ETV Bharat / opinion

పెచ్చరిల్లుతున్న అసమానతలకు అంతమెన్నడు?

author img

By

Published : Jul 26, 2021, 7:31 AM IST

దేశ ఆరోగ్య రంగం విషయంలో సామాజిక, ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. ఉన్నత వర్గాల్లో దాదాపు 80 శాతానికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే- షెడ్యూల్డ్‌ కులాలు, తెగల్లో సగానికి సగం మందికి అవి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. దేశ జనాభాలో సగటున ప్రతి తొంభై వేల మందికి ఒక్కటే ప్రభుత్వ ఆస్పత్రి ఉందన్న గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి.

healthcare inequalities in india
వైద్య రంగంలో అసమానతలు

దేశంలో ప్రజారోగ్య రంగాన దశాబ్దాలుగా మేట వేసిన సామాజిక ఆర్థిక అసమానతలు అణగారిన వర్గాలకు పెను శాపాలవుతున్నాయి. వీటిని కళ్లకు కడుతూ తాజాగా ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసిన 'అసమానతా నివేదిక' కలవరపాటుకు గురిచేస్తోంది. ఆరోగ్య భద్రతకు అత్యవసరమయ్యే నాణ్యమైన, వ్యక్తిగత పారిశుద్ధ్య సౌకర్యాలకు షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కుటుంబాలెన్నో నోచడంలేదన్న యథార్థాన్ని ఆ నివేదిక వెల్లడించింది. ఉన్నత వర్గాల్లో దాదాపు 80 శాతానికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే- షెడ్యూల్డ్‌ కులాలు, తెగల్లో సగానికి సగం మందికి అవి అందని ద్రాక్షగానే మిగలడం ప్రగతి ఫలాల డొల్లతనాన్ని తెలియజేస్తోంది.

బడుగులపైనే కొవిడ్ పిడుగు

సంపన్న వర్గాలతో పోలిస్తే బడుగులు అయిదు రెట్లు అధికంగా కరోనా బారిన పడ్డారని ఆక్స్‌ఫామ్‌ అధ్యయనం తేల్చిచెప్పింది. దేశ జనాభాలో సగటున ప్రతి తొంభై వేల మందికి ఒక్కటే ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నప్పుడు ప్రజలకు ప్రైవేటు బాట తప్ప మరో దారేముంటుంది? వైద్య ఖర్చులకు పట్టణ వాసులు కష్టపడి కూడబెట్టుకున్న రొక్కాన్ని కరిగించేస్తుంటే, గ్రామీణులకు అప్పులే శరణ్యమవుతున్నాయి. మరెందరో ఆస్తులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ వైద్యంపై పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా వైద్య ఖర్చుల్లో 64 శాతం మేరకు భారతీయులు తమ జేబుల నుంచే భరించాల్సి వస్తోంది. ప్రపంచ సగటు 18.2 శాతంతో పోలిస్తే ఇది చాలా అధికం! తడిసి మోపెడవుతున్న ఈ ఖర్చులతోనే ఏటా దేశంలో 6.3 కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోతున్నారు. వైద్య చికిత్సల వ్యయం అందరికీ అందుబాటులో ఉండాలన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పు క్షేత్ర స్థాయిలో కొల్లబోతోంది.

కేటాయింపులేవి?

ప్రజారోగ్య కేటాయింపులను 2025 నాటికల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని జాతీయ ఆరోగ్య విధానం నిర్దేశించింది. వాస్తవంలో ఈ ఏటి బడ్జెట్‌లో అవి 0.34 శాతానికే పరిమితమయ్యాయి! ఈ విషయంలో బ్రిక్స్‌ దేశాల్లో మిగిలిన వాటికి మనకు హస్తిమశకాంతరం కనిపిస్తోంది. ప్రజారోగ్యం కోసం బ్రెజిల్‌ జీడీపీలో తొమ్మిది శాతం, దక్షిణాఫ్రికా ఎనిమిది శాతం చొప్పున వెచ్చిస్తుంటే- రష్యా, చైనా అయిదు శాతం మేర నిధులను ప్రత్యేకిస్తున్నాయి. భూటాన్‌, శ్రీలంక వంటి వాటికన్నా తీసికట్టు కేటాయింపులతో ఇండియా ఈసురోమంటోంది.

నిధులు పెంచితేనే

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. మన దేశంలో 1511 మందికి ఒక్కరే దిక్కవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, సామాజిక స్వాస్థ్య కేంద్రాలు ఉండాల్సిన వాటికన్నా యాభై వేలు తక్కువగా ఉన్నాయని ఇటీవల కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. ప్రజారోగ్య రంగాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్యల ఫలితంగా కరోనా కాలంలో జనావళి ఇక్కట్లు రెట్టింపయ్యాయి. కొన్నేళ్లుగా వైద్య అసమానతలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు తగ్గాయి. ప్రజారోగ్యానికి అధిక నిధులు వెచ్చిస్తున్న అసోం, గోవా వంటి చోట్ల కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉందన్నది ఆక్స్‌ఫామ్‌ పరిశోధకుల అభిప్రాయం. ఈ స్ఫూర్తిని అన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకొంటేనే ప్రజల ఆరోగ్య హక్కుకు సరైన భరోసా దక్కుతుంది. కార్పొరేటు ఆస్పత్రుల అడ్డగోలు దోపిడికి అడ్డుకట్ట వేయడంతో పాటు సర్కారీ వైద్య రంగాన్ని బలోపేతం చేసి బడుగుల ఆరోగ్య భాగ్యానికి ప్రభుత్వాలు గొడుగుపట్టాలి. శ్రేష్ఠ్‌ భారత్‌ అవతరణకు, 'స్వస్థ భారత్‌' స్ఫూర్తి తేజరిల్లడానికి అదీ దారి!

ఇదీ చదవండి: మహారాష్ట్రలో వరద విలయం- 149కి చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.