ETV Bharat / lifestyle

వ్యాయామం మితిమీరితే ఈ సమస్యలే వస్తాయట..!

మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషం’ అంటుంటారు. ఆహారం విషయంలోనే కాదు.. మనం ఫిట్‌నెస్‌ కోసం చేసే వ్యాయామాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. శారీరక దృఢత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాయామాలు చేయడం ముఖ్యమే అయినప్పటికీ.. అతిగా చేస్తే మాత్రం వివిధ రకాల దుష్ప్రభావాలు తప్పవంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అందుకే ఎక్కువ వర్కవుట్స్‌ చేస్తే ఎక్కువ దృఢత్వం సొంతమవుతుందన్న అపోహను పక్కన పెట్టి.. రోజుకో అరగంట లేదా నలభై నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. తద్వారా అటు ఎలాంటి అనారోగ్యాలు తలెత్తకుండా ఉండడంతో పాటు ఫిట్‌నెస్‌ను కూడా సొంతం చేసుకోవచ్చట! మరి, ఇంతకీ అతిగా వ్యాయామాలు చేస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలెదురవుతాయో తెలుసుకుందాం రండి..

physical fitness
వ్యాయామం
author img

By

Published : Feb 17, 2021, 4:43 PM IST

తక్కువ సమయంలో ఎక్కువ దృఢత్వాన్ని పొందాలన్న ఉద్దేశంతో తెగ వ్యాయామాలు చేసేస్తుంటారు కొంతమంది. ఈ క్రమంలో ఇంట్లో అయినా, జిమ్‌లో అయినా వివిధ రకాల జిమ్‌ పరికరాలతో ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటారు. అయితే ఇలా అతిగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్య పరంగా పలు నష్టాలున్నాయంటున్నారు నిపుణులు.

ఒత్తిడి తగ్గడం కాదు.. పెరుగుతుంది!

ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడి, ఆందోళనలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. మరి, వీటిని దూరం చేసుకోవడానికి చాలామంది ఎంచుకునే మార్గం వ్యాయామం. ఈ క్రమంలో డోపమైన్‌ అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. అదే వర్కవుట్స్‌ మితిమీరితే ఒత్తిడి తగ్గడానికి బదులు మరింతగా పెరుగుతుందట! ఇందుకు కారణం అధిక వ్యాయామం వల్ల శరీరంలో కార్టిసాల్‌ అనే ఒత్తిడి హార్మోన్‌ ఎక్కువగా విడుదలవడమే! తద్వారా మనసుతో పాటు శరీరం కూడా అలసిపోతుంది. అందుకే రోజూ అరగంట నుంచి నలభై నిమిషాల పాటు వ్యాయామాలకు కేటాయిస్తే చాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఏడెనిమిది గంటల సుఖ నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు.

అది ఆకలిని పెంచుతుంది!

అధికంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. తద్వారా ‘అనొరెక్సియా’ అనే సమస్య తలెత్తుతుంది. దీనివల్ల ఆకలి పెరగడం, తీసుకునే ఆహారం విషయంలో అడ్డూ-అదుపూ ఉండకపోవడం, నచ్చిన పదార్థాలు మోతాదుకు మించి లాగించడం.. వంటివి చేస్తాం. ఇది క్రమంగా బరువు పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో మనం ఏ వ్యాయామాల వల్లైతే బరువు తగ్గి నాజూగ్గా మారాలనుకున్నామో.. అది నెరవేరదు సరికదా.. అధిక బరువు వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ లేకపోలేదు.

రోగనిరోధక వ్యవస్థపైనా ప్రభావం!

ఎలాంటి అనారోగ్యాలనైనా తట్టుకునే శక్తిని కూడగట్టుకోవాలంటే మన రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ముఖ్యం. కానీ అధికంగా వ్యాయామాలు చేసే వారిలో రోగనిరోధక శక్తి స్థాయులు క్రమంగా తగ్గుతున్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వ్యాయామాల పేరుతో శరీరాన్ని అతిగా కష్టపెట్టడం వల్ల దాని ప్రభావం జీవక్రియల మీద కూడా పడుతుందట! ఫలితంగా రక్తహీనత తలెత్తడంతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.

గాయాలు తప్పవు!

రోజులో కాస్త పని ఎక్కువైతే అలసిపోతాం.. ఆ అలసట తీర్చుకొని శరీరానికి శక్తిని అందించాలంటే వర్కవుట్స్‌ చేయడం మనలో చాలామంది చేసేదే! అయితే ఇలా మనం చేసే వ్యాయామాలు మితిమీరకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అధిక వ్యాయామాల వల్ల శరీరం చురుగ్గా మారడమేమో గానీ మరింతగా అలసిపోయే ప్రమాదం ఉందట! అలాగే కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి.. వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంటుందట! పైగా ఇలాంటి నొప్పులొస్తే ఓ పట్టాన తగ్గవు.. దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెడుతూ ఇతర పనులు చేసుకోకుండా, కనీసం ఓ చిన్నపాటి వ్యాయామంపై కూడా దృష్టి పెట్టకుండా, నిద్ర పట్టకుండా తీవ్ర ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి ఏ వ్యాయామమైనా, ఇతర వర్కవుట్స్‌ కలిపి చేసినా అరగంట పాటు చేస్తే సత్ఫలితాలను పొందచ్చు.

నెలసరి తప్పుతుంది!

పలు అనారోగ్యాలు, మానసిక రుగ్మతల కారణంగా చాలామంది అమ్మాయిల్లో నెలసరి సమస్యలు తలెత్తుతున్నాయి. మరి, వీటి నుంచి బయటపడాలంటే వ్యాయామం కూడా ఓ ఔషధంలా పనిచేస్తుంది. అయితే అది మితిమీరితే మాత్రం నెలసరి విషయంలోనూ ప్రతికూల సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు నిపుణులు. అతిగా వ్యాయామాలు చేయడం వల్ల అమెనోరియా బారిన పడే ప్రమాదం ఉంది. దీని కారణంగా నెలసరి ఆగిపోవడం లేదంటే క్రమం తప్పడం.. వంటివి జరుగుతాయి. ఇదిలాగే కొనసాగితే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు పడిపోయి ఆస్టియోపొరోసిస్‌కు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే నిపుణుల సూచనల మేరకే నిర్ణీత సమయాన్ని వ్యాయామాలకు కేటాయించాల్సి ఉంటుంది.

వీటితో పాటు అధిక వ్యాయామాల వల్ల గుండె ఆరోగ్యం, శ్వాస వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి రోజూ అరగంట పాటు వర్కవుట్స్‌కు కేటాయించమని, ఈ క్రమంలో ఏవైనా అనారోగ్యాలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదించమని సలహా ఇస్తున్నారు.

ఇవీచూడండి:

ఎన్నికల ముందు సరే.. తర్వాత వాడేసిన బ్యాలెట్ పత్రాలు ఏం చేస్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.