ETV Bharat / science-and-technology

Aditya L1 Mission Successful : 'మానవాళి సంక్షేమం కోసమే ఆదిత్య-ఎల్​1'.. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న వ్యోమనౌక - aditya l1 elliptical orbit

Aditya L1 Mission Successful Launch : వెలుగులు విరాజిల్లుతున్న సూర్యుడి గుట్టు విప్పేందుకు చేపట్టిన ఆదిత్య-ఎల్​1 ప్రయోగం విజయవంతమైంది. ప్రస్తుతం లగ్రాంజ్​ పాయింట్​ దిశగా వ్యోమనౌక పయనిస్తోందని ఇస్రో తెలిపింది. ఆదిత్య-ఎల్​1 విజయవంతమైన సందర్భంగా ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టారని మోదీ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు కాంగ్రెస్​ కూడా అభినందనలు తెలిపింది.

Aditya L1 Mission Successful Launch
Aditya L1 Mission Successful Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 4:59 PM IST

Aditya L1 Mission Successful Launch : చంద్రయాన్​-3 విజయం స్ఫూర్తితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో మరో ముందడుగు వేసింది. సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య-ఎల్1 రాకెట్​ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు (aditya l1 launch date and time) ఆదిత్య-ఎల్‌ 1ను శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్​ఎల్​వీ-సీ57 వాహకనౌక నింగిలోకి దూసుకుపోయింది.

  • Aditya-L1 started generating the power.
    The solar panels are deployed.

    The first EarthBound firing to raise the orbit is scheduled for September 3, 2023, around 11:45 Hrs. IST pic.twitter.com/AObqoCUE8I

    — ISRO (@isro) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పీఎస్​ఎల్​వీ-సీ57 రాకెట్ (aditya-l1 mission launch vehicle)​.. ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. వ్యోమనౌకకు అమర్చిన సోలార్​ ప్యానెల్స్​ పవర్​ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టినట్లు తెలిపింది. తొలి కక్ష్య పెంపు ప్రక్రియను ఆదివారం (సెప్టెంబర్​ 3) ఉదయం 11.45 గంటలకు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆదిత్య-ఎల్​1 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్​.సోమ్​నాథ్​ మాట్లాడారు. నిర్దేశించిన కక్ష్యలో వ్యోమనౌకను పీఎస్​ఎల్​వీ రాకఎట్ ప్రవేశపెట్టిందని తెలిపారు.

  • #WATCH | On the successful launch of Aditya L-1, ISRO Chairman S Somanath says, "The Aditya L1 spacecraft has been injected in an elliptical orbit...which is intended very precisely by the PSLV. I want to congratulate the PSLV for such a different mission approach today to put… pic.twitter.com/ZGT8vGt9EI

    — ANI (@ANI) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆదిత్య-ఎల్‌1 అంతరిక్ష నౌకను దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాం. పీఎస్‌ఎల్‌వీ తదుపరి చర్యల్లో భాగంగా తొలిసారి "టూ బర్న్ సీక్వెన్స్‌" వినియోగించి నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపాం. ఆదిత్య ఎల్‌1ను సరైన కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు పనిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. కొన్ని ప్రక్రియల తర్వాత ఆదిత్య ఎల్‌1 తన ప్రయాణాన్ని సూర్యుడి దిశగా కొనసాగిస్తుంది. ఎల్1 పాయింట్ దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది సుదూర ప్రయాణం. దాదాపు 125 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్‌1 అంతరిక్ష నౌక ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం."
--ఎస్‌.సోమ్‌నాథ్‌, ఇస్రో ఛైర్మన్‌

ఈ మిషన్​ విజయంతో ఒక కల సాకారం అయిందని ఆదిత్య-ఎల్1 ప్రాజెక్టు డైరెక్టర్ నిగర్ శాజీ ( Aditya L1 Launch Mission Director Name ) తెలిపారు. 'ఆదిత్య-ఎల్1ను.. వాహకనౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వ్యోమనౌక 125 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. భారత్​కు, ప్రపంచ వైజ్ఞానిక వర్గానికి ఈ మిషన్ ఒక ఆస్తి అవుతుంది. ఈ మిషన్​ సాకారం అయ్యేలా చేసిందుకు శాస్త్రవేత్తల బృందానికి ధన్యవాదాలు' అని అన్నారు.

