Best Camera Phones Under 30000 : సోషల్ మీడియా మానియా నడుస్తున్న నేటి కాలంలో ప్రతి ఒక్కరూ మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆశిస్తున్నారు. అందుకే వీరిని దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు అన్నీ హై-రిజల్యూషన్‌తో, సూపర్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీయగలిగే కెమెరా ఫోన్లను తయారు చేస్తున్నాయి. సాధారణ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు మాత్రమే కాదు, ప్రొఫెషనల్ కెమెరామ్యాన్లకు కూడా ఉపయోగపడే రీతిలో వీటిని రూపొందిస్తున్నాయి. కొన్ని ఫోన్లు అయితే ఏకంగా మూవీ కూడా తీయగలిగే సూపర్ కెమెరాలతో వస్తున్నాయి. అందుకే ప్రస్తుతం మార్కెట్లో రూ.30,000 బడ్జెట్లో లభిస్తున్న టాప్-5 కెమెరా ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Samsung Galaxy F54 5G Features : ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్లో 108 MP సామర్థ్యంగల పవర్ఫుల్ కెమెరా ఉంది. ఈ కెమెరాలో ఇన్-బిల్ట్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. కనుక మంచి క్వాలిటీ ఫొటోస్, వీడియోస్ దీని ద్వారా తీసుకోవచ్చు. అదే విధంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP ఆల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. వీటిలోపాటు 32 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ లవర్స్‌కు ఇది ఎంతో బాగా నచ్చుతుంది.
Samsung Galaxy Nightography : ఈ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లో నైటోగ్రఫీ ఫీచర్ ఉంది. అందుకే దీనితో చాలా తక్కువ వెలుతురులోనూ, మంచి క్వాలిటీ చిత్రాలను తీయవచ్చు. అంతేకాదు దీనిలో నోనా-బైనింగ్ టెక్నాలజీని కూడా వాడారు. ఇది లైటింగ్‌ను మరింత ఎన్హాన్స్ చేస్తుంది. ఈ గెలాక్సీ ఫోన్లో నైట్ మోడ్, ఆటో నైట్ మోడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటితో చిమ్మ చీకటిలోనూ సూపర్ ఫొటోలు తీయవచ్చు. శాంసంగ్ ఈ గెలాక్సీ ఫోన్లో ఏఐ బేస్డ్ మల్టీ-ఫ్రేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని కూడా పొందుపరిచింది. దీనిని ఉపయోగించి ఒకేసారి 12 ఫ్రేమ్‌లను క్యాప్చర్ చేయవచ్చు. అంటే ప్రొఫెషనల్ లెవల్లో హై-క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
స్టెబిలైజేషన్ : ఈ శాంసంగ్ ఫోన్లో డ్యూయెల్-ట్రాక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ ఉంది. దీనిలోని OIS హార్డ్‌వేర్ 1.5 డిగ్రీ యాంగిల్ కరెక్షన్ చేస్తుంది. కనుక ఎలాంటి షేక్‌లు లేకుండా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ గెలాక్సీ ఫోన్లో VDIS సాఫ్ట్వేర్ కూడా ఉంది. దీనిని ఉపయోగించి, ఎలాంటి షేక్స్ లేకుండా వీడియో తీసుకోవచ్చు, అలాగే సరిచేసుకోవచ్చు.
టైమ్ లాప్స్ : ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లో ఆస్ట్రోల్యాప్స్ ఫీచర్ ఉంది. దీనిని ఉపయోగించి మీరు టైమ్-ల్యాప్స్ వీడియోను తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్స్‌కు, ట్రావెలర్స్‌కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ ఫోన్‌తో సింగిల్ టేక్‌లో మల్టిపుల్ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఫన్మోడ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ శాంసంగ్ ఫోన్‌తో చిన్నపాటి సినిమా తీసేయవచ్చు.
2. OnePlus Nord 2T 5G Features : ఈ వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ ఉంది. ఈ ప్రైమరీ కెమెరాతో స్టన్నింగ్ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అలాగే దీనిలో 8 మెగా పిక్సెల్ ఆల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంది. వీటితోపాటు రెండు 2-మెగా పిక్సెల్ సెన్సార్స్ కూడా ఉన్నాయి.
ఈ వన్‌ప్లస్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌తో వస్తుంది. కనుక ఎలాంటి షేక్‌లు లేకుండా మంచి క్లారిటీతో, హై-రిజల్యూషన్ ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు.
3. IQOO Neo6 5G Features : ఈ ఐకూ నియో6 ఫోన్లో ఆప్టికల్ స్టెబిలైజేషన్‌తో హై-రిజల్యూషన్ ప్రైమరీ కెమెరా ఉంది. దీనితోపాటు 8 MP ఆల్ట్రావైడ్ కెమెరా, 2MP మైక్రో రియర్ కెమెరాలు కూడా ఉన్నాయి.
ఈ ఐకూ నియో6లోని ప్రైమరీ కెమెరా అనేది 0.8 మైక్రోమీటర్స్ పిక్సెల్, 64MP శాంసంగ్ (S5K) GW1 1/1.72 సెన్సార్, 25 mm f/1.9 లెన్స్‌తో జతకలిసిన టెట్రాపిక్సెల్ ఫిల్టర్ కలిగి ఉంది. కనుక ఈ కెమెరాతో హై-క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
4. Redmi Note 12 Pro Plus 5G Features : రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్లో 200MP శాంసంగ్ HPX కెమెరా ఉంది. దీనితో పాటు ఈ ఫోన్లో 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ కూడా ఉంది. ఈ కెమెరాలు అన్నీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కలిగి ఉన్నాయి. అంతేకాదు ఈ ఫోన్‌తో 4k వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు.
ఈ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీనితో కూడా మంచి క్వాలిటీ ఇమేజ్‌లను తీసుకోవచ్చు. కనుక సెల్ఫీ లవర్స్ అందరికీ ఇది ఎంతో నచ్చుతుంది.
5. POCO F5 5G Features : ఈ పోకో ఎఫ్5 5జీ ఫోన్లో వెర్సటైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముఖ్యంగా 64MP ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రావేడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఇందులో ఉన్నాయి. వెలుతురుతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఈ ఫోన్‌తో స్టన్నింగ్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు.

ఈ పోకో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌లో '2x లాస్‌లెస్ ఇన్-సెన్సార్ జూమ్' ఫీచర్ ఉంది. ఇది పిక్చర్ క్వాలిటీని బాగా పెంచుతుంది. అంతేకాదు ఈ ఫోన్లో 7 రకాల మోడ్స్‌తో ఫిల్మ్ కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ పోకో ఫోన్లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీనితో కూడా మంచి ఫొటోలు తీసుకోవచ్చు. కానీ వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు దీని పనితీరు సాధారణంగా ఉంటుంది. మంచి లైటింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

మంచి స్మార్ట్‌వాచ్ కొనాలా? మార్కెట్లోని టాప్-10 ఆప్షన్స్ ఇవే!
గూగుల్ మ్యాప్స్ Fuel Saving ఫీచర్ - ఇంధనం, డబ్బు రెండూ ఆదా!