ETV Bharat / jagte-raho

రెండు రోజుల్లోనే సుమారు 12 మంది మృతి - అలీసాగర్‌ ప్రాజెక్టులో గల్లంతైన ముగ్గురు

తెలంగాణ రాష్ట్రంలోని పలు కుటుంబాల్లో తీరని జలవిషాదం నెలకొంది. గత రెండు రోజుల్లోనే సుమారు 12 మంది మృతి చెందారు. ములుగు జిల్లాలో గోదావరిలో ఈతకు వెళ్లి నలుగురు, అలీసాగర్‌ ప్రాజెక్టులో సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు అమ్మాయిలు, నిజాంసాగర్‌లో ఈతకెళ్లి నీటిలో మునిగిపోయిన ఇద్దరు గల్లంతయ్యారు.

12-people-were
12-people-were
author img

By

Published : Nov 16, 2020, 8:51 AM IST

రెండు రోజుల్లోనే సుమారు 12 మంది మృతి

తెలంగాణలోని పలు కుటుంబాలు తీరని జలవిషాదంలో మునిగిపోయాయి. గత రెండు రోజుల్లోనే సుమారు 12 మంది జలసమాధి అయ్యారు. సెల్ఫీ దిగుతూ నీళ్లలో జారి పడి కొందరు... సరదగా ఈత కొడుతూ మరికొందరు జలాశయాల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అప్పటి దాకా తమ ముందు ఆడిపాడిన పిల్లలు... గంటల వ్యవధిలోనే విగతజీవులుగా మారడం కుటుంబసభ్యులను కన్నీటిసంధ్రంలో ముంచెత్తింది.

ఈతకు వెళ్లి నలుగురు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాల వద్ద గోదావరిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతు కాగా... శనివారం ఇద్దరి మృతదేహాలు, ఆదివారం మరో ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. వెంకటాపురం మండలంలోని రంగరాజపురానికి చెందిన 23 మంది యువకులు... స్నేహితుని పుట్టిన రోజు, దీపావళి పండగ ఒకే రోజు రావడం వల్ల అంతా కలిసి ఉత్సాహంగా పార్టీ చేసుకున్నారు. అనంతరం 19 మంది గోదావరిలో ఈతకు దిగారు. వీరిలో అన్వేష్, కార్తీక్, శ్రీకాంత్, ప్రకాష్ అనే నలుగురు యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ప్రాజెక్టులో ముగ్గురు గల్లంతు

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌ ప్రాజెక్టులో గల్లంతైన ముగ్గురు అమ్మాయిలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన అమ్మాయిలు సెల్ఫీ దిగుతూ... నీళ్లలో జారిపడి విగతజీవులయ్యారు. మృతులు బోధన్ మండలం రాకాసిపేటకు చెందిన మైనర్‌ బాలికలు మీరాజ్, మషేరా, జునేరా అని పోలీసులు తెలిపారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన చిన్నారి నిహారిక సైతం... స్వీయ చిత్రం తీసుకుంటూనే భీమలింగం కత్వా వద్ద నీళ్లలో పడి ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు నీళ్లను జల్లెడ పట్టి మృతదేహాన్ని బయటికీ తీయగా... విగతజీవిగా కనిపించిన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిలసేలా రోదించారు.

ప్రాజెక్టును చూసేందుకు వెళ్లి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో ఈతకెళ్లి నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. మెదక్ జిల్లా కల్హేర్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు నిజాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వెళ్లారు. 16వ గేటు వద్ద సరదాగా ఈతకొడుతుండగా.. సుమేర్, శివ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అనంతరం సుమేర్ మృతదేహం లభించగా.. శివ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెక్ డ్యాంలో మృతదేహం

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్‌లో శుక్రవారం మేకలు కాసేందుకు వెళ్లిన యువకుడు సహా మరో బాలుడు చెక్‌డ్యామ్‌లో గల్లంతయ్యారు. సాజిద్, రాకేష్ కోసం కుటుంబీకులు వెతికినా ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం గ్రామ శివారులోని చెక్ డ్యాంలో సాజిద్ మృతదేహం లభ్యమైంది. రాకేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి :

తెరుచుకున్న శబరిమల ఆలయం- భక్తులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.