  • #WATCH | On the successful launch of Aditya L-1, Project Director of Aditya L-1, Nigar Shaji says, "This is like a dream come true. I am extremely happy that Aditya L-1 has been injected by PSLV. Aditya L-1 has started its 125 days of long journey. Once Aditya L-1 is… pic.twitter.com/zs1avDJ9ba

ఈ ప్రయోగం చేసింది అందుకే : ప్రధాని మోదీ
ఆదిత్య ఎల్‌-1ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇస్రోకు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమ కోసం విశ్వాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి కొనసాగుతోందని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా ఇస్రోకు అభినందనలు తెలిపారు.

దేశం గర్విస్తోంది : అమిత్​ షా
'భారత్​ మొదటిసారిగా సోలార్​ మిషన్​ ఆదిత్య-ఎల్1ను విజయవతంగా ప్రయోగించినందుకు దేశం గర్విస్తోంది. సంతోషిస్తోంది. శాస్త్రవేత్తలు మరోసారి తమ శక్తి, మేధస్సును నిరూపించుకున్నారు. అసామాన్యమైన విజయాన్ని సాధించినందుకు ఇస్రో టీమ్​కు నా అభినందనలు. అమృతకాలంలో అంతరిక్ష రంగంలో ప్రధాని ఆత్మనిర్భర్​ భారత్ విజన్​ను నెరవేర్చడానికి ఇది పెద్ద ముందడుగు' అని సోషల్​ మీడియా వేదికగా కేంద్ర హో మంత్రి అమిత్​ షా తెలిపారు.

  • Time and again our scientists have proved their might and brilliance. The nation is proud and delighted over the successful launch of Aditya L1, India's first solar mission.

    Kudos to the team @isro for this unparalleled accomplishment. It is a giant stride towards fulfilling PM… pic.twitter.com/XEacBvLxoj

    — Amit Shah (@AmitShah) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇస్రోకు మరో సెల్యూట్​ : కాంగ్రెస్
ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంపై పట్ల కాంగ్రెస్ సంతోషం వ్యక్తంచేసింది. మరో అద్భుతమైన ఘనతను ఇస్రో సాధించిందని పేర్కొంది. ఇస్రోకు మరోసారి సెల్యూట్‌ చేస్తున్నట్లు పేర్కొన్న కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. ఆదిత్య మిషన్‌కు సంబంధించి ఇస్రో టైమ్‌లైన్‌ను పోస్ట్ చేశారు. దేశ శాస్త్రీయ పురోగతి కేవలం కొన్ని సంవత్సరాల్లోనే సాధ్యపడిందికాదని.. దశాబ్దాలుగా అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

అదే జరిగితే.. మూడో దేశంగా భారత్​!
ఈ ఆదిత్య-ఎల్​1 మిషన్​ విజయవంతం కావడాన్ని నిపుణులు ప్రశంసించారు. భారత్​ సౌర పరిశోధనలు మొదలుపెట్టిందని పేర్కొన్న నిపుణులు.. సూర్యుడి గురించి కీలక వివరాలు.. భూమిపై వాటి ప్రభావాలను ఈ మిషన్ ద్వారా తెలిసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక లగ్రాంజ్​ పాయింట్​-ఎల్​1కు (Lagrange Point 1) చేరుకుంటే.. నాసా, యూరోపియన్ స్పేస్​ ఏజెన్సీ తర్వాత ఆ పాయింట్​లో సోలార్​ అబ్జర్వేటరీ ఏర్పాటు చేసిన మూడో అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరిస్తుందని కోల్​కతా.. IISERలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా చీఫ్​ దిబ్యేందు నంది అన్నారు.

Aditya L1 Launch : నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్​1'.. సూర్యుడిని నిమిషానికోసారి క్లిక్‌!

Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్‌ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.