ETV Bharat / jagte-raho

విదేశాల్లో ఉద్యోగమని.. 20 లక్షలు కాజేశాడు! - విజయవాడ అజిత్​సింగ్​ నగర్​లో ఆన్​లైన్ మోసం తాజా వార్తలు

చదువు పూర్తయింది.. ఉద్యోగాల వేటలో ఉన్న అతడికి.. ఆన్​లైన్​లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని.. నమ్మబలికాడు. వీసా కోసం ఖర్చవుతుందనగానే.. తల్లిదండ్రులనడిగి ఇచ్చేశాడు. ఆన్​లైన్​లో పరిచయమైంది మోసగాడని తెలిసి అవాక్కయ్యాడు.

cyber crime happend in vijayawada
cyber crime happend in vijayawada
author img

By

Published : Sep 17, 2020, 10:43 PM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్ స్టేషన్ పరిధిలోని దేవినగర్​లో నివాసముంటున్న గర్నెపూడి సాయి హరీష్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఆన్​లైన్​లో వాకబు చేశాడు. ఈ క్రమంలో 2 నెలల క్రితం డాక్టర్ ఉమేష్ ప్రభు అనే అతను ఆన్​లైన్ ద్వారా సాయి హరీష్​తో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. తనకు యుకేలో సూపర్ మార్కెట్ వుందని దానికి స్టోర్ మేనేజర్​గా తీసుకుంటానని చెప్పాడు.

ఆ ఉద్యోగం కోసం వీసా ప్రాసెసింగ్ కోసం రూ. 20 లక్షల వరకూ పలు దఫాలుగా కట్టించుకున్నాడు. ఈ ఏడాది జులై 31వ తేదీన హైదరాబాద్​లోని తాజ్ డెక్కన్ హోటల్లో ఉన్న ఎంబసీ ఆఫ్ బ్రిటిష్ వద్దకు రావాలని ఆన్​లైన్​లోనే కాల్ లెటర్ కూడా పంపాడు. అయితే అక్కడకు తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లిన సాయి హరీష్ అవాక్కయ్యాడు. ఆన్​లైన్ లో పంపిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ అని, కరోనా కారణంగా అసలు బ్రిటిష్ ఎంబసీ పనిచేయటం లేదని అక్కడ అధికారులు తెలిపారు. డాక్టర్ ఉమేష్ ప్రభు కోసం సంప్రదించగా అతని వివరాలు కూడా ఆన్​లైన్​లో లభ్యం కాలేదు. దీంతో తాను మోసపోయానని సాయి హరీష్ తెలుసుకున్నాడు. ఉమేష్ ప్రభుతో పాటుగా బ్రిటిష్ ఎంబసీలో పనిచేస్తున్నానని నమ్మించి వీసా ప్రాసెస్ కోసం సంప్రదించిన ఫిలిప్స్ ఎం చార్లెస్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అజిత్ సింగ్ నగర్ పోలీసులకు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఫిర్యాదు చేశాడు. సాయి హరీష్ తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ ప్రతిమలు ఎవరు ఎత్తుకెళ్లినట్టు? దర్యాప్తు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.