ETV Bharat / science-and-technology

అమెరికా రోడ్లపై రోబో టాక్సీలు.. డ్రైవర్ లేకుండానే రయ్​రయ్.. గంటకు 88కి.మీ వేగంతో! - వేమో కంపెనీలు తయారు చేసిన రోబో కార్లు

సాధారణంగా డ్రైవర్‌ లేనిదే వాహనం ముందుకు సాగదు. ఇక రద్దీ ప్రాంతాలు, ఇరుకు రోడ్లలో ప్రయాణం చేయాలంటే చోదకుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిందే. అలాంటిది డ్రైవర్‌ లేకుండా టాక్సీ రయ్‌మని దూసుకెళ్తే, ఒకరి మీద ఆధారపడకుండా దానంతట అదే కారు దూసుకుపోతుంటే భలే ఉంటుంది కదూ. ఆ కలను సాకారం చేస్తోంది డ్రైవర్‌రహిత టాక్సీ కారు. ఈ కార్లు డ్రైవర్ అవసరం లేకుండానే ఎలాంటి రోడ్లపైనైనా ప్రయాణిస్తాయి. వీటి సంగతి ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

cruise vs waymo vs tesla robocars on america roads
అమెరికా రోడ్లపై రోబో కార్లు
author img

By

Published : Apr 6, 2023, 6:11 PM IST

డ్రైవర్ లేని రోబోటిక్ కార్లు అమెరికా వీధుల్లో రయ్‌మని దూసుకెళ్తున్నాయి. డ్రైవింగ్ సీటులో వ్యక్తి లేకుండానే.. అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో 2 కంపెనీలకు చెందిన కార్లు టాక్సీ సేవలు అందిస్తున్నాయి. జనరల్‌ మోటార్స్‌కు చెందిన "క్రూయిజ్‌".. గూగుల్‌కు చెందిన "వేమో" కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటరీ ఆమోదం కోసం వేచిచూస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంస్థలు రెగ్యులేటరీ ఆమోదం పొందితే శాన్‌ఫ్రాన్సిస్కో నగర ప్రజలు డ్రైవర్‌ లేని కార్లలో తమ ప్రయాణాలను సాగించే అవకాశం ఉంది. గతేడాది జూన్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని తక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో క్రూయిజ్ సంస్థ ప్రయాణికులకు తక్కువ ధరకే సర్వీసులను అందిస్తోంది. మరోవైపు నగరంలోని విశాలమైన రోడ్లపై వేమో సంస్థ ఉచితంగా సేవలు అందిస్తోంది. ఈ వేమో రోబోటిక్ కార్ల తయారీ కోసం గూగుల్ సంస్థ గత 14 ఏళ్లుగా కృషి చేస్తోంది.

శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో తమ రోబోటిక్ వాహనాలను గంటకు 40 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వేగంతో పరీక్షించడానికి అనుమతి కోసం ఇటీవల క్రూయిజ్ సంస్థ దరఖాస్తు చేసింది. అమెరికాలోనే రెండో అతిపెద్ద నగరమైన లాస్‌ఏంజెల్స్‌లో డ్రైవర్‌లెస్ వాహనాలను వేమో సంస్థ పరీక్షిస్తోంది. తాము ఇంకా ఈ వాహనాల పనితీరుపై పనిచేయాల్సి ఉందని క్రూయిజ్ సంస్థ సీఈఓ తెలిపారు. కాలానుగుణంగా ఈ కార్ల పనితీరు మెరుగవుతుందని ప్రయాణికుల భద్రత కూడా పెరుగుతుందని వెల్లడించారు. ఫీనిక్స్ నగరంలో తాము నడిపిన డ్రైవర్‌ లెస్‌ కార్ల అనుభవంతో మరింత మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వేమో సంస్థ తెలిపింది. రోడ్లపై ట్రాఫిక్‌ను తీవ్రంగా పరిగణిస్తామని అదే సమయంలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. యాక్సిడెంట్లు లేకుండా 16 లక్షల కిలోమీటర్లకు పైగా ఈ డ్రైవర్‌ లెస్‌ కార్లు నడిచాయని క్రూయిజ్, వేమో సంస్థలు ఇటీవల ప్రకటించాయి.

cruise vs waymo vs tesla robocars on america roads
రోబో కార్లు

ఐతే క్రూయిజ్, వేమో సంస్థల రోబో కార్లపై శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. రద్దీ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈ డ్రైవర్‌ లేని కార్లు నిలిచిపోతున్నాయని పలువురు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అత్యవసర వాహనాలకు కూడా దారి ఇవ్వడం లేదని ఫిర్యాదులు అందాయి. అనవసరంగా వాహనాలు నిలిచిపోవడం అనేది పెద్ద సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణంలో ఈ రోబో టాక్సీలు ఏ విధంగా పనిచేస్తాయో ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు.

క్రూయిజ్, వేమోతో పాటు పదుల సంఖ్యలో కంపెనీలు 100 బిలియన్ డాలర్ల మార్కెట్‌తో ఈ డ్రైవర్‌రహిత కార్ల తయారీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తక్కువ ధరకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించి డబ్బు సంపాదించాలన్నదే ఈ రోబోటిక్ కార్ల తయారీదారుల అంతిమ లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్ లెస్ కార్లు నడుపుతున్న టెస్లా సంస్థ నాలుగేళ్లుగా పెట్టిన పెట్టుబడులు, సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లు ఇంకా అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోవడాన్ని ఈ సంస్థలు గమనిస్తున్నట్లు విశ్లేషకులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.