ETV Bharat / science-and-technology

కాలిపోతున్న ఈ-బైక్స్.. సేఫ్టీపై డౌట్స్.. కేంద్రం ఏం చేయబోతుంది? - మంటల్లో కాలిపోతున్న ఎలక్ట్రిక్​ వాహనాలు

E Bike Fire Incidents: దేశంలో పెట్రోల్​ రేట్లు ఆకాశాన్నంటుతున్న క్రమంలో విద్యుత్​ వాహనాలకు డిమాండ్​ పెరిగింది. ఎలక్ట్రిక్ బైక్​ల​తో మొదలై కార్లు, బస్సులు సైతం అందుబాటులోకి వచ్చాయి. కేంద్రం ప్రోత్సాహం, రాయితీలు, ఎక్కువ మైలేజీ వంటివి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే.. ఇటీవల ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఛార్జింగ్​ చేస్తున్నప్పుడే కాకుండా.. సాధారణ సమయాల్లోనూ మంటలు చెలరేగి కాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-బైక్​ భద్రతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు స్వయంగా కేంద్రం రంగంలోకి దిగింది.

ి
ి
author img

By

Published : Mar 29, 2022, 7:11 PM IST

E Bike Fire Incidents: ఎలక్ట్రిక్​ బైక్​లు.. ఇటీవల మార్కెట్లోకి కోకొల్లలుగా వస్తున్నాయి. కాలుష్యానికి చెక్​ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ప్రజలు ముఖ్యంగా యువత ఈ- బైక్​ల కొనుగోలుకు మొగ్గుచూపుతోంది. పర్యావరణహితమైన వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు, పన్ను రాయితీలను కూడా ప్రకటించింది. పెరుగుతున్న పెట్రోల్​ రేట్లకు ప్రత్యామ్నాయంగా కనిపించడం, తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజీ వంటి ప్రత్యేక ఫీచర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇది నాణేనికి ఒక వైపు.

ఛార్జింగ్​ పెడుతుండగా ఈ-బైక్​లలో మంటలు, పార్కింగ్​ చేసిన ఎలక్ట్రిక్​ స్కూటర్లు మంటల్లో దగ్ధం.. ఇది మరో కోణం. ఎలక్ట్రిక్​ బైక్​ ఛార్జింగ్​ చేస్తుండగా మంటలు చెలరేగి వెలువడిన పొగతో ఊపిరాడక తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన తమిళనాడు, వెల్లూరు జిల్లాలోని చిన్న అల్లాపురమ్​లో మార్చి 26 రాత్రి జరిగింది. తమిళనాడులోనే తిరువళ్లూరులో ఇంటిముందు పార్క్​ చేసిన స్కూటర్​ కాలిపోవడమే కాకుండా.. ఇంట్లోని సుమారు 3 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది.

E-Bike Fire Incidents Become Serious Problem
వెల్లూర్​లో ఎలక్ట్రిక్​ బైక్​ చేస్తుండగా మంటలు చెలరేగి తండ్రీకూతురు దుర్మరణం

కొద్దిరోజుల కింద సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ డిపోలో ఓ ఎలక్ట్రిక్​ బస్సు ఛార్జింగ్​ పెడుతుండగా.. మంటలు చెలరేగి దగ్ధమైంది. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో ఛార్జింగ్​ చేస్తుండగా ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనం మంటల్లో కాలిపోయింది. మహారాష్ట్ర పుణెలోనూ ఓ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ చూస్తే.. ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా కనిపిస్తున్న ఈ ఈ-బైక్​ల​ తయారీలో కంపెనీలు అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయా? లేదా? అనే సందేహం కలగకమానదు. గతంలో కొన్ని ఫోన్లు(ముఖ్యంగా చైనా ఫోన్లు) పేలిపోవడం వంటి ఘటనలు ఎన్నో చూశాం. ఇప్పుడు బైక్​లే కాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఈ-బైక్​లను కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు స్వయంగా కేంద్రం రంగంలోకి దిగింది.

కర్ణాటక శివమొగ్గలో ఈ-బైక్​ దగ్ధం

పుణెలో గత వారం ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మంటలు చెలరేగిన సంఘటనపై.. కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడం సహా నివారణ చర్యలపై సలహాలు ఇవ్వాల్సిందిగా సెంటర్​ ఫర్​ ఫైర్​ ఎక్స్​ప్లోజివ్​ అండ్​ ఎన్విరాన్​మెంట్​ సేఫ్టీకి (సీఎఫ్​ఈఈఎస్​) స్పష్టం చేసింది రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. భద్రతా ప్రమాణాల విషయంలో తగు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు పుణె ఘటనపై ఓలా ఎలక్ట్రిక్​ స్పందించింది. ఈ- స్కూటర్​ పేలుడు కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, తగు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఎలక్ట్రిక్​ స్కూటర్​ తగలబడుతున్న వీడియో ఇటీవల సోషల్​ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. దీంతో.. వాహనాల భద్రతా ప్రమాణాలపై వినియోగదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఛార్జింగ్​ చేస్తుండగా మంటలు.. ఎలక్ట్రిక్​​ బైక్​ దగ్ధం

'ఈ-బైక్'​లో మంటలు.. ఊపిరాడక తండ్రీకూతురు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.