ETV Bharat / science-and-technology

Best Smartphone Cleaning Tips : ఈ బెస్ట్ స్మార్ట్​ఫోన్ క్లీనింగ్ టిప్స్ ఫాలో అవ్వండి.. స్క్రీన్, కెమెరా, స్పీకర్ దెబ్బతినకుండా చూసుకోండి.! - సింపుల్​గా మీ స్మార్ట్​ఫోన్ క్లీన్ చేసుకునే విధానం

Best Smartphone Cleaning Tips : మీరు వాడే స్మార్ట్​ఫోన్​ను వారానికి ఓసారి అయినా క్లీన్ చేసుకుంటున్నారా? లేదా? అయితే ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. కొంతమంది ఫోన్​ను శుభ్రం చేసుకున్నా ఎలా పడితే అలా క్లాత్​తో తుడవడం ద్వారా తొందరగా ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి మేము చెప్పే ఈ టిప్స్​తో చాలా సింపుల్​గా మీ ఫోన్​ క్లీన్ చేసుకుని దాని మన్నికను పెంచుకోండి.

Smartphone
Smartphone
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 3:36 PM IST

Best Smartphone Cleaning Tips : నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి జీవనంలో స్మార్ట్​ఫోన్ ఓ భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని వాడుతున్నారు. అయితే ప్రస్తుత బిజీ లైఫ్​లో చాలా మంది స్మార్ట్​ఫోన్(SmartPhones)​లను నిరంతరాయంగా ఉపయోగిస్తుంటారు. కానీ వాటిని రెగ్యులర్​గా క్లీన్ చేయడంలో అశ్రద్ధ వహిస్తుంటారు. దాంతో ఫోన్​లో ఉండే స్పీకర్ నుంచి ఛార్జింగ్ పోర్ట్ వరకు విపరీతంగా దుమ్ము, ధూళి, ఇతర మలినాలు పేరుకుపోతాయి. ముఖ్యంగా స్పీకర్​లో బ్యాక్టీరియా, క్రీములు భారీ మొత్తంలో పేరుకుపోవడం వల్ల మీ మొబైల్ స్పీకర్​ త్వరగా పాడైపోతుంది. అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు మీ వాయిస్ సరిగ్గా వినపడకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

How to Clean Smartphone Screen in Telugu : అయితే మీ స్మార్ట్​ఫోన్​ను రెగ్యులర్​గా క్లీన్ చేసుకోవడం ద్వారా అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. చాలా మంది ఇది పెద్ద ప్రాసెస్​గా భావిస్తారు. అదేమి లేదు ఈజీగా స్మార్ట్​ఫోన్​ను శుభ్రం చేసుకునే కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటి ద్వారా చాలా సులువుగా తక్కువ సమయంలో ఫోన్​ను శుభ్రపర్చుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Mobile Cleaning Tips in Telugu : మీ స్మార్ట్​ఫోన్ ఇయర్ స్పీకర్‌ను శుభ్రం చేయడానికి ఆల్కహాల్‌లో ముంచిన మైక్రోఫైబర్ క్లాత్‌తో స్పీకర్‌ను జాగ్రత్తగా తుడవండి. ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే వరకు జాగ్రత్తగా, సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా ఏదైనా దుమ్ము ఉంటే దానిని తీయడానికి ఓపెనింగ్‌ వద్ద మెల్లగా ఊదండి. ఆపై ఆ ప్రాంతాన్ని మళ్లీ తుడవండి. ఇలా కాకుండా మీరు మీ ఫోన్ స్పీక్​ర్​ను కింద పేర్కొన్న విధంగానూ సింపుల్​గా క్లీన్ చేసుకోవచ్చు. అయితే దీనికి డిష్ వాషింగ్ ద్రవం, మృదువైన బ్రిస్టల్ టూత్ బ్రష్, వాడిన టూత్ బ్రష్ లాంటివి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా స్మార్ట్​ఫోన్ స్పీకర్​ క్లీన్ చేసుకోవాలో చూద్దాం..

How to buy Second Hand Phone Legally? : సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా.. ఈ విషయం తెలుసా..?!

