ETV Bharat / priya

మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్​లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!

Eggless Cake Recipe : మీ పిల్లలకు కేక్ అంటే చాలా ఇష్టమా? బయటకు బేకరీకి వెళ్లినప్పుడు కేక్ ఇప్పించమని మారాం చేస్తున్నారా? అయితే మీ కోసం అదిరిపోయే కేక్ రెసిపీని తీసుకొచ్చాం. పైగా ఇది ఎగ్​లెస్. వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ రెసిపీ ట్రై చేసి మీరు, మీ పిల్లలు ఆస్వాదించండి.

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 12:11 PM IST

cake
cake

Eggless Rava Cake Recipe in Telugu : మనలో చాలా మంది కేక్​ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. బేకరీల్లో మనకు రకరకాల రుచుల్లో, ఆకారాల్లో కేక్స్ లభిస్తుంటాయి. అయితే చాలా వరకు కేక్స్ ఎగ్స్​తో తయారుచేస్తుంటారు. ఇకపోతే కొన్ని రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం రాబోతుంది. ఈ టైమ్​లో స్వీట్స్​ కన్నా కేక్స్​కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే మీ కోసం తక్కువ ఖర్చులో ఇంట్లోనే చేసుకునేలా అదిరిపోయే టేస్ట్ ఇచ్చే ఎగ్​లెస్ కేక్(Cake Recipe) రెసిపీని పట్టుకొచ్చాం. దీనిని మీకు, పిల్లలకు నచ్చే విధంగా చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు.

Eggless Rava Cake Recipe Making Process : ఈ కేక్​ను వంటింట్లో ఉండే వాటితోనే తయారు చేయొచ్చు. దీనిని గోధమ పిండి, రవ్వ, పెరుగు వంటి వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిగినర్​ బేకర్ అయినా సరే.. ఇది బేకింగ్​ చేయడంలో మిమ్మల్ని అసలు ఇబ్బందే పెట్టదు. అంతేకాకుండా ఈ కేక్​ను పర్ఫెక్ట్​గా కొలవాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకీ ఈ సింపుల్ కేక్​ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలివే..

  • గోధుమ పిండి - అరకప్పు
  • రవ్వ - 1 కప్పు ( దీనిని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి)
  • పంచదార - ముప్పావు కప్పు (గ్రైండ్ చేసుకోవాలి)
  • ఆలివ్ ఆయిల్ - ముప్పావు కప్పు
  • వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్
  • ఉప్పు - చిటికెడు
  • పెరుగు - 1 కప్పు
  • పాలు - అరకప్పు
  • బేకింగ్ సోడా - అర టీస్పూన్
  • బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
  • పిస్తా - గార్నిష్ కోసం (కట్ చేసి పెట్టుకోవాలి)

పంచదార పాకం కోసం కావాల్సినవి..

  • నీరు - అరకప్పు
  • పంచదార - 2 టీస్పూన్స్
  • నిమ్మరసం - 2 టీస్పూన్స్

బేక్​ చేయకుండా కేక్​ చేసుకోండిలా...

ఎగ్​లెస్ రవ్వ కేక్ తయారీ విధానం..

  • ముందుగా మీరు ఓవెన్​ను 180 డిగ్రీల సెల్సియస్​కు 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి. ఓవెన్​ లేని వారు స్టౌ మీద అడుగు లోతుగా ఉండే ఓ మందపాటి గిన్నె తీసుకుని అందులో కొంచెం ఇసుక లేదా ఉప్పు పోసి.. ఓ చిన్న స్టాండ్​ లేదా ప్లేట్​ పెట్టుకుని 10 నిమిషాలు ప్రీ హీట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని అందులో జల్లెడ పట్టిన గోధుమ పిండి, రవ్వను పోసుకోవాలి. ఆ తర్వాత దానిలో పంచదార పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా కలపాలి.
  • ఆపై ఉప్పు, పెరుగు, వెనీలా ఎసెన్స్ వేసి ఆ మిశ్రమాన్ని బాగ్ మిక్స్ చేసుకోవాలి.
  • ముద్దలుగా లేకుండా కలిపిన తర్వాత.. ఆ మిశ్రమంలో ఆలివ్ నూనె వేసుకోవాలి. ఇది దానిని మరింత క్రీమీగా చేస్తుంది.
  • ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆ పిండిలో పాలు పోసుకోని కట్​ అండ్​ ఫోల్డ్​ విధానంలో కలుపుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మీరు కేక్ మౌల్డ్​ తీసుకుని దానికి నెయ్యి రాసుకోని.. దానిపైనా కొద్దిగా మైదాపిండి చల్లుకోవాలి.
  • ఇప్పుడు మీరు ముందుగా తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేయాలి. ఎలాంటి గ్యాప్స్ లేకుండా కేక్​ టిన్​ను మెల్లగా నేలపై టాప్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కేక్ సమానంగానూ.. మధ్యలో ఎలాంటి ​బబుల్స్​ లేకుండాను వస్తుంది.
  • ఆ తర్వాత బేకింగ్​ కోసం ముందుగా ప్రీ హీట్​ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 45 నిమిషాల పాటు కేక్​ను బేక్ చేయాలి. ఓవెన్​ లేని వారు ముందుగా ప్రీ హీట్​ చేసుకున్న గిన్నెలో పెట్టి 45 నిమిషాల పాటు సిమ్​లో పెట్టి కుక్​ చేసుకోవాలి.
  • ఈ విధంగా తయారు చేసుకున్న కేక్​ను ఓవెన్​ నుంచి తీసి.. గది ఉష్ణోగ్రతకు చల్లారనివ్వాలి.
  • ఆ తర్వాత కేక్​ను డి-మోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు చక్కెర పాకం​ కోసం.. స్టవ్ వెలిగించి ఓ గిన్నె పెట్టి దానిలో పైన పేర్కొన్న విధంగా నీరు, చక్కెర వేయాలి.
  • అది మరగడం ప్రారంభించే వరకు మీడియం మంట మీద హీట్ చేసుకొని.. తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపి స్టౌవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా సర్వింగ్​ ప్లేట్​లో ఉంచుకున్న కేక్​పై ఈ చక్కెర పాకం​ పోయాలి. కేక్​ దీనిని పీల్చుకోవడానికి కొంత సమయం పడుతుంది.
  • ఆ తర్వాత మీరు పిస్తాతో లేదా మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్​తో కేక్​ను గార్నిష్ చేసుకోవచ్చు.
  • అంతే పెద్దలకు, పిల్లలకు నచ్చే టేస్టీటేస్టీ ఎగ్​లెస్ రవ్వ కేక్ రెడీ. ఇంటిల్లీ పాది చక్కగా దీనిని ఆస్వాదించవచ్చు. చక్కెరపాకం లేకుండా కూడా దీనిని తినవచ్చు..

యమ్మీ యమ్మీగా మ్యాంగో ఛీజ్​ కేక్ చేసుకోండిలా!

కిచెన్ మైదానంలో 'కేక్‌ బాల్స్‌' చేసేద్దామా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.