అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి, రామగి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో సారా తయారుచేస్తున్న స్థావరాలపై దాడులు చేశారు. బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎక్సైజ్ శాఖ సీఐ లక్ష్మినారాయణరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్విహించారు. మూడు మండలాల్లో అటవీ ప్రాతంలో తయారుచేసి నిల్వ ఉంచిన 30 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. గ్రామాల్లో సారాయి తయారీని అరికట్టాలని... మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. ఎవరైనా అమ్మటంకాని, తయారుచేయటం కాని చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి.