ETV Bharat / opinion

కరోనా కట్టడికి నిర్బంధమే పరమౌషధమా? - lockdown contain the corona spread

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ ఎలాంటి ఫలితాలు ఇచ్చింది? దాని వల్ల సహజంగా ఏర్పడాల్సిన సామూహిక రోగనిరోధకత ఎంతమేర విఘాతం కల్గిదంనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ అమలు చేసిన, అమలు చేయని దేశాల్లోని మరణాల రేటులో వ్యత్యాసం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉండదంటూ పలువురు నిపుణులు వాదిస్తున్నారు.

can lockdown contain the spread of corona
కరోనా కట్టడికి నిర్బంధమే పరమౌషధమా?
author img

By

Published : May 8, 2020, 8:25 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ విధానం ఎంతమేరకు ఫలితాలు ఇచ్చింది, దానివల్ల సహజంగా ఏర్పడాల్సిన సామూహిక రోగనిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ)కి ఎంతమేర విఘాతం కలిగిందనే అంశాలపై చర్చలు మొదలయ్యాయి. ఉదాహరణకు సందర్శకులను నిషేధించినప్పటికీ స్వీడన్‌లోని వృద్ధుల సంక్షేమ గృహాల్లో 80 ఏళ్ళు పైబడినవారిలో 64 శాతం మరణాలు సంభవించాయి. అక్కడ లాక్‌డౌన్‌ విధించలేదు. ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. 'ఈ మరణాలను లాక్‌డౌన్‌ ఏ విధంగా ఆపగలిగేది' అంటూ స్వీడన్‌కు చెందిన అంటువ్యాధుల విజ్ఞాన శాస్త్రవేత్తలు (ఎపిడమియాలజిస్టులు) చేస్తున్న వాదనలోని హేతుబద్ధతను ప్రశ్నించలేం. లాక్‌డౌన్‌ అమలు చేసిన, అమలు చేయని దేశాల్లోని మరణాల రేటులో వ్యత్యాసం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉండదంటూ పలువురు నిపుణులు చేస్తున్న వాదననూ కొట్టివేయజాలం. లాక్‌డౌన్‌ను అమలు చేసిన స్విట్జర్లాండ్‌ సహా ఐరోపా దేశాలతో పోలిస్తే స్వీడన్‌లో నమోదవుతున్న కోవిడ్‌ కేసులు చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

భారత్‌లో సత్ఫలితాలు

పరిసరాల పరిశుభ్రత తక్కువగా ఉండే, వ్యక్తిగత పరిశుభ్రత పాటించే అలవాటు అంతగా ఉండని భారత్‌ వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ విధించకపోయినట్లయితే... వైరస్‌ మరింత ప్రమాదకరంగా పరిణమించి వేగంగా వ్యాప్తి చెంది ఉండేదనే వాదనలు సరైనవే. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడానికి సైతం లాక్‌డౌన్‌ ఉపయోగపడిందని చెప్పుకోవచ్ఛు అన్ని అంటువ్యాధుల మాదిరిగా ఇది కూడా వస్తుంది, పోతుందనే నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తూ, ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోయినట్లయితే, సమస్య తీవ్రత ఊహకందని స్థాయిలో ఉండేది. మరోవైపు, వైరస్‌ స్వభావరీత్యా విశ్లేషిస్తే లాక్‌డౌన్‌ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం శూన్యమేననేది అనుభవజ్ఞులైన పలువురు అంటువ్యాధి విజ్ఞానశాస్త్ర నిపుణుల అభిప్రాయం. దీనికి కారణమూ లేకపోలేదు.

అంటువ్యాధులు వ్యాప్తి చెందే తీరుతెన్నులను పరిశీలించినట్లయితే సాధారణంగా వ్యాధికారక క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే కొద్దీ కాలక్రమేణా బాధితుల శరీర ధర్మానికి తగినట్లుగా తమను తాము మలచుకుంటాయి. ఈ క్రమంలో అవి తమ వ్యాధికారకతను పాక్షికంగా కోల్పోతుంటాయి. ఫలితంగా వ్యాధి తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విధంగా రుగ్మతలు పెరిగే కొద్దీ, వ్యాధి కారకతతో సంబంధం లేకుండా, ఆయా ప్రాంతాల్లోని ప్రజా సమూహాల్లో వ్యాధికారక క్రిముల వ్యాప్తి జరుగుతుంది. తద్వారా నిరోధకత సముపార్జించుకున్న జనాభా వల్ల ఆయా ప్రాంతాల్లో సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) ఏర్పడుతుంది. ఆ తరవాత సామూహిక రోగ నిరోధకత బలహీనంగా ఉండేవారికి కొంతమేర రక్షణ అందించగలదేమోగానీ, రుగ్మతలు వ్యాపించకుండా నిరోధించలేదు. అందువల్ల ‘ఒక సమూహంలోని కొంతమందిలో ఏర్పడిన సామూహిక నిరోధకత వల్ల మిగిలిన జనాభాకూ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందదు’ అనే వాదనలో ఏ మాత్రం హేతుబద్ధత లేదనే అభిప్రాయాలున్నాయి. సామూహిక వ్యాధి నిరోధకత కేవలం వ్యాధికారక క్రిములు సహజసిద్ధంగా సంక్రమించినప్పుడే ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా కృత్రిమ పద్ధతుల్లో ఆటంకం కలిగించినప్పుడు సామూహిక రోగ నిరోధకత ఆలస్యంగా ఏర్పడటమో లేదా లోపభూయిష్ఠంగా మారడమో జరుగుతుంది. తద్వారా, ఈ విధానాల వల్ల కరోనా వైరస్‌లాంటి వ్యాధికారక క్రిములు మరింత ప్రమాదకరంగా పరిణామం చెందే అవకాశం కల్పించినట్లవుతుంది.

