ETV Bharat / international

సౌదీ యువరాజుపై ఖషోగ్గీ కుటుంబం పిటిషన్​

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్​ బిన్ సల్మాన్​పై అమెరికాలో పిటిషన్​ దాఖలైంది. సల్మాన్​ ఇచ్చిన ఆదేశాలమేరకే ఖషోగ్గీని అత్యంత కిరాతకంగా హతమార్చారని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Family of slain Saudi journalist sues Saudi Crown Prince
సౌదీ యువరాజుపై ఖషోగ్గీ కుటుంబం పిటిషన్​
author img

By

Published : Oct 21, 2020, 12:19 PM IST

2018లో సంచలనం సృష్టించిన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో భాగంగా ఖషోగ్గీ కాబోయే భార్య తరఫున హేటీస్​ సెంగీజ్​ అనే మానవ హక్కుల సంస్థ మంగళవారం ఫెడరల్​ పిటిషన్​ దాఖలు చేసింది.

సౌదీ యువరాజు మహమ్మద్​ బిన్ సల్మాన్​తో పాటు అతని మంత్రివర్గంలోని కొందరు అధికారులు పక్కా ప్రణాళికతో ఖషోగ్గీని హతమార్చారని పిటిషన్​ లో పేర్కొన్నారు.

" జమాల్ ఖషోగ్గీకి అమెరికా అంటే విశ్వాసం ఉంది. అమెరికాలో ఏదైనా సాధ్యపడుందని అతని నమ్మకం. ఇక్కడ మాకు న్యామం జరుగుతుందని ఆశిస్తున్నాం."

---హేటీస్​ సెంగీజ్​ మానవ హక్కుల సంస్థ

గతంలో ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురు అధికారులకు సౌదీ కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

ఖషోగ్గీ మరణం..

అక్టోబరు 2, 2018న సౌదీఅరేబియా ఇస్తాంబుల్​లోని సౌదీ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లిన ఖషోగ్గీ తిరిగి రాలేదు. సౌదీ యువరాజు మహమ్మద్​ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు ఖషోగ్గీని కిరాతకంగా కార్యాలయంలోనే హతమార్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.