ETV Bharat / priya

నోరూరించే పులావ్​- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే! - కొబ్బరిపాల పులావ్​

Pulao Making Process: మీకు పులావ్​ తినాలని ఉందా..? కానీ మీరు వెజ్​ ప్రియులా..? అయితే నో టెన్షన్​. పులావ్​ అనగానే చికెన్​, మటన్​తో చేసినవే కాదండోయ్.. వెజ్​తో కూడా రకరకాల పులావ్​లు ట్రై చేయవచ్చు.​ అందులో రెండింటిని ఈ స్టోరీలో చూద్దాం..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 5:12 PM IST

Coconut Milk Pulao Making Process: ఈ కాలంలో వెరైటీ వంటకాలు చేసుకోని తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చేసుకోవడం రాదు. పోనీ.. బయట ఏదైనా హోటల్​ నుంచి ఆర్డర్​ పెడదామంటే అదో టెన్షన్​.. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమో అని. వీటన్నింటికి చెక్​ పెడుతూ కేవలం ఇంట్లోనే అదిరిపోయే టేస్ట్​తో చేసుకోవచ్చు. మాకు అంతబాగా చేయడం రాదంటారా..? అవసరం లేదండి.. మొదటిసారి చేసేవారు కూడా పర్ఫెక్ట్​గా చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీలో ఉన్న రెసిపీలపై ఓ లుక్కేసి.. మీరూ ఇంట్లో ట్రై చేయండి..

కొబ్బరిపాల పులావ్​:

Coconut Milk Pulao: కొబ్బరిపాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి1, బి2, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే సెలెనియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి లభిస్తాయి. కొబ్బరి పాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తిని అందించడంలో ఇవి ముందుంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మరి కొబ్బరిపాల పులావ్​ రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

న్యూ ఇయర్​ స్పెషల్ రెసిపీస్ - ఈ వెరైటీస్​తో పార్టీ అద్దిరిపోద్ది!

కావలసినవి:

  • బాస్మతి బియ్యం: కప్పు (నానబెట్టుకోవాలి)
  • ఆలూ, బీన్స్‌, క్యారెట్‌, బఠాణీ: అన్నీ కలిపి ఒకటిన్నర కప్పు
  • పుదీనా తరుగు: అరకప్పు
  • కొబ్బరి తురుము: అరకప్పు
  • కారం: చెంచా
  • అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా
  • గరంమసాలా: చెంచా
  • మిరియాలపొడి: చెంచా
  • కొబ్బరిపాలు: పావుకప్పు
  • నెయ్యి: టేబుల్‌స్పూను
  • బిర్యానీఆకులు: రెండు
  • ఉప్పు: తగినంత

Pulao recipe: ఘుమఘుమలాడే 'పుట్టగొడుగుల పులావ్'

తయారీవిధానం:

  • కూరగాయ ముక్కలపైన కొబ్బరి తురుము, పుదీనా తరుగు, తగినంత ఉప్పు, కొబ్బరిపాలు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, మిరియాలపొడి వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి.
  • స్టౌమీద కుక్కర్‌ పెట్టి నెయ్యి వేయాలి.
  • అది వేడెక్కాక బిర్యానీ ఆకులు వేయించి... ముందుగా కలిపి పెట్టుకున్న కూరగాయముక్కలు వేసి అన్నింటినీ కొద్దిసేపు వేయించాలి.
  • ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి.
  • రెండు కూతలు వచ్చాక దింపేయాలి. అంతే వేడి వేడి కొబ్బరిపాల పులావ్​ రెడీ!

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

దహీ పనీర్‌ పులావ్‌

Dahi Paneer Pulao:

కావలసినవి

  • పనీర్‌ ముక్కలు: కప్పు
  • పెరుగు: పావుకప్పు
  • అల్లంవెల్లుల్లి ముద్ద: మూడు చెంచాలు
  • పసుపు: పావుచెంచా
  • ఉప్పు: తగినంత
  • బాస్మతిబియ్యం: కప్పు (నానబెట్టుకోవాలి)
  • నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు
  • దాల్చిన చెక్క: ఒక ముక్క
  • లవంగాలు: రెండు
  • యాలకులు: మూడు
  • బిర్యానీ ఆకులు: రెండు
  • జీలకర్ర: అరచెంచా
  • ఉల్లిపాయ: ఒకటి
  • టొమాటో గుజ్జు: చెంచా
  • నీళ్లు: ఒకటిన్నర కప్పు
  • కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను
  • నూనె: రెండు చెంచాలు
  • జీడిపప్పు: ఆరు

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!

తయారీవిధానం:

  • ఓ గిన్నెలో పనీర్‌ ముక్కలు, పెరుగు, రెండు చెంచాల అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, అరచెంచా ఉప్పు వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ఓ పెద్ద గిన్నె​ పెట్టి.. అందులో నెయ్యి వేసి దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, యాలకులు, జీలకర్ర వేయించి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
  • అవి కూడా ఎర్రగా వేగాక మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి.
  • ఆ తరవాత పనీర్‌ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి.
  • తర్వాత టొమాటో గుజ్జు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
  • తర్వాత కడిగిన బియ్యం వేసి బాగా కలిపి ఒకటిన్నర కప్పు నీళ్లు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి.
  • అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత దింపేయాలి.
  • ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి, జీడిపప్పు వేయించి అన్నంపైన వేసి, కొత్తిమీర అలంకరిస్తే సరిపోతుంది. వేడి.. వేడి.. టేస్టీ.. టేస్టీ పులావ్​ సిద్ధం..

How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.