Comparison Of All 199 Prepaid Plans : బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా అనే ఈ నాలుగు భారతీయ టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారులకు విభిన్నమైన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. మొబైల్ రీఛార్జ్‌ల కోసం ఒకేసారి రూ.200 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే వినియోగదారులకు రూ.199 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ధర ఒక్కటే అయినప్పటికీ.. ఈ నాలుగు టెల్కోలు అందిస్తున్న బెనిఫిట్స్ భిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL 199 Plan Details :
BSNL రూ.199 ప్లాన్ 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, రోజుకు 2GB డేటా చొప్పున అందిస్తుంది. అంటే ఈ ప్లాన్‌తో మొత్తంగా 60GB డేటా పొందవచ్చు. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) ప్రకారం, 2జీబీ డేటా అయిపోయిన తరువాత, 40 Kbps స్పీడ్‌తో వినియోగదారులు డేటాను వాడుకోవచ్చు.
Airtel 199 Plan Details :
భారతీ ఎయిర్‌టెల్ తన రూ.199 ప్లాన్‌ను 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ ప్లాన్‌తో కస్టమర్లు 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 SMSలను పొందుతారు. వీటితో పాటు వింక్ మ్యూజిక్, హలోట్యూన్స్‌ను కూడా ఉచితంగా లభిస్తాయి. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో రూ. 5 విలువైన టాక్‌టైమ్‌ను కూడా అదనంగా అందిస్తుంది.
Vi 199 Plan Details :
వొడాఫోన్ ఐడియా (Vi) రూ.199 ప్లాన్ 18 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో ప్రతి రోజు 1GB డేటా చొప్పున మొత్తంగా 18 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనితోపాటు Vi మూవీస్ & టీవీ బేసిక్ కూడా ఆస్వాదించవచ్చు. FUP ప్రకారం, నిర్ణీత డేటా పూర్తయిన తర్వాత నెట్ స్పీడ్ 64 Kbpsకు పడిపోతుంది. ఈ వీఐ ప్లాన్‌లో.. డేటా ప్రయోజనాలతో పాటు, వినియోగదారులు ప్రతిరోజు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMSలు పొందుతారు.
Reliance Jio 199 Plan Details :
రిలయన్స్ జియో కూడా రూ.199 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ 23 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1.55 GB చొప్పున లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా.. అపరిమిత వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ.. రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌తో సహా జియో యాప్‌లు అన్నీ వినియోగించుకోవచ్చు. FUP నియమం ప్రకారం, నిర్దేశిత డేటా వినియోగించిన తర్వాత.. ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు తగ్గిపోతుంది.
ఫేక్ వెబ్‌సైట్స్‌ను గుర్తించాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!
మంచి వాటర్ హీటర్ కొనాలా? తక్కువ బడ్జెట్లోని టాప్-10 ఆప్షన్స్ ఇవే!