కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడులో...... ఓ మహిళ మరణించింది. మహిళ మృతికి.... ఆర్ఎంపీ వైద్యమే కారణమంటూ బంధువులు ఆరోపించారు. జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లామని.... వెంటవెంటనే రెండు ఇంజక్షన్లు చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. తర్వాత నాగమణి కుప్పకూలిపోయి.... పావు గంట వ్యవధిలోనే కన్నుమూసిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మైలవరం ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: ఫోన్ చేజారిందని... ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు