ETV Bharat / opinion

Israel Hamas War 2023 : పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధోన్మాదం.. రావణకాష్ఠం ఆగాలంటే భారత్‌ సూచనలే బెటర్​! - హమాస్​ ఇజ్రాయెల్ పాలస్తీనా

Israel Hamas War 2023 : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచం ముంగిట ఇజ్రాయెల్-హమాస్​ ఘర్షణతో మరో సంక్షోభం వచ్చిపడింది. పశ్చిమాసియాను పట్టికుదిపేస్తున్న యుద్ధోన్మాదం! ఎక్కిడికి దారితీస్తుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ఇటీవల సూచించినట్లుగా.. శాంతి చర్చల ద్వారా గుర్తింపు పొందిన సరిహద్దుల్లో సౌర్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవించాలి. అయితే అందుకు ఇజ్రాయెల్‌ సంసిద్ధమవుతుందా? పలు దేశాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉన్న వినాశకర యుద్ధజ్వాలలు సమసిపోతాయా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Israel Hamas War 2023
Israel Hamas War 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 9:59 AM IST

Israel Hamas War 2023 : మారణాయుధాలు మానవతా సంక్షోభాలను సృష్టిస్తాయే తప్ప సామరస్యాన్ని నెలకొల్పలేవు. అమాయకుల నెత్తుటితో నిత్యం తడిసిముద్దయ్యే నేలలో శాంతికి స్థానముండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం- ప్రస్తుతం పశ్చిమాసియాను పట్టికుదిపేస్తున్న యుద్ధోన్మాదమే! హమాస్‌ సాయుధుల భీకర దాడికి బదులు తీర్చుకోవడంకోసం గాజాను ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేలమట్టం చేస్తోంది. కేవలం 360 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 23 లక్షల మంది నివసిస్తున్న ఆ నగరంలో అది నెత్తుటేళ్లు పారిస్తోంది. 'గాజా ప్రజలపై మేము యుద్ధం చేయట్లేదు' అంటూనే చిన్నారులూ మహిళలతో పాటు ఎందరో అసహాయులను ఇజ్రాయెల్‌ దళాలు పొట్టన పెట్టుకుంటున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే 24గంటల్లో ఉత్తర గాజాను ఖాళీచేయాలంటూ 11 లక్షల మంది మెడపై అవి కత్తి పెట్టాయి. సామాన్యులను దుర్భర అవస్థల పాల్జేశాయి.

Israel Hamas War 2023
గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు

కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్‌లో హమాస్‌ జరిపిన మారణహోమానికి, ఆపై దట్టంగా పరచుకొన్న యుద్ధమేఘాలకు ఆజ్యం పోసిందెవరు?
Hamas Israel Conflict : డిసెంబరు 2022లో మరోసారి ఇజ్రాయెల్‌ అధికార పీఠాన్ని బెంజమిన్‌ నెతన్యాహు అధిష్ఠించారు. ప్రధానమంత్రి పదవికోసం పరమ అతివాద పార్టీలతో జతకట్టిన ఆయన- స్వదేశ చరిత్రలోనే అత్యంత మతఛాందస ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. పాలస్తీనియన్ల పొడను చీదరించుకునే జాత్యహంకారులకు మంత్రి పదవులిచ్చారు. వారి అండదండలతో వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరూసలెమ్‌లలో ఇజ్రాయెలీ సెటిలర్లు అడ్డూఆపూ లేకుండా రెచ్చిపోయారు. మొన్న జూన్‌లోనే పాలస్తీనియన్లపై వాళ్లు 310 దాడులకు(ఇళ్లు తగలబెట్టడం వంటివి) తెగబడ్డారు. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో వెస్ట్‌బ్యాంక్‌లోనే రెండొందల మంది పాలస్తీనియన్లను చంపేశారు.

Israel Hamas War 2023
ఇజ్రాయెల్- హమాస్​ యుద్ధం

Israel Attack On Gaza : యూదు జాతీయవాదంలోంచి బుసలుకొడుతున్న ప్రమాదకర ఉగ్రవాదంగా దీన్ని ఇజ్రాయెల్‌ ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్‌ సైతం ఛీత్కరించారు. నెతన్యాహు సర్కారు దన్నుతో పాలస్తీనియన్లపై విచ్చలవిడిగా సాగుతున్న అణచివేత తొందరలోనే తీవ్ర అనర్థానికి దారితీయవచ్చుననే హెచ్చరికలు కొన్నాళ్లుగా వినవస్తున్నాయి. చివరికి ఆ భయసందేహాలే నిజమయ్యాయి.. కదన రక్కసి కోరల్లో నేడు సామాన్యుల బతుకులు ఛిద్రమవుతున్నాయి!

ఇజ్రాయెల్‌లో నరమేధానికి పాల్పడి ఎంతోమందిని బందీలుగా పట్టుకెళ్లిన హమాస్‌కు అసలు ప్రాణం పోసిందెవరు?
Israel Attack On Palestine : అయిదున్నర దశాబ్దాల క్రితం వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరూసలెమ్‌, గాజా స్ట్రిప్‌లను ఇజ్రాయెల్‌ గుప్పిటపట్టింది. అందుకు ప్రతిగా యాసర్‌ అరాఫత్‌ నేతృత్వంలోని పాలస్తీనా విమోచన సంస్థ(పీఎల్‌ఓ) గెరిల్లా దాడులు ప్రారంభించింది. కానీ, దాని లౌకిక జాతీయవాదం పాలస్తీనాలోని ఛాందసులకు కంటగింపుగా మారింది. అరాఫత్‌కు వ్యతిరేకంగా అటువంటివారిని ఇజ్రాయెల్‌ చేరదీసింది. పాలస్తీనియన్లు వారిలోవారు కొట్టుకోవాలన్న ఆ దేశ వ్యూహంలోంచే హమాస్‌ పుట్టుకొచ్చింది. అరాఫత్‌ ఆయుధాలు వీడి పాలస్తీనా గొంతును ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న సమయంలో హమాస్‌ హింసోన్మాదాన్ని నమ్ముకొంది.

Israel Hamas War 2023
ఇజ్రాయెల్- హమాస్​ యుద్ధం

క్రమంగా స్థానికంగా పట్టు పెంచుకొని తనకు పాలుపోసిన ఇజ్రాయెల్‌కే అదిప్పుడు కొరకరాని కొయ్యగా పరిణమించింది. దానికి హెజ్బొల్లా, ఇస్లామిక్‌ జీహాద్‌ సంస్థలు తోడయ్యాయి. సంప్రదాయ ప్రత్యర్థిగా ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌పై కాలుదువ్వుతోంది. కానీ, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో వచ్చిన మార్పులతో అరబ్‌ దేశాలేమో టెల్‌ అవీవ్‌తో స్నేహ సంబంధాలకు మొగ్గుచూపుతున్నాయి. అదే అదనుగా అమెరికా దన్నుతో పాలస్తీనా సమస్య అంటూ ఏదీ లేనట్టుగా ప్రవర్తించిన ఇజ్రాయెల్‌- ఆక్రమిత ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చింది.

Israel Palestine History : 1967 సమరంలో తాను చేజిక్కించుకున్న భూభాగాలను విడిచిపెట్టాలని, జెరూసలెమ్‌లోని 'గ్రీన్‌లైన్‌'ను శిరసా వహించాలన్న ఐరాస తీర్మానానికి అది పూచికపుల్ల పాటి విలువ ఇవ్వడం లేదు. ఆ ఆధిపత్యవాద దురహంకారమే ఇజ్రాయెల్‌ భద్రతకు ప్రమాదకరమవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దమనకాండతో ఇప్పటికే అనేక విధాలుగా అవస్థల పాలవుతున్న ప్రపంచాన్ని మరో సంక్షోభ సుడిగుండంలోకి అదే నెట్టుకుపోయింది. పశ్చిమాసియాలో రావణకాష్ఠం ఆరాలంటే- భారత్‌ ఇటీవల సూచించినట్లు, శాంతి చర్చల ద్వారా గుర్తింపు పొందిన సరిహద్దుల్లో సౌర్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవించాలి. అందుకు ఇజ్రాయెల్‌ సంసిద్ధమవుతుందా?. పలు దేశాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉన్న వినాశకర యుద్ధజ్వాలలు సమసిపోతాయా?

Palestine President Hamas : హమాస్ మిలిటెంట్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు: పాలస్తీనా అధ్యక్షుడు

Israel Hamas War 2023 : యుద్ధంతో ఆస్పత్రులు ఫుల్.. కనీస సౌకర్యాలు లేక అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.