ETV Bharat / jagte-raho

బెట్టింగ్​: మొదట సరదా.. తర్వాత వ్యసనం.. చివరికి..?

మొదట అదొక సరదా.. తర్వాత వ్యసనం.. చివరికి ప్రాణాలు బలి... ఇది బెట్టింగ్​లో పాల్గొనేవారి దుస్థితి. ఆ బెట్టింగే అక్రమ మార్గాల బాట పట్టిస్తోంది. దొంగలు, హంతకులను చేస్తోంది. జీవితాలను బలి చేస్తోంది.

బెట్టింగ్​: మొదట సరదా.. తర్వాత వ్యసనం.. చివరికి..?
బెట్టింగ్​: మొదట సరదా.. తర్వాత వ్యసనం.. చివరికి..?
author img

By

Published : Nov 30, 2020, 10:57 PM IST

జల్సాలు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో యవత బెట్టింగ్ బాట పడుతోంది. ఆ అత్యాశే దొంగలను, హంతకులను చేస్తోంది. అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నవారు కొందరైతే... అప్పులు తీర్చడం కోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటున్న వారు మరికొందరు. బెట్టింగ్ వ్యసనం ఏ తప్పులైనా చేయిస్తోంది.

ఇప్పుడు బెట్టింగ్​ ఈజీ అవడంతో... ఆన్​లైన్​లోనే బెట్టింగ్​ కాస్తూ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ వారిని ఈ ఊబిలోకి దించుతోంది. ఆ తర్వాత అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కుతున్నారు.

హైదరాబాద్​ వనస్థలిపురంలో ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి అప్పులపాలైన జగదీశ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 'నేను ఆన్​లైన్​ గేమ్స్ ఆడి నష్టపోయాను, నన్ను క్షమించండి' అంటూ భార్యకు సెల్ఫీ వీడియో పంపి ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. గతంలో చేసిన అప్పు రూ.12 లక్షలను ఆన్​లైన్​ గేమ్స్ ఆడటం ద్వారా చెల్లించిన జగదీశ్.. ఇప్పుడు అదే గేమ్స్​ ఆడి నష్టపోయాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు.

సంబంధిత కథనం : అప్పుడు అప్పు తీర్చింది.. ఇప్పుడు ప్రాణం తీసింది..

బెట్టింగ్‌ వ్యసనం కన్నతల్లి, చెల్లిని హత్యచేసేలా దిగజార్చింది. అత్యాశకు పోయి అప్పులు చేయడమే కాకుండా కుటుంబ సభ్యులనే హతమార్చడం కలకలం రేపింది. బెట్టింగ్‌కు బానిసగా మారి కుటుంబ సభ్యులకే విషం పెట్టాడు. మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో సాయినాథ్‌రెడ్డి అనే యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల పేరుతో బ్యాంకులో ఉన్న రూ. 25 లక్షలను డ్రా చేసి, బెట్టింగ్‌లో పోగొట్టాడు. దీనిపై గొడవ జరుగుతుందని అనుమానించిన సాయినాథ్‌రెడ్డి.. విషం పెట్టి కుటుంబ సభ్యులను హత్యచేసి ఏమీ ఎరగనట్టుగా నాటకం ఆడాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

సంబంధిత కథనం : అమానుషం: విషం కలిపి తల్లిని, చెల్లిని కడతేర్చిన కిరాతకుడు

బెట్టింగ్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక అర్ధాంతరంగా తనువుచాలిస్తున్నవారు ఎందరో. బెట్టింగ్​లపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా... పరిస్థితి మారడం లేదు. అత్యాశ మనిషిని ఆ ఊబిలో దించుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.