ETV Bharat / international

ఇజ్రాయెల్​పై రాకెట్ దాడులు- వారి పనే! - ఇజ్రాయెల్ వార్తలు

ఇజ్రాయెల్​లో రాకెట్ దాడులు కలకలం రేపాయి. లెబనాన్ నుంచి మూడు రాకెట్లు తమ దేశంపై ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందుకు ప్రతీకారంగా ఆర్టిలరీ ఆయుధాలతో దాడులు జరిపినట్లు వెల్లడించింది.

israel lebanon
ఇజ్రాయెల్​పై రాకెట్ దాడులు
author img

By

Published : Aug 4, 2021, 7:34 PM IST

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఒక దేశంపై మరొకటి దాడులు చేసుకున్నాయి. లెబనాన్ నుంచి రాకెట్ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మూడు రాకెట్లు ప్రయోగించారని వెల్లడించింది. ప్రతిగా ఆర్టిలరీ ఆయుధాలతో లెబనాన్​పై దాడులు జరిపినట్లు తెలిపింది.

లెబనాన్ ప్రయోగించిన ఓ రాకెట్ ఖాళీ ప్రదేశంలో పడిందని ఛానల్ 12 అనే వార్తా సంస్థ తెలిపింది. రాకెట్ పడిన ప్రాంతంలో మంటలు చెలరేగగా.. అగ్నిమాపక దళాలు తక్షణమే స్పందించి ఆర్పివేశాయి. మరో రాకెట్​ను ఐరన్ డోమ్​గా పిలిచే యాంటీ రాకెట్ సిస్టమ్ అడ్డుకుందని అక్కడి మీడియా వెల్లడించింది.

israel lebanon
చెలరేగిన మంటలు
israel lebanon
మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

లెబనాన్ ఆర్మీ అధికారులు ఈ ఘటనపై స్పందించలేదు. అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ సంప్రదించినప్పటికీ.. ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆర్టిలరీ షెల్స్.. దక్షిణ లెబనాన్​లోని గ్రామాల్లో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాకెట్లు ఎక్కడి నుంచి ప్రయోగించారనే విషయంపై స్పష్టత లేదు.

israel lebanon
మంటలు ఆర్పేసిన తర్వాత

పాలస్తీనా వర్గాలదే!

హెజ్బొల్లా ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించలేదని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఈ పని లెబనాన్​లోని పాలస్తీనా బృందాలదేనని అనుమానిస్తున్నారు. అయితే, వీరికి హెజ్బొల్లా మద్దతు ఇచ్చి ఉంటుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: 'కశ్మీర్​లో 40% మేర ఉగ్ర ఘటనలు తగ్గాయ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.