ETV Bharat / opinion

కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణం ఇదే.. - డెల్టా వేరియంట్​

కరోనా వైరస్​ ఉత్పరివర్తనం చెందుతూ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు మూడో దశ ముప్పు డెల్టా ద్వారానే పొంచి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వేగంగా జరిగే జన్యుక్రమ తర్జుమాలో హఠాత్తుగా జరిగే పొరపాట్లు ఉత్పరివర్తనాలకు దారితీసి, కొత్త వేరియంట్ల పుట్టుకకు కారకం అవుతున్నాయని చెబుతున్నారు.

new variants
కొత్త వేరియంట్లకు కారణం
author img

By

Published : Jul 23, 2021, 6:48 AM IST

డెల్టాగా పిలుస్తున్న బి.1.617.2 కరోనా వైరస్‌- ఆల్ఫా, బీటా, గామా వంటి వేరియంట్ల కంటే 60 శాతం అధిక సంక్రమణ శక్తి కలిగి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాదకరమైన ఈ వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తమ ప్రజారోగ్య వ్యవస్థలను పటిష్ఠం చేసుకొని అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. భారత్‌లో రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా రకం ప్రస్తుతం అమెరికా, యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా వంటి 123 దేశాల్లో విజృంభిస్తోంది. ఇండియాలో డబుల్‌ మ్యుటెంట్‌గా గుర్తింపు పొందిన ఈ వేరియంట్‌ సృష్టించిన కల్లోలాన్ని విశ్లేషించిన నిపుణులు, రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు మూడో దశ ముప్పు డెల్టా ద్వారానే పొంచి ఉందని పేర్కొంటున్నారు. గతంలో సంక్రమించిన వ్యాధి వల్ల లేదా టీకా వల్ల మానవ శరీరంలో వృద్ధిచెందిన ప్రతిరక్షకాలను నిర్వీర్యం చేసి మరీ చొచ్చుకెళుతుండటంతో ఈ వేరియంట్‌ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.

హఠాత్తుగా జరిగే పొరపాట్లతో..

డార్విన్‌ తన ఆరిజన్‌ ఆఫ్‌ స్పీసిస్‌ గ్రంథంలో వివరించిన నేచురల్‌ సెలెక్షన్‌ సిద్ధాంతం ఈ ఉత్పరివర్తనాల (మ్యుటేషన్ల) సారాంశమే. ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ల జీవన క్రమంలో కొత్త వేరియంట్ల రాకపోకలు అత్యంత సాధారణం. వీటి జన్యు క్రమంలో యాదృచ్ఛికంగా జరిగే మార్పులను జీవ పరిభాషలో ఉత్పరివర్తనాలుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. వేగంగా జరిగే జన్యుక్రమ తర్జుమాలో హఠాత్తుగా జరిగే పొరపాట్లు ఉత్పరివర్తనాలకు దారితీసి, కొత్త వేరియంట్ల పుట్టుకకు కారకం అవుతున్నాయి. కాలక్రమంలో కొత్త జాతుల ఆవిర్భావానికీ దారి తీస్తున్నాయి. మారుతున్న జీవన పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొని మనుగడ సాగించడానికి ఈ ఉత్పరివర్తనాలు అన్ని జీవులకు దోహదపడుతున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా వైరస్‌లు కొత్త శక్తులను కూడగట్టుకొని మహమ్మారులుగా మారి మానవాళిపై విరుచుకుపడుతున్నాయి. ఇవి తమ ఉనికిని కాపాడుకుంటూ వైద్య రంగానికి సరికొత్త సవాళ్లు విసురుతూ తరాల తరబడి మనుగడ సాగిస్తాయని వైరాలజిస్టులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ ప్రొటీన్‌లో చోటుచేసుకొన్న ఒకే ఒక్క సాంకేతిక మార్పు- ఈ వైరస్‌ జంతువుల నుంచి మానవాళికి సంక్రమించడానికి కారణమైంది. జన్యు మార్పిడి చెందిన వైరస్‌లు బలంగా మానవ శరీరంలోకి ప్రవేశించగల శక్తిని కూడగట్టుకొంటాయి. శరీర కణజాలానికి గట్టిగా అంటుకొని వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాన్నీ కలిగి ఉంటాయి. కొద్ది సమయంలోనే వ్యాధి తీవ్రతను పెంచి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. మొదటిసారి 2019 డిసెంబరులో చైనాలో గుర్తించిన సార్స్‌-కోవ్‌ 2 వైరస్‌లో జరిగిన అనేక జన్యు మార్పిడుల వల్ల ప్రస్తుతం ఎన్నో కరోనా వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా మనుగడలోకి వచ్చాయి. మానవాళిలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్నంత వరకు ఉత్పరివర్తనాలు జరుగుతూనే ఉంటాయని, సరికొత్త వేరియంట్ల ఉద్భవం సాగుతూనే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరస్పర సహకారంతో..

జనాభాలో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటే ఉత్పరివర్తనాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా, డెంగీ, హెపటైటిస్‌-సి వంటి ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనాల స్థాయి తక్కువగానే ఉండటం కాస్తంత ఊరట కలిగించే అంశం. జన్యు క్రమంలో సంభవించిన తప్పులను తనకు తానే గుర్తించి సరి చేసుకునే లక్షణం కరోనా వైరస్‌కు ఉండటంతో పెద్దయెత్తున వైరస్‌ వ్యాప్తి చెందుతున్నా- ఆ మేరకు ఉత్పరివర్తనాలు సంభవించడం లేదని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతలను చిత్తశుద్ధితో పాటిస్తే వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేసి కొత్త వేరియంట్ల పుట్టుకను నియంత్రించవచ్చు. వేరియంట్‌ ఏదైనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోయినా- కొత్త వేరియంట్ల పుట్టుక వ్యాక్సిన్ల తయారీపై గణనీయమైన ప్రభావం చూపగలదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైరస్‌ జన్యు మార్పిళ్లపై ప్రపంచ దేశాలు నిరంతరం నిఘా ఉంచాలి. వైరస్‌పై జరిగే అధ్యయనాలు, పరిశోధనలు, సూచనల తాజా సమాచారాన్ని పంచుకోవాలి. ఈ లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను ఒక వేదిక మీదకు తెచ్చి సత్ఫలితాలను రాబడుతోంది. 2017లో స్థాపించిన ప్రపంచ వైరాలజీ సొసైటీ సైతం ఈ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రపంచ దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొంటూ పరస్పర సహకారంతో సాగితేనే కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యమవుతుంది.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌

(వైద్యరంగ నిపుణులు)

ఇవీ చదవండి:కొత్త కేసుల్లో 'డెల్టా' రకమే అధికం!

కేరళలో పెరుగుతున్న జికా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.