ETV Bharat / science-and-technology

బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేసి ఉంచడం లాభమా? నష్టమా? - బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేసి ఉంచడం లాభమా నష్టమా

Do You Leave Power Saving Mode On All The Time : మీరు మీ ఫోన్​లో ఎప్పుడూ బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేసుకుని ఉంచుతారా? అయితే ఇది మీ కోసమే. బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. కానీ, అదే సమయంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Battery saving tips in telugu
Do you leave power saving mode on all the time
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 11:18 AM IST

Updated : Dec 9, 2023, 11:42 AM IST

Do You Leave Power Saving Mode On All The Time : మీ స్మార్ట్​ఫోన్, టాబ్లెట్, స్మార్ట్​వాచ్ లేదా ల్యాప్​టాప్ బ్యాటరీ ఛార్జింగ్ వేగంగా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందా? అయితే మీరు బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయడం వల్ల ఛార్జింగ్ ఎక్కువ సమయం వచ్చేలా చూసుకోవచ్చు. అందుకే చాలామంది ఈ ఆప్షన్​ను ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉంచుతారు. మరి దీని వల్ల ఫోన్​ భద్రంగా ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
Battery Saver Mode Benefits : బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం బ్యాటరీ అయిపోతుందని టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఫోన్ డిస్​ప్లే, బ్యాక్ గ్రౌండ్ యాప్​లను నియంత్రణలో ఉంచుతుంది. ఎక్కువ ఎనర్జీని వాడే యాప్​లను స్లీప్ మోడ్​లో ఉంచుతుంది. ఫలితంగా ఒకసారి ఛార్జింగ్ చేస్తే సాధారణ సమయం కన్నా కాస్త ఎక్కవ సమయం పనిచేస్తుంది. అంతేకాకుండా తరచూ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల బ్యాటరీ జీవితకాలం పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ కాలం వాడే బ్యాటరీలు సహజంగానే పాడవుతుంటాయి. సేవర్ మోడ్ ఆన్ చేయడం వల్ల అనవసర వినియోగం తగ్గి, బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుంది.

బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయడం వల్ల కలిగే నష్టాలు
Battery Saver Mode Disadvantages : బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలతో పాటు.. కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. స్క్రీన్ మసకగా మారుతుంది. కనుక స్క్రీన్​ను చూడడం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమైన నోటిఫికేషన్లు రాకపోవచ్చు. పైగా జీపీఎస్ లాంటి ఫీచర్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. అంతేకాకుండా నిరంతరం సేవర్ మోడ్​లో ఉండటం వల్ల కొన్ని యాప్​లు నిద్రావస్థలోనే ఉంటాయి. దీంతో మీకు అవసరమైన సమాచారం, వార్తలు, అప్​డేట్స్​, సందేశాలు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్​ కనెక్ట్ చేయడంలో కూడా సమస్యలు ఏర్పడవచ్చు.

బ్యాటరీ సేవర్ మోడ్‎ను ఎప్పుడు వాడాలి?
When To Use Battery Saver Mode : బ్యాటరీ సేవర్ మోడ్ వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ బ్యాటరీ సేవర్​ మోడ్​ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే..

1. మీ బ్యాటరీలో ఛార్జింగ్​ తక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయవచ్చు. ఉదాహరణకు మీ బ్యాటరీలో 15 నుంచి 30 పాయింట్ల మధ్య బ్యాటరీ ఛార్జింగ్ ఉంటే ఆ సమయంలో బ్యాటరీ సేవర్​ మోడ్​ ఆన్ చేయవచ్చు. దీని వల్ల పూర్తిగా ఫోన్​ ఛార్జ్ అయిపోకుండా ఉంటుంది.

2. మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా మీరు ఛార్జర్ మరిచిపోయినప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టడానికి అవకాశం లేని సమయాల్లో బ్యాటరీ సేవర్ మోడ్ బాగా ఉపయోగపడుతుంది.

3. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ మళ్లీ మళ్లీ చేయాల్సిన అవరసరం లేకుండా.. ముఖ్యమైన పనులకు మాత్రమే ఫోన్ వాడాలనుకుంటే.. బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయడమే మంచిది.

బ్యాటరీ సేవర్ మోడ్ మీ ఫోన్ జీవితకాలం మెరుగుపడేలా చేస్తుంది. అయితే ఇది అన్ని సమయాల్లో వాడటం మంచిదికాదు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్​లో ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బ్యాటరీ సేవర్ మోడ్​ వాడుకోవాలి. ఫోన్ పనితీరు బాగా ఉంటే, ఈ బ్యాటరీ సేవర్ మోడ్ ఆఫ్ చేసుకోవడమే మంచిది.

కెమెరామెన్​ ఆదిత్యతో సూర్య!- సూపర్ ఫొటోస్​ చూశారా?

జియో e-సిమ్​తో బోట్ స్మార్ట్​వాచ్ - ఇక మొబైల్​తో పనే లేదు! ధర ఎంతంటే?

Last Updated : Dec 9, 2023, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.