ETV Bharat / science-and-technology

Will Chandrayaan 3 Wake Up : జాబిల్లిపై సూర్యోదయం.. చంద్రయాన్-3 మళ్లీ పనిచేస్తుందా? నిద్రలేస్తే ఏం చేస్తారు? - చంద్రయాన్ 3 ల్యాండర్ రోవర్ స్లీప్ మోడ్

Will Chandrayaan 3 Wake Up : చంద్రుడిపై 14 రోజుల పాటు కీలక పరిశోధనలు నిర్వహించి స్లీప్ మోడ్​లోకి వెళ్లిన ల్యాండర్, రోవర్​ తిరిగి నిద్రలేస్తాయా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. మైనస్ 250 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకొని నిలబడగలిగితే.. చంద్రుడిపై సూర్యోదయం తర్వాత కూడా అవి తిరిగి పనిచేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

will-chandrayaan-3-wake-up
will-chandrayaan-3-wake-up
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 3:56 PM IST

Will Chandrayaan 3 Wake Up : జాబిల్లిపై రాత్రి సమయం ముగుస్తున్న నేపథ్యంలో చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ నిద్రాణం నుంచి బయటకు రావడంపై చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం స్లీప్ మోడ్​లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్.. శుక్రవారం (సెప్టెంబర్ 22న) నిద్రలో నుంచి ( Chandrayaan 3 Update Today ) బయటకు వచ్చే అవకాశం ఉంది. చంద్రుడిపై సురక్షితంగా దిగిన చంద్రయాన్-3.. సూర్యరశ్మి ఉన్న 14 రోజుల పాటు విజయవంతంగా వివిధ పరీక్షలు నిర్వహించింది. అనంతరం నిద్రలోకి జారుకుంది. ఈ నేపథ్యంలో సూర్యోదయం తర్వాత ల్యాండర్, రోవర్​ తిరిగి పనిచేస్తాయా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

"చంద్రయాన్-3ని 14 రోజుల పాటు పనిచేసేలా డిజైన్ చేశారు. దాని జీవితకాలం 14 రోజులు మాత్రమే. రాత్రి పూట చంద్రుడిపై ఉష్ణోగ్రతలు మైనస్ 250 డిగ్రీలకు పడిపోతాయి. ఆ ఉష్ణోగ్రతల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయడం చాలా కష్టం. కాబట్టి 14 రోజుల తర్వాత చంద్రయాన్-3 పనిచేయదని అనుకుంటున్నాం. కానీ, కొంతమంది శాస్త్రవేత్తలు.. అది తిరిగి పనిచేస్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది నిజంగా పనిచేస్తే వరమనే చెప్పాలి."
-సువేందు పట్నాయక్, భువనేశ్వర్​కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త

నిద్రలేస్తే.. మళ్లీ ఆ ప్రయోగాలు..
చంద్రయాన్-3 పనిచేసిన 14 రోజుల సమయంలో పరీక్షలకు సంబంధించి పూర్తి డేటాను పంపించిందని సువేందు పట్నాయక్ తెలిపారు. పరికరాలు తిరిగి పనిచేస్తే.. ఇదివరకు చేసిన ప్రయోగాలనే మళ్లీ నిర్వహిస్తామని చెప్పారు.

  • Chandrayaan-3 Mission:
    🔍What's new here?

    Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM

    — ISRO (@isro) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'తమ విధి నిర్వర్తించాయి'
చంద్రయాన్-3లోని పరికరాలు తిరిగి పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చని ఖగోళ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్​సీ కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, పరికరాలు పనిచేస్తాయన్న ఆశ ఇప్పటికీ ఉందని చెప్పారు. 'మనకు శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. రోవర్, ల్యాండర్ ఉన్న ప్రాంతంలో సూర్యుడు ఇప్పటికే ఉదయించాడు. సౌరశక్తిని గ్రహించే ప్యానళ్లు సూర్యోదయం జరిగే వైపే ఉండేలా రోవర్​ను నిలిపి ఉంచారు. ఇప్పటికే, ల్యాండర్, రోవర్​ తమ బాధ్యతను నిర్వర్తించాయి. పరికరాలన్నీ సరిగ్గానే పనిచేశాయి. ఇస్రో వద్ద ఇప్పటికే భారీగా డేటా ఉంది' అని కపూర్ వివరించారు.

  • #WATCH | Bengaluru: On Vikram lander and Pragyan rover to wake up soon on Chandrayaan-3 Mission on Moon, Astronomer, Professor, Dr RC Kapoor says, "The rover and lander have done their bit. Their instruments have functioned properly and correctly. ISRO is already sitting on a… pic.twitter.com/Wx7lrXkOXg

    — ANI (@ANI) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. తద్వారా దక్షిణ ధ్రువం వద్ద దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ల్యాండింగ్ అనంతరం విక్రమ్​లో నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి 14 రోజుల పాటు వివిధ ప్రయోగాలు చేసింది. చంద్రుడిపై సల్ఫర్ ఆనవాళ్లను గుర్తించింది. చంద్రుడిపై ఉష్ణోగ్రతలను నమోదు చేసింది.

ISRO Chairman on Shivashakti Point : 'చంద్రుడి అద్భుతమైన ఫొటోలు మా వద్ద ఉన్నాయి'.. శివశక్తి పేరుపై ఇస్రో చీఫ్‌ క్లారిటీ

Chandrayaan 3 Soft Landing Again : ఈసారి మనుషులతో 'చంద్రయాన్​'.. ఇస్రో విక్రమ్ 'రిటర్న్' జర్నీ సక్సెస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.