రుగ్మతల కట్టడిలో కీలక పాత్ర

క్‌డౌన్‌ కేవలం నిర్దిష్ట సమయంలో రుగ్మత (ఇన్‌ఫెక్షన్‌)ల సంఖ్యను తగ్గించగలదేమోగానీ పూర్తిగా ఆపివేయలేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. లాక్‌డౌన్‌ తొలగించిన తరవాతా రుగ్మతల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సుమారు నలభై రోజులుగా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ భారత్‌లో క్రమక్రమంగా పెరుగుతున్న కేసులు లాక్‌డౌన్‌ ముఖ్య ఉద్దేశాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇదే కోవలో తొలుత వైరస్‌ సోకినవారి ఆనవాళ్లను, కేసులను త్వరితగతిన గుర్తించి- అనుమానితులను పరీక్షిస్తూ, లాక్‌డౌన్‌ను అత్యంత పకడ్బందీగా అమలు చేసి కరోనా వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేస్తున్న జర్మనీలో ఇప్పటికే లక్షా అరవై ఎనిమిది వేల పైచిలుకు కేసులు నమోదుకావడం ఆశ్చర్యకరం. ఇలాంటి దేశాలకు భిన్నంగా... డెన్మార్క్‌, నార్వే వంటి ఐరోపా దేశాల్లో మాత్రం రోజువారీ నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల రేటు అత్యంత తక్కువగా ఉంది. ఈ దేశాల కొవిడ్‌ గణాంకాలను పరిశీలిస్తే లాక్‌డౌన్‌ విధానం జన సాంద్రత తక్కువగా ఉండే దేశాలకే ప్రయోజనకరంగా ఉంటుందేమోననే భావన కలగక మానదు.

వ్యాధి నిరోధకతతోనే...

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఇన్‌ఫెక్షన్లను కట్టడి చేయడం, కొవిడ్‌ మరణాల రేటును సాధ్యమైనంతగా తగ్గించడం- మున్ముందు మనం ఎదుర్కోవాల్సిన అతి పెద్ద సవాళ్లు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తీసుకున్న చర్యల వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి ఉంటుంది కాబట్టి... ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం తగ్గుతుంది. ఇక మరణాల రేటును నియంత్రించడంలో భాగంగా కరోనా వైరస్‌ బారిన తేలికగా పడే అవకాశం ఉన్న జనసమూహాలను వయసుల వారీగా గుర్తించి వారి ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికే కోలుకున్న వారిలో వ్యాధి నిరోధక కారకాలను నిపుణులు అధ్యయనం చేయాలి. వైరస్‌ సోకినప్పటికీ ఒకటి నుంచి మూడు వారాలపాటు లక్షణాలు కనిపించకపోవడానికి గల కారణాలనూ అన్వేషించాలి. వ్యాధికారక క్రిములపై నేరుగా దాడి చేసే కాలం చెల్లిన చికిత్సా విధానాలకు స్వస్తి పలికి వాటిని పరోక్షంగా ముట్టడించే సరికొత్త మార్గాలపై దృష్టి సారించాలి. కరోనా వైరస్‌పై దాడిలో పాల్గొనే ప్రధాన అస్త్రమైన వ్యాధి నిరోధక శక్తి తీరుతెన్నులను గమనించాలి. అదుపు తప్పుతున్న పక్షంలో వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఔషధాలను బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ యాంటీబయాటిక్స్‌తో కలిపి ప్రయోగించే వెసులుబాటును పరిగణనలోకి తీసుకోవాలి. కొవిడ్‌ బాధితుల్లో విస్తరించే అవకాశం ఉన్న ద్వితీయశ్రేణి ఇన్‌ఫెక్షన్లపైనా దృష్టి సారించాలి. కొవిడ్‌పై పోరులో కేవలం టీకాలపై మాత్రమే ఆధారపడుతూ, వాటి కోసం నిరీక్షిస్తూ ఉండటం సరి కాదు. అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలను, నివారణోపాయాలను విస్మరించకూడదు.

-(రచయిత- జర్మనీలో ఇమ్యునాలజీ రీసెర్చ్‌ సైంటిస్ట్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.