ETV Bharat / international

బతిమలాడుతున్నా డిక్కీలో పడేసి.. టియర్​ గ్యాస్​ వదిలి.. పోలీసుల రాక్షసత్వం! - బ్రెజిల్ పోలీసులు

Brazil News: బ్రెజిల్​లో ఓ నల్లజాతీయుడి మృతికి కారణమయ్యారు పోలీసులు. అతడ్ని క్రూరంగా హింసించి ఎస్​యువీ డిక్కీలో పడేసి టియర్​ గ్యాస్​తో హింసించారు. దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసి బ్రెజిల్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.

brazil-cops
బ్రెజిల్​లో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన.. వెల్లువెత్తిన నిరసనలు..
author img

By

Published : May 27, 2022, 12:45 PM IST

Brazil cops: బ్రెజిల్​లో ఓ నల్లజాతీయుడి పట్ల ఇద్దరు పోలీసులు అత్యంత కర్కషంగా వ్యవహరించారు. అతడ్ని మోకాళ్లతో నొక్కిపట్టి హింసించారు. ఆ తర్వాత తీసుకెళ్లి ఎస్​యూవీ డిక్కీలో పడేశారు. టియర్ గ్యాస్ ఆన్ చేసి అతడ్ని ఊపిరాడకుండా హింసించారు. ప్లీజ్ నన్ను వదిలేయండని అరుస్తూ ప్రాధేయపడినా పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించారు. డిక్కీ నుంచి బాధితుడి కాళ్లు బయటకు కన్పించాయి. అతను గిలాగిలా కొట్టుకోవడం చూసి స్థానికులు నివ్వెరపోయారు. అయినా చుట్టుపక్కల వారిని పోలీసులు అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత బాధితుడు జెనివాల్డో డి జీసస్​ శాంటోస్​ను(38) పోలీస్ స్టేషన్​కు తరలిస్తుండగా.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఊపిరాడకపోవడం వల్లే శాంటోస్​ మరణించాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. సెర్గిపె రాష్ట్రంలో యుంబౌబలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

brazil-cops
బ్రెజిల్​లో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన.. వెల్లువెత్తిన నిరసనలు..
brazil-cops
బ్రెజిల్​లో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన.. వెల్లువెత్తిన నిరసనలు..

Brazil police brutality: ఈ విషయం తెలిసి బ్రెజిల్​ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. పోలీసులే శాంటోస్​ను హత్యచేశారని దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. పోలీసుల క్రూర చర్యను తీవ్రంగా ఖండించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే ఫెడరల్ హైవే పోలీసులతో శాంటోస్ దురుసుగా ప్రవర్తించాడని అధికారులు తెలిపారు. అతడు తిరగబడటం వల్లే పోలీసులు అతడ్ని బంధించారని పేర్కొన్నారు. శాంటోస్​ను నియంత్రించాలనే ఉద్దేశంతోనే టియర్ గ్యాస్ ప్రయోగించారని వివరణ ఇచ్చారు. అది ప్రాణాంతకం కాదని చెప్పారు.

Brazil police news: ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో స్పందించారు. ఏం జరిగిందో ఫెడరల్ పోలీసులను అడిగి తెలుసుకుంటానని చెప్పారు. రెండు వారాల క్రితం ఓ దుండగుడు డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు కాల్చిచంపిన ఘటనను గుర్తు చేశారు. శాంటోస్ ఘటనపై ఫెడరల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. 10 రోజుల్లోగా సవివరణ నివేదిక సమర్పించాలని అధికారులు ఆదేశించారు.

  • THIS IS WHAT HAPPENED IN BRAZIL YESTERDAY:

    2 white cops transformed their car in a GAS CHAMBER and killed a black man with mental problems. They killed a black guy like they used to do in Auschwitz.

    pic.twitter.com/4W04zo0LAw

    — Cecília Danson (@ceciliadanson) May 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శాంటోస్ ఘటనకు కొద్ది రోజుల ముందే హైవే పోలీసులు రియో డి జెనీరోలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 20మంది చనిపోయారు. గత్యంతరం లేకే తాము బలగాలను ఉపయోగించి అంత మందిని హతమార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. కానీ స్థానిక మీడియా మాత్రం పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. 2020లో అమెరికాలోనూ జార్జ్​ ఫ్లాయిడ్​ అనే నల్లజాతీయుడి పట్ల కిరాతకంగా వ్యవహరించి అతని మృతి కారణమయ్యారు పోలీసులు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రహింసకు దారి తీసింది.

ఇదీ చదవండి: మీనమేషాలు లెక్కించారు! గంటసేపు మారణహోమం జరిగినా కదలని పోలీసులు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.