తో వచ్చే ఈ మొబైల్‌ సరికొత్త 'ప్రగతి ఓఎస్‌'పై రన్‌ అవ్వడం విశేషం. ప్రస్తుతం జియో ఫోన్‌ నెక్స్ట్‌ ధర రూ.6,499గా ఉండగా.. రూ.1,999 ముందస్తు చెల్లింపుతో రూ.500 ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి దీన్ని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని 18 లేదా 24 నెలల వాయిదాలలో చెల్లించుకోవచ్చు. డిస్కౌంట్‌ ఆఫర్‌కు కూడా ఈ చెల్లింపు వర్తించనుంది.

ఇవీ చదవండి: వాట్సాప్​లో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికీ తెలియకుండా గ్రూప్​లకు బై!

Google Pixel: గూగుల్​ నుంచి స్మార్ట్​వాచ్​, ట్యాబ్లెట్​ ధరెంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.