ETV Bharat / priya

కార్తిక మాసం ముగిసిపోయింది - ఈ సండే మీ ఇంట్లో ఏం కూర - ఈ నాన్​వెజ్​ ట్రై చేస్తారా!

How to Make Chukkakura Chicken : కార్తికమాసం ముగిసి పోయింది.. సండే వచ్చేసింది. ఈ నెల రోజులు నాన్​వెజ్​కు దూరంగా ఉన్నవారంతా.. ఇప్పుడు ఓ పట్టు పట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. ఎప్పుడూ వండుకునేలా కాకుండా కాస్త వెరైటీగా నాన్​వెజ్​ డిషెస్ రెడీ చేసుకుంటే.. అదుర్స్ అంటూ లాగించేయొచ్చు.

How to Make Chukkakura Chicken
How to Make Chukkakura Chicken
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 8:02 PM IST

Chukkakura Chicken Making Process : కేవలం ఆకుకూరలు వండుకుని తినాలంటే కష్టం కానీ.. వాటికి సరైన నాన్‌వెజ్‌ జోడీ దొరికితే ఆహా రుచి అదిరిపోతుంది! అయితే ఆకుకూరలతో నాన్​వెజ్​ అంటే అందరికీ.. గోంగూర, మెంతికూర మాత్రమే గుర్తొస్తాయి. కానీ.. ఇంకా చాలానే ఉన్నాయి. అందులో రెండు రెసిపీలను ఇవాళ ప్రయత్నిద్దాం.

చుక్కకూర చికెన్​: నాన్ వెజ్ ప్రియులకు చికెన్ మంచి ఫేవరెట్ డిష్. ఎలా వండినా.. టేస్ట్ అదిరిపోతుంది. అయితే.. చాలా మంది ప్రయోగాలు చేయకుండా.. ప్రతిసారీ ఒకేలా కుక్ చేసుకుంటారు. దీనివల్ల డిఫరెంట్​ ఫ్లేవర్​ను టేస్ట్​ చేసే ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు. మీరు కూడా రెగ్యులర్​గా ఒకేవిధంగా చికెన్​ వండుకుంటున్నట్టయితే.. ఈసారి మేము చెప్పే విధంగా ప్లాన్ చేయండి.

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

కావాల్సిన పదార్థాలు:

  • చికెన్‌- అరకేజీ,
  • చుక్కకూర- నాలుగు కప్పులు,
  • పచ్చిమిర్చి- మూడు,
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు
  • నూనె- ఐదు చిన్న చెంచాలు,
  • కారం- ఒకటిన్నర చెంచా,
  • ఉప్పు- తగినంత,
  • పసుపు- పావుచెంచా,
  • ఉల్లిపాయ- ఒకటి,
  • ధనియాలపొడి- ఒకటిన్నర చెంచా,
  • గరంమసాలా- చెంచా,
  • కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

తయారీ విధానం:

  • ముందుగా చికెన్​ ముక్కలను మీడియం సైజ్​లో కట్​ చేసుకోవాలి.
  • తర్వాత ఓ గిన్నె తీసుకుని అందులో చికెన్​, ఓ చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కారం, పసుపు, ఓ చెంచా ఉప్పు పట్టించి సుమారు అరగంటపాటు పక్కన పెట్టేయాలి.
  • తర్వాత స్టౌపై కడాయి పెట్టి వేడెక్కాక నూనె పోసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి.
  • తర్వాత మరో చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకుని.. మారినేట్‌ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి అందులోని నీరంతా పోయేంతవరకూ ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు కప్పున్నర నీళ్లు పోసి, ఉడుకుతున్నప్పుడు చుక్కకూర వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
  • తర్వాత ధనియాలపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు వేసుకోని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
  • చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే చుక్కకూర చికెన్​ రెడీ!

How to Prepare Methi Mutton Curry : మటన్​ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!

తోటకూర కాడలు- రొయ్యల పులుసు:

కావాల్సిన పదార్థాలు:

  • తోటకూర కాడలు- రెండు కప్పులు
  • రొయ్యలు- కప్పు
  • ఉల్లిపాయలు- రెండు
  • అల్లం- చిన్నముక్క,
  • వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది,
  • పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- ఓ రెండు రెబ్బలు,
  • నూనె- తగినంత,
  • ఉప్పు- తగినంత,
  • ఎండుమిర్చి- రెండు,
  • జీలకర్రపొడి- చెంచా,
  • ధనియాలపొడి- చెంచా,
  • గరంమసాలా- చెంచా,
  • కారం- చెంచా

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

తయారీ విధానం :

  • స్టౌ వెలిగించి కడాయి పెట్టి వేడెక్కాక నూనె పోయాలి.
  • అందులో కరివేపాకు, ఎండుమిర్చిని తుంచి వేసి బాగా వేగనివ్వాలి.
  • తర్వాత.. తరిగిన తోట కూర కాడల్ని వేసి మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీజార్‌లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, గరంమసాలా, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
  • ఈ మసాలాను ఉడికిన తోటకూర కాడల్లో వేసుకోవాలి.
  • అవి ఉడుకుతున్నప్పుడే.. ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి.
  • ఇందులోనే రొయ్యల్ని వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉంటే రొయ్యల నుంచి నీరు వస్తుంది.
  • అది కూడా ఆవిరయ్యేంతవరకూ ఉంచి.. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టేయాలి.
  • ఆ తర్వాత మరో పది నిమిషాలకు కూర సిద్ధమవుతుంది.

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!

ప్రాన్స్ 65.. రుచిగా.. కరకరలాడుతూ..

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.