How to Clean Smartphone Speaker in Telugu :

  • మొదట మీరు ఫోన్ స్పీకర్ శుభ్రపరిచే ముందు మీ చేతులను హ్యాండ్ వాష్​తో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత టవల్​తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆపై మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి.
  • ముందుగా మీరు మీ ఫోన్​ను స్విచ్ ఆఫ్ చేయాలి. ఎప్పుడు ఫోన్ ఆన్​లో ఉన్నప్పుడు దానిని క్లీన్ చేయకపోవడం మంచిది. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాక ప్రాసెస్ స్టార్ట్ చేయండి.
  • ఇప్పుడు మీరు వాడిన లేదా కొత్త టూత్ బ్రష్ తీసుకోండి. చిన్నగా ఉండే బ్రష్(ప్లిలల టూత్​ బ్రష్) తీసుకుంటే క్లీన్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది.
  • మీ ఫోన్ స్పీకర్ పోర్ట్‌ను గుర్తించి ఆ ప్రాంతంలో మీరు ఎంచుకున్న టూత్​ బ్రష్​తో ఎక్కువ బలవంతంగా రుద్దకుండా సున్నితంగా స్క్రబ్ చేయండి. అన్ని ధూళి కణాలు పూర్తిగా క్లియర్ అయ్యే వరకు పోర్ట్ ప్రాంతాన్ని బ్రష్ చేయండి.
  • అన్ని మలినాలు తొలగిపోయాయని చెక్ చెసుకున్న తర్వాత ఓసారి మీ ఫోన్​ను సున్నితంగా కదిలించండి. అలా చేయడం ద్వారా ఇంకా ఏదైనా దుమ్ము, ధూళి మిగిలిపోతే దానిని తొలగించవచ్చు. ఇది తప్పనిసరిగా చేయాలి.
  • పైన పేర్కొన్న విధంగా క్లీన్ చేశాక మీరు చేయాల్సిన తదుపరి పని ఫోన్​ను శుభ్రంగా క్లాత్​తో తుడవడం. దాని ద్వారా ఫోన్ గ్లాస్ మీద ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుంది.
  • అయితే దానికిముందు ఒక చుక్క డిష్​వాషింగ్​ లిక్విడ్​ని నీటితో కలిపి మీరు వాడే క్లాత్​ను అందులో ముంచి వాటర్ లేకుండా దానిని పిండి ఆపై ఫోన్​ను శుభ్రంగా తుడవాలి. డిష్​వాషింగ్ లిక్విడ్ మలినాలను పూర్తిగా తొలగిస్తుంది.
  • ఇలా మీ ఫోన్​ను తుడిచాక ఆపై మెత్తటి పొడి క్లాత్​తో తడి క్లాత్​తో తుడిచిన ప్రాంతంలో క్లీన్​గా మరోసారి తుడవాలి. అలా చేయడం ద్వారా ఇంకా ఏదైనా డస్ట్ ఉంటే క్లియర్ అవుతుంది.
  • అలాగే మీ స్మార్ట్​ఫోన్​కు ఉండే హెడ్​ఫోన్ జాక్​ని క్లీన్ చేసుకోవాలి. ఒక సన్నని కాటన్ బడ్​ని తీసుకొని జాక్​ హోల్ లోపలకి పెట్టి ప్రతివైపు కిందికి పైకి తిప్పాలి. అలాగే దానిని బయటకు తీసేటప్పుడు తిప్పుతూ తీయండి. మొత్తం మలినాలు పోయేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగించండి.
  • మీ ఫోన్ స్పీకర్ ఉపరితలాన్ని క్లీన్​ చేసేటప్పుడు మెత్తటి వస్త్రాన్ని ఉపయోగించి శుభ్రపరచడం అలవాటు చేసుకోండి. అలాగే, స్పీకర్‌ను దుమ్ము ధూళి నుంచి రక్షించడానికి రూపొందించబడిన నాణ్యమైన ఫోన్ కేస్‌ను కొనుగోలు చేయండి.
  • ఇలా సింపుల్​గా పైన పేర్కొన్న విధంగా ప్రతి వారం లేదా నెలవారీగా మీ ఫోన్​ను శుభ్రం చేసుకోవడం ద్వారా స్పీకర్​, హెడ్​ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్ట్, ఫోన్ స్క్రీన్, కెమెరా(Camera) లాంటివి కొత్తగా ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

Amazon Great Indian Festival 2023 : స్మార్ట్​ఫోన్స్​పై 49%, ల్యాప్​టాప్స్​పై 45% వరకు డిస్కౌంట్​.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ కిరాక్​ డీల్స్​​!

How to Activate DND in Mobile Networks : స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా..? వాటి నోరు మూసేయండిలా!

What Not to Do on Your Office Computer : ఆఫీస్​ ఫోన్​, కంప్యూటర్ వాడుతున్నారా?.. ఈ పనులు అస్సలు చేయకండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.