ETV Bharat / opinion

'మరో 6నెలల్లో భారత్​లో ఆర్థిక మాంద్యం!'.. నిజంగానే వచ్చే ఛాన్స్ ఉందా?

జూన్ తర్వాత దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే, నిజంగానే భారత్​లో మాంద్యానికి ఛాన్స్ ఉందా? ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏంటి?

Narayan Rane recession
Narayan Rane recession
author img

By

Published : Jan 17, 2023, 3:52 PM IST

దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందంటూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జూన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ మందగించే సూచనలు ఉన్నాయన్న ఆయన మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి గురించి ప్రజలకు తెలియకుండా ఎందుకు దాస్తున్నారంటూ ధ్వజమెత్తాయి.

కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ మంత్రి నారాయణ్ రాణె సోమవారం పుణెలో విలేకరులతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం వస్తే.. అది జూన్ తర్వాతేనని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఆర్థికంగా తిరోగమనంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి దేశంలో రాకుండా నివారించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. జీ20 తొలి ఇన్​ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్(ఐడబ్ల్యూజీ) ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"నేను కేబినెట్ మంత్రిని కాబట్టి మాకు కొంత సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రధాన మంత్రి మోదీ సైతం మాకు కొన్ని సూచనలు చేస్తారు. మంత్రివర్గ సమావేశాల్లో తెలిసిన సమాచారాన్ని బట్టి ఈ విషయాన్ని చెప్పొచ్చు. పెద్ద దేశాల్లో ఇప్పటికే ఆర్థిక మాంద్యం వచ్చింది. ఈ ఫలితంగా జూన్ తర్వాత భారత్ నెమ్మదించే అవకాశం ఉంది. దేశ ప్రజలు ఈ మందగమనం వల్ల ప్రభావితం కాకుండా చూసేందుకు మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు."
-నారాయణ్ రాణె, కేంద్ర మంత్రి

ఆర్థిక మందగమనంపై కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విపక్షాలు భగ్గున లేచాయి. "2014 తర్వాత విధ్వంసానికి గురైన 'ఎంఎస్ఎంఈ'ల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణ్ రాణె మరో ఆరు నెలల్లో మాంద్యం వస్తుందని అంచనా వేశారు. జీ20 సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి దేశ ప్రజల నుంచి ఏం దాచాలని అనుకుంటున్నారు?" అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

నిజంగానే మాంద్యం వచ్చే అవకాశం ఉందా?
ప్రపంచవ్యాప్తంగా చాలా రోజుల నుంచి మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ప్రపంచం ఎదుర్కోక తప్పదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సైతం హెచ్చరించింది. రాజకీయ సంఘర్షణలు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయని తన సర్వేలో తెలిపింది. ఫలితంగా అమెరికా, ఐరోపాలు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుందని వివరించింది. డబ్ల్యూఈఎఫ్​లో ఆర్థికవేత్తలలో మూడింట రెండొంతుల మంది 2023లో మాంద్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 18 శాతం మంది మాంద్యం తప్పక వస్తుందని నొక్కి చెప్పారు.

మందగమన సూచనలు ఇలా..

  • ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇప్పటికే అనేక సంస్థలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్ సంస్థ 18వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. భారత్​లో వెయ్యి మందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.
  • ప్రధాన ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో సాగుతున్నాయి. చైనా ఆర్థిక వృద్ధిరేటు 2022లో మూడు శాతానికి పరిమితమైంది. 50ఏళ్లలో రెండో అత్యల్ప వృద్ధి రేటు ఇదేనని అధికారికంగా ప్రకటించింది. జీరో కొవిడ్ నిబంధనల కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనమైనట్లు తెలుస్తోంది.
  • అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు సైతం తీవ్ర అనిశ్చితితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల అక్కడి కేంద్ర బ్యాంకులు భారీగా వడ్డీరేట్లు పెంచుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలు మరింత నెమ్మదించే పరిస్థితులు నెలకొన్నాయి.

భారత్​పై ప్రభావం ఎంత?
ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనంలో ఉన్నప్పటికీ.. భారత్​పై దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. WEF తన నివేదికలోనూ భారత్​.. ప్రపంచానికి ఓ చుక్కాని అని తెలిపింది. బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాల్లో తయారీ రంగ సప్లై చైన్లలో ఉన్న వైవిధ్యం కారణంగా.. మాంద్యాన్ని తప్పించుకోవచ్చని అంచనా వేసింది. చైనాను వీడుతున్న తయారీదారులతో ఈ రెండు దేశాలు లాభపడొచ్చని పేర్కొంది.

  • ఇక భారత్​లో ఇటీవలి ఆర్థిక సూచీలు మెరుగైన పనితీరు కనబర్చాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తోంది. డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠమైన 5.72 శాతంగా నమోదైంది.
  • దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 2022 నవంబరులో 7.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది 5 నెలల గరిష్ఠ స్థాయి.
  • ఈ ఏడాది కంపెనీలు మెరుగైన ప్రణాళికతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల వేతనాలను 10